Best Web Hosting Provider In India 2024
Saindhav Trailer Launch: విక్టరీ వెంకటేష్ (Venkatesh) నటించిన కొత్త సినిమా సైంధవ్. హిట్ మూవీ సిరీస్ డైరెక్టర్ డాక్టర్ శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వం వహించిన సైంధవ్ మూవీని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైంధవ్ మూవీ జనవరి 13న సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా తాజాగా సైంధవ్ మూవీ ట్రైలర్ విడుదల చేశారు.
ట్రెండింగ్ వార్తలు
సైంధవ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో విక్టరీ వెంకటేష్ కామెంట్స్ చేశారు. “మీ అందరి సమక్షంలో ట్రైలర్ లాంచ్ చేయడం చాలా అనందంగా ఉంది. ట్రైలర్ అద్భుతంగా వచ్చింది. సినిమా కూడా తప్పకుండా మీ అందరికీ బాగా నచ్చుతుంది. సంక్రాంతి రోజు సినిమా రిలీజ్ చేస్తున్నాం. ఎప్పటిలానే మీ అందరి ప్రేమ అభిమానాలు ప్రోత్సాహం కావాలి. 75వ చిత్రంగా ‘సైంధవ్’ లాంటి సినిమా చేయడం అదృష్టంగా బావిస్తున్నాను” అని వెంకటేష్ తెలిపారు.
“దర్శకుడు, డీవోపీ, మ్యూజిక్ డైరెక్టర్ మా టీం అంత అద్భుతంగా వర్క్ చేశారు. మా నిర్మాతలు సినిమాకి కావాల్సిన ప్రతిది సమకూర్చారు. న్యూ ఏజ్ యాక్షన్ థ్రిల్లర్ చేయాలని ఎప్పటి నుంచో ఉండేది. ‘సైంధవ్’ మంచి ఎమోషన్ తో న్యూ ఏజ్ యాక్షన్ తో ఫాస్ట్ పేస్డ్ ఫిలిం. తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది. 15వ నిమిషం నుంచే ప్రేక్షకులు సినిమాలో ఇన్వాల్ అవుతారు. సైంధవ్ ప్రేక్షకులు డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది” అని వెంకటేష్ చెప్పుకొచ్చారు.
“‘సైంధవ్’ నా కెరీర్ లో ఒక బెస్ట్ ఫిల్మ్. సంక్రాంతికి రియల్ ట్రీట్. తప్పకుండా అందరినీ అలరిస్తుంది” అని విక్టరీ వెంకటేష్ వెల్లడించారు. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే సైంధవ్ సినిమాలో బాలీవుడ్ పాపులర్ యాక్టర్ నవాజుద్ధీన్ సిద్ధిఖీ విలన్‌గా కనువిందు చేయనున్నారు. ఇప్పటికే ట్రైలర్‌లో ఆయన కనిపించిన తీరు ఆకట్టుకుంటోంది. రూ. 17 కోట్ల ఇంజక్షన్ చుట్టూ సైంధవ్ కథ ఉండనున్నట్లు తెలుస్తోంది.
కాగా సైంధవ్ మూవీలో నవాజుద్ధీన్ సిద్ధిఖీతో పాటు తమిళ హీరో ఆర్య, హీరోయిన్లు శ్రద్ధా శ్రీనాథ్, ఆండ్రియా, రుహానీ శర్మ, సారా, జయప్రకాష్, కీలక పాత్రలు పోషించారు. సైంధవ్ ట్రైలర్‌లో హీరో వెంకటేష్‌తో పాటు ఆర్య, ఆండ్రియా సైతం యాక్షన్ సీక్వెన్స్‌లలో అదరగొట్టారు. ఆర్య నెగెటివ్ షేడ్ క్యారెక్టర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక పాప డ్యాన్స్ చేస్తూ తన తండ్రిని అనుకరిస్తూ చాలా ప్లజెంట్ గా ట్రైలర్ ప్రారంభమైయింది ఓపెనింగ్ సీక్వెన్స్ తండ్రీకూతుళ్ల బంధాన్ని అద్భుతంగా ఎస్టాబ్లెస్ చేసింది. తండ్రికి తన కూతురే సర్వస్వం. కూతురుకి తండ్రి సూపర్‌హీరో.
దురదృష్టవశాత్తు, ఆమెకు స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే అరుదైన వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది. వ్యాధిని నయం చేసే ఇంజక్షన్ ధర 17 కోట్లు. దీంతో కథానాయకుడు తన పాత స్నేహితులను, ప్రత్యర్థులను తిరిగి కలవాలని నిర్ణయించుకుంటాడు. అతని గతం ఏమిటి? ఆర్య, నవాజుద్దీన్ సిద్ధిఖీ మొదలైన బ్యాచ్‌తో అతనికి వున్న వైలెంట్ గతం ఏమిటిన్నది సినిమాలో తెలియనుంది.