VV Vinayak On OTT: దర్శకులకు పెద్ద శత్రువు ఓటీటీ.. డైరెక్టర్ వీవీ వినాయక్ ఆవేదన

Best Web Hosting Provider In India 2024

ఠాగూర్, ఆది, కృష్ణ, అదుర్స్ వంటి హిట్ సినిమాలతో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు వీవీ వినాయక్. తాజాగా ఆయన ఓటీటీలు దర్శకులకు శత్రువులుగా మారాయంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. “సినిమా హిట్ ప్లాప్ ఎఫెక్ట్ డైరెక్టర్లపై ఉండటం అనేది మొదటి నుంచి ఉంది. రాఘవేంద్ర రావు లాంటి పెద్ద దర్శకుడికి కంటిన్యూగా ఫ్లాప్‌లు వచ్చినా మళ్లీ సినిమాలు చేసేవారు” అని వీవీ వినాయక్ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు

“ఇప్పుడు కనిపిస్తున్న ఈ వేరియేషన్స్ అన్నీ ఇప్పట్లే ఉండేవి కాదు. కానీ, ఇప్పుడు దర్శకుడి గురించి చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. నిజానికి దర్శకుడు ఒక కథ చెప్పినా, సినిమా చేయాలన్నా కలెక్టివ్‌గా అందరి నిర్ణయాలు తీసుకునే చేస్తాడు. ఏదైనా ఏకాభిప్రాయంతోనే చేస్తాడు. కానీ, సినిమా ప్లాప్ అయితే మాత్రం డైరెక్టర్ మీదకు తోసేస్తున్నారు. హిట్‌లో మాత్రం చాలా చిన్న భాగం ఇస్తున్నారు” అని డైరెక్టర్ వినాయక్ ఆవేదన వ్యక్తం చేశాడు.

“కథలో కంటెంట్ ఉంటేనే చూడటం అనేది ఇప్పుడే కాదు. ఎప్పటి నుంచో ఉంది. సినిమా ఎలా ఉన్నా థియేటర్స్‌కు వెళ్లి చూసేవాళ్లు ఇప్పటికీ ఉన్నారు. ఓటీటీ వచ్చిన తర్వాత కాస్తా తగ్గినా సినిమా కొంచెం బాగున్నా.. థియేటర్స్‌కు వస్తారు. పెద్ద చిన్న అనే తేడా లేకుండా ఓటీటీ అనేది దర్శకులకు శత్రువు అనే చెప్పాలి. నాటకానికి సినిమా ఎలా శత్రువో.. సినిమాకు టీవీ ఎలా శత్రువో.. ఇప్పుడు ఓటీటీ కూడా దర్శకులకు శత్రువే” అని వీవీ వినాయక్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

“ఇప్పుడు అందరూ ఫోన్‌లలోనే సినిమా చూసేస్తున్నారు. ఇప్పటికిప్పుడు థియేటర్స్‌కు వెళ్లి సినిమా చూడాల్సిన అవసరం ఏముంది. నెక్ట్స్ వీక్ ఆగితే ఎలాగూ ఓటీటీకి వచ్చేస్తుంది కదా అని అనుకుంటున్నారు. ఓటీటీకి వస్తే నిర్మాతలు సేఫ్‌లో ఉంటారని అనుకున్నారు. కానీ, ఇప్పుడు వాళ్లు కూడా ఏం చేస్తున్నారంటే సినిమా హిట్ అయితే ఫుల్ అమౌంట్ ఇస్తున్నారు. లేదంటే కొంచెం ఇచ్చి మానేస్తున్నారు. ఓటీటీ వల్ల నష్టం తప్పితే ఉపయోగం లేదు. ముందు ముందు ఘోరంగా ఉండొచ్చు” అని వీవీ వినాయక్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

“ఇప్పుడు థియేటర్స్‌కు వెళ్తుంటే హిట్ సినిమాకు కూడా 20, 30 మంది ఉండటం లేదు. ఒకప్పుడు హిట్ సినిమా అంటే థియేటర్స్ కళకళలాడేవి. థియేటర్స్‌లో పండుగ వాతావరణం ఉండేది. ఆ జనాన్ని చూస్తే భలే ఆనందం వేసేది. కానీ, థియేటర్స్ వద్ద జనమే కనిపించడం లేదు. పెద్ద సినిమా రిలీజ్ అంటే జాతరలా అనిపించేది. ఓసారి అమెరికా వెళ్లినప్పుడు మేం ఉదయం 8 గంటలకే సినిమాకు వెళ్తాం. కొన్నికొన్నిసార్లు మిడ్ నైట్ సినిమాకు వెళ్తాం అంటే అక్కడ వాళ్లు మీకు పిచ్చి అన్నారు. ఆ పిచ్చి ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు” అని వినాయక్ అన్నారు.

“ఖైదీ 150 మూవీ ఫస్ట్ షో మా థియేటర్‌లో వేయాలను అనుకున్నాం. అనుకున్నట్లుగానే మిడ్ నైట్ మా థియేటర్స్‌లో షో వేసేసరికి ఇద్దరు మెగాస్టార్ ఫ్యాన్స్ హైదరబాద్ నుంచి మా ఊరు వెళ్లిపోయారు. మేం హైదరాబాద్ నుంచి వచ్చాం. టికెట్స్ కావాలని అంటుంటే వాళ్లు నాకు ఫోన్ చేశారు. సర్లే అని వాళ్లని ముందు ఇంటికి తీసుకుని వెళ్లి భోజనం పెట్టించి సినిమా చూపించమని మా వాళ్లకు చెప్పాను. సినిమా అంటే అంత పిచ్చి ఉండేది అని” వినాయక్ పేర్కొన్నారు.

WhatsApp channel

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024