రాజకీయ నాయకుడంటే ఇలా ఉండాలని నిరూపించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

Best Web Hosting Provider In India 2024

కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి 

కాకినాడ‌:  రాజకీయ నాయకుడంటే ఇలా ఉండాలని నిరూపించిన నాయకుడు మన జగనన్నఅని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి కొనియాడారు. కాకినాడ‌లో ఏర్పాటు చేసిన‌  వైయ‌స్ఆర్ పెన్షన్‌ కానుక పెంపు కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే, లబ్ధిదారులు మాట్లాడారు.

ఎమ్మెల్యే ద్వారంపూడి ఏమ‌న్నారంటే..
నమస్కారం, 2024లో మొట్టమొదటి సమావేశానికి కాకినాడ పట్టణానికి విచ్చేసిన జగనన్నకు హ్యపీ న్యూ ఇయర్‌. ఏదైతే ఒక మాట మీద నిలబడే నాయకుడి కింద పనిచేయడం మా అదృష్టం, రాజకీయ నాయకుడంటే ఇలా ఉండాలని నిరూపించిన నాయకుడు మన జగనన్న, మాతో పాటు ఏపీ ప్రజలు కూడా అదృష్టవంతులు, 2019లో నేను ఎమ్మెల్యే అయ్యే సమయానికి కాకినాడ పట్టణంలో ఇచ్చిన పెన్షన్‌లు 14,700, కానీ ఇప్పుడు జగనన్న మంచితనంతో ఈ రోజు సుమారు 29,100 మందికి పెన్షన్‌లు ఇస్తున్నారు, అదీ ప్రభుత్వమంటే, గతంలో పెన్షన్‌ కావాలంటే ఎవరైనా చనిపోతే అధికారుల చుట్టూ తిరిగి లంచాలు ఇవ్వాలి, కానీ ఇప్పుడు అర్హులైతే చాలు పెన్షన్‌ ఇస్తున్నారు, మాట ఇచ్చిన ప్రకారం రూ. 3,000 ఇస్తున్నారు, రాబోయే రోజుల్లో అన్ని పథకాలు అందుతాయి, ఇదే జనవరిలో వైయ‌స్ఆర్‌చేయూత ఇస్తున్నారు, చంద్రబాబు ఎన్నికల ముందు పెన్షన్‌ పెంచారు, కానీ జగనన్న మాట ఇచ్చిన ప్రకారం పెంచారు, రెండు రూపాయలకు కిలో బియ్యం ఎన్‌టీఆర్‌ పెట్టారు, వైయ‌స్ఆర్ ఆరోగ్యశ్రీ పెట్టారు, ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ కూడా ఆయనదే, దీనిని తీయగలరా ఎవరైనా, ఈ పథకాలు ఎవరూ తీయలేరు, కానీ ఇప్పుడు జగనన్న అమ్మ ఒడి తీసుకొచ్చారు, వైయ‌స్ఆర్‌  చేయూత తీసుకొచ్చారు, చంద్రబాబు ఒక్క పథకమైనా పెట్టారా మీరు చెప్పండి, ప్రజలకు అబద్దాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అందరినీ మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది, ఇలాంటి వ్యక్తిని బంగాళాఖాతంలో కలిపినా తప్పులేదు, మీరు ఎక్కడైనా ఒక్క రూపాయి లంచం ఇచ్చారా, లంచాలు లేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగనన్న ప్రభుత్వం, ఇంత మంచి చేసిన ముఖ్యమంత్రికి మనం అంతా జేజేలు పలకాలి, జగనన్న ఏ మీటింగ్‌కు వెళ్ళినా నా వల్ల లబ్ధి జరిగి ఉంటే మీరు ఆశీర్వదించండి అంటారు, కాకినాడలో 94 వేల కుటుంబాలు ఉంటే 84 వేల కుటుంబాలు నవరత్నాల పథకాల ద్వారా లబ్ధిపొందారు, రాబోయే 90 రోజులు మీరు జగనన్న కోసం పనిచేయండి, చంద్రబాబు, పవన్‌బాబు, లోకేష్‌బాబు ఎంతమంది బాబులు వచ్చినా నమ్మం, ప్రలోభాలకు గురి అవ్వమని మీ ఓటును ఫ్యాన్‌ గుర్తుకు వేయండి, ఈ 90 రోజులు చాలా మాయ మాటలు చెబుతారు, మీరు నమ్మవద్దు, కుట్రలు నమ్మవద్దు, కాకినాడలో ప్రతిపక్షం ఏ డివిజన్‌కైనా వెళ్ళి అభివృద్ది గురించి అయినా అడగండి, అన్నీ చేశాం, కాకినాడలో వాటర్‌ పైప్‌లైన్, వాటర్‌ ట్రీట్మెంట్‌కు సంబంధించి నిధులు మంజూరు చేయాలని కోరుతున్నాను, మీ కోరిక ప్రకారం 175 కు 175 గెలవాలి, మీకు కాకినాడ పట్టణాన్ని గెలిచి గిఫ్ట్‌ గా ఇస్తాను, థ్యాంక్యూ. 

