Condoms Order : 9940 కండోమ్స్ ఆర్డర్ చేసిన ఒకే ఒక్కడు.. 2023 అతడికి రసికోత్సవమేమో!

Best Web Hosting Provider In India 2024

దక్షిణ ఢిల్లీకి చెందిన వ్యక్తికి 2023 చాలా శృంగార సంవత్సరం కావచ్చు. ఎందుకంటే అతడు గత సంవత్సరం ఆన్ లైన్ డెలివరీ ద్వారా 9,940 కండోమ్‌లను ఆర్డర్ చేశాడు. అంటే రోజుకు 27 కండోమ్‌లు. ఈ నంబర్ విని అందరూ ఆశ్చర్యపోతున్నారు. 2023 ఆయనకు రసికోత్సవమేమోనని కామెంట్స్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

ఆ డెలివరీ యాప్ వ్యవస్థాపకుడు మాట్లాడుతూ.. ఒక వ్యక్తి ఒకే రోజులో 83 కండోమ్‌లను ఆర్డర్ చేశాడని, వాటిని తన ఇంటి వద్దకే డెలివరీ చేశామని పేర్కొన్నాడు. ఇన్ని కండోమ్‌లను ఒక్కడే వాడాడా లేక ఎవరికైనా ఇచ్చేందుకు తీసుకొచ్చాడా అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

కొందరు అతడు మెడికల్ షాపు పెట్టి ఉండొచ్చని కామెంట్స్ చేస్తున్నారు. అయితే 2023లో కొంతమంది కస్టమర్లు ప్రవర్తన డెలివరీ యాప్ సంస్థలకు వింతగా అనిపించింది. ఎందుకంటే ఒకరు ఒకే నెలలో 38 లోదుస్తులను ఆర్డర్ చేశారు. బహుశా అవి ఉతక్కుండా పడివేసి ఉంటాడని కామెంట్స్ వస్తున్నాయి.

మరొకరు 80,267 గంగాజలం బాటిళ్లను ఆర్డర్ చేశారు. ఇలా 2023లో కొన్ని వింతలు జరిగాయి. ఆన్ లైన్‌లో ఈ లెక్కలు చూసి జనాలు షాక్ అవుతున్నారు.

మరికొన్ని డెలివరీ సంస్థలు కూడా కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయటపెట్టాయి. కొత్త సంవత్సరం వేళ ఇండియాలో నిమిషానికి 1244 బిర్యానీలు ఆర్డర్ ఇచ్చారట. ఇక హోటళ్ల నుంచి నేరుగా తీసుకెళ్లిన వారి వివరాలు తెలిస్తే కచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. అంతేకాదు 2 లక్షల కిలోల ఉల్లిపాయలు, 1.8 లక్షల బంగాళదుంపలు కూడా ఆర్డర్ ఇచ్చారు. ఇవి కొన్ని సంస్థలు చెబుతున్న లెక్కలే. ఇక అన్ని కలిపితే ఎంత అవుతుందో..? ఇక కండోమ్స్ కూడా గంటకు 1722 ఆర్డర్ ఇచ్చారట.

ఓయో రూములు కూడా ఎక్కువగా బుక్ అయ్యాయని లెక్కలు చెబుతున్నాయి. కేవలం డిసెంబర్ 30, 31 తేదీల్లో ఓయో రూమ్స్ 2.3 లక్షలు బుక్ అయ్యాయి. ఏడాది మెుత్తం 6.7 లక్షలు మాత్రమే. కానీ న్యూ ఇయర్ కు ముందు విపరీతంగా రూమ్స్ బుక్ అయ్యాయి. ఇలా 2023వ సంవత్సరం దిమ్మ తిరిగే లెక్కలు చెప్పి వెళ్లింది.

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024