
Best Web Hosting Provider In India 2024

Biryani Masala Recipe: మనదేశంలో ఎక్కువమందికి ఇష్టమైన ఆహారం బిర్యాని. హైదరాబాద్ బిర్యానీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏ వేడుక వచ్చినా బిర్యాని ఆర్డర్లు హోరెత్తిపోతాయి. ఇంట్లోనే దీన్ని టేస్టీగా వండుకోవచ్చు. అయితే బిర్యానీ మసాలా బయట కొనుక్కొని వండుకుంటూ ఉంటారు. దీన్ని బయట కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి చేసుకుంటే ఆరు నెలల పాటు తాజాగా ఉంటుంది.
ట్రెండింగ్ వార్తలు
బిర్యానీ మసాలా రెసిపీకి కావలసిన పదార్థాలు
బిర్యానీ ఆకులు – నాలుగు
మిరియాలు – రెండు స్పూన్లు
అనాసపువ్వు – ఆరు
జాపత్రి – నాలుగు
లవంగాలు – ముప్పై
జాజికాయ – ఒకటి
మరాఠీ మొగ్గలు – ఆరు
సోంపు గింజలు – రెండు స్పూన్లు
దాల్చిన చెక్క – పెద్ద ముక్క
యాలకులు – ఇరవై
షాజీరా – రెండు స్పూన్లు
జీలకర్ర – మూడు స్పూన్లు
ధనియాలు – అరకప్పు
బిర్యానీ మసాలా రెసిపీ
1. బిర్యానీ మసాలాను ఒక్కసారి తయారు చేసుకుంటే ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది.
2. ఆరు నెలలకు ఎంత అవసరమో అంత మోతాదులో మీరు మసాలాలను తీసుకోవడం అవసరం.
3. ఇక్కడ మేము ఒక మూడు నెలలకు సరిపడా బిర్యాని మసాలాకు కావాల్సిన కొలతలు చెప్పాము.
4. స్టవ్ మీద కళాయి పెట్టి మరాఠీ మొగ్గలు, ధనియాలు, అనాసపువ్వు, జాజికాయ, జాపత్రి వంటివి వేయించాలి.
5. ఆ తర్వాత షాజీరా, జీలకర్ర, దాల్చిన చెక్క ముక్క, లవంగాలు , మిరియాలు, సోంపు గింజలు కూడా వేసి వేయించాలి.
6. అన్నింటినీ తీసి పక్కన పెట్టుకోవాలి. చివరిలో బిర్యానీ ఆకులని మాత్రం వేయించాలి. ఇవి త్వరగా వేగిపోతాయి కాబట్టి చివర్లో వీటన్ని వీటిని వేయడం మంచిది.
7. వేయించిన వీటన్నింటిని మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి.
8. దీన్ని గాలి చొరబడని డబ్బాలో వేసి దాచుకోవాలి.
9. మూత తీసి ఉంచితే పాడైపోయే అవకాశం ఉంది. అలాగే సువాసన కూడా బయటికి పోతుంది.
10. కాబట్టి దీన్ని డబ్బాలో వేసి మూత పెట్టి సాధారణ ఫ్రిజ్లో పెట్టుకుంటే ఆరు నెలల పాటు తాజాగా ఉంటుంది.
11. బిర్యాని వండినప్పుడు రెండు స్పూన్లు వేసుకుంటే మంచి సువాసనతో పాటు రుచిని అందిస్తుంది.
టాపిక్