Best Web Hosting Provider In India 2024
Hyderabad Crime News: జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం ఓ కిలాడీ లేడిని అరెస్ట్ చేశారు.రోడ్డుపై వెళ్లే వారిని అర్జెంట్ గా వెళ్ళాలని లిఫ్ట్ అడిగి…..ఆపై ఒంటిపై బట్టలను తానే చించుకొని అత్యాచారం చేశారని,పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అమాయకులను బెదిరించి వారి నుంచి అందినకాడికి డబ్బులు గుంజుతున్న నయిమా సుల్తాన్ (32) అనే కిలాడి మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ట్రెండింగ్ వార్తలు
పోలీసుల వివరాల ప్రకారం…
జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.… గత కొన్ని రోజులుగా నయిమా సుల్తాన్ అనే మహిళ జూబ్లీహిల్స్ నుంచి కేబీఆర్ పార్క్ వరకు అర్జెంట్ గా వెళ్ళాలని అటుగా వెళుతున్న వాహనదారులను లిఫ్ట్ అడుగుతుంది.కారో బండో ఎక్కిన తరువాత తన బట్టలను చించుకొని….నాపై అత్యాచారం చేశావని బెదిరిస్తోంది. తాను న్యాయవాది అని…అడిగినంత డబ్బు ఇవ్వకపోతే పలు సెక్షన్ల కింద కేసులు పెడతానని బెదిరిస్తుంది.
తాజాగా ఆ కిలాడి లేడీ బెదిరింపులతో….. ఒక డ్రైవర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యడంతో ఆ మహిళ బాగోతం బయటపడింది.డ్రైవర్ ఫిర్యాదు మేరకు నయిమా సుల్తాన్ పై ఐపిసి సెక్షన్ 389 సెక్షన్ కింద జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.కాగా నయిమా సుల్తాన్ పై హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే 17 కేసులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.ఆ మహిళా నుంచి వందలాది కేసులకు సంబంధించిన కేస్ స్టడీ వివరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.వాటి ఆధారంగానే ఏ కేసుల్లో ఎలాంటి శిక్ష పడుతుందో తెలుసుకొని వాహనదారుల పై బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
రిపోర్టింగ్: కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా