![](https://www.netisamajam.com/wp-content/uploads/2024/01/maxresdefault_1704240824760_1704240835274.jpg)
Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2024/01/maxresdefault_1704240824760_1704240835274.jpg)
Akaash Vani Web Series: సామజవరగమన సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది రెబా మోనికా జాన్. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాతో పెద్ద హిట్‌ను అందుకున్నది. సామజవరగమన తర్వాత ఓ వెబ్‌సిరీస్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది రెబా మోనికా జాన్.
ట్రెండింగ్ వార్తలు
దాదా ఫేమ్ కెవిన్, రెబా మోనికాజాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆకాష్ వాణి వెబ్ సిరీస్ జనవరి 5 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. తమిళంలో గత ఏడాది రిలీజైన ఈ సిరీస్‌ను అదే పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సిరీస్‌కు ఇనాక్ అబ్లే దర్శకత్వం వహించాడు. ఏడు ఎపిసోడ్స్‌తో ఈ సిరీస్ తెరకెక్కనున్నట్లు సమాచారం. ప్రతి ఏపిసోడ్ నిడివి 30 నిమిషాల పైనే ఉంటుందని అంటున్నారు.
మనస్పర్థలతో విడాకులు తీసుకున్న ఓ జంట అనుకోని పరిస్థితుల్లో తిరిగి ప్రేమికులుగా ఎందుకు నటించాల్సివచ్చింది? ఈ నాటకంలో వారు ఎదుర్కొన్న సమస్యలను వినోదాత్మక పంథాలో దర్శకుడు ఇనాక్ ఆకాష్ వాణి సిరీస్‌లో ఆవిష్కరించాడు. ఆకాష్ వాణి తమిళ వెర్షన్‌లో కెవిన్ కామెడీ టైమింగ్‌తో పాటు రెబా మోనికా జాన్‌తో అతడి కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని మెప్పించింది.
దాదాతో బిగ్గెస్ట్ హిట్…
దాదా సినిమాతో గత ఏడాది బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నాడు కెవిన్. నాలుగు కోట్ల బడ్జెట్‌తో చిన్న సినిమాగా రిలీజైన దాదా 30 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. 2023లో కోలీవుడ్‌లో నిర్మాతలకు అత్యధిక లాభాలను మిగిల్చిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. దాదాతో కోలీవుడ్‌లో బిజీగా మారిన కెవిన్ ప్రస్తుతం స్టార్, కిస్ అనే సినిమాలు చేస్తున్నాడు.
టాపిక్