ఓపిక ఉన్నంతవరకు జగన్‌బాబుకే నా ఓటు: వరలక్ష్మి, లబ్ధిదారు, కాకినాడ

జగన్‌ బాబు నమస్కారం, నాకు గత ప్రభుత్వంలో ఎవరూ పెన్షన్‌ ఇవ్వలేదు, ఏ అధికారి ఇవ్వలేదు బాబు, కానీ వైయ‌స్ జగన్‌ బాబు మీరు వచ్చిన రెండో నెలలోనే పెన్షన్‌ తీసుకున్నాను, నాకు 2,250 నుంచి ఇప్పుడు 3,000 తీసుకుంటున్నాను, నా పెద్ద కొడుకు నా జగన్‌ బాబు ఒకటో తారీఖు తెల్లారేసరికి వలంటీర్‌ వచ్చి పెన్షన్‌ ఇస్తున్నాడు, గతంలో పెన్షన్‌లు ఎప్పుడిస్తారో తెలిసేది కాదు, ముసలి, ముతక వీటి కోసం తిరిగేవారు, వైయ‌స్ జగన్‌ బాబు మీరు చల్లగా ఉండాలి, మీరు పాదయాత్రలో మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు, నా పిల్లలకు కూడా అన్నీ అందుతున్నాయి, జగన్‌ బాబు నాకు ఇంటి స్ధలం ఇచ్చారు, నేను ఇల్లు కట్టుకుంటున్నా, నాకు సొంత ఇల్లు ఉంది, నాకే భయం లేదు, కరోనా వచ్చినా అన్నీ వైయ‌స్‌ జగన్‌ బాబు చూసుకుంటారు, కరోనా సమయంలో అన్నీ ఇచ్చి ఆదుకున్నారు, ఆరోగ్యశ్రీ లో పాతిక లక్షల వైద్యం చేస్తున్నారు, ఇంకేం కావాలి మాకు, మీరు మాట తప్పను మడమ తిప్పను అన్నారు, అలాగే చేస్తున్నారు, మీరు మా పెద్ద కొడుకులా మాకు రూ. 3 వేలు ఇస్తున్నారు, నాలాంటి అనేకమంది ముసలివాళ్ళని జగన్‌బాబు ఆదుకుంటున్నారు, నా ఓపిక ఉన్నంతవరకు జగన్‌బాబుకే ఓటేసి గెలిపించుకుంటాను.

ఆ దేవుడి రూపంలో మాకు సాయం చేస్తున్నారు: క్రిష్ణవేణి, లబ్ధిదారు, కాకినాడ 

జగనన్నా నమస్కారం, నాకు ఇద్దరు పిల్లలు, మా ఆయన కరోనా సెకండ్‌ వేవ్‌లో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు, ఆయనకు ఆరోగ్యశ్రీలో చికిత్స చేశారు, ఆ తర్వాత నాకు వితంతు ఫించన్‌ వచ్చింది, నేను ఎలా బతకాలి అనుకునే సమయంలో నాకు ఫించన్‌ వచ్చి ఆదుకుంది, మీరు పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు, కరోనా సమయంలో మరణించిన వారికి ఇచ్చే రూ. 50 వేలు కూడా అందాయి, ఆ డబ్బుతో చిన్న షాప్‌ పెట్టుకుని జీవిస్తున్నాను, నేను వివిధ పథకాల ద్వారా లబ్ధిపొందాను, సుమారు రూ. 1.70 లక్షలు నేను లబ్ధిపొందాను, మా అత్తగారు కూడా ఫించన్‌ తీసుకుంటున్నారు, మీ నవరత్నాల పథకాలు మా జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి, మీరు ఆ దేవుడి రూపంలో మాకు సాయం చేస్తున్నారు. మీరే మాకు ఎప్పటికీ సీఎంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.

Best Web Hosting Provider In India 2024