Best Web Hosting Provider In India 2024
TS IPS Transfers : తెలంగాణలో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. తాజాగా 23 మంది ఐపీఎస్ అధికారులను సీఎస్ శాంతికుమారి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. సాంకేతిక సర్వీసుల అదనపు డీజీపీగా వి.వి.శ్రీనివాసరావును నియమించారు. ఆయనకు పోలీసు నియామక బోర్డు ఛైర్మన్ అదనపు బాధ్యతలు అప్పగించారు. కోఆర్డినేషన్ డీఐజీగా గజరావు భూపాల్ ను నియమించారు. మహిళా భద్రత విభాగం డీఐజీగా రెమా రాజేశ్వరి, రాజేంద్రనగర్ డీసీపీగా సీహెచ్ శ్రీనివాస్, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ-3గా ఆర్.వెంకటేశ్వర్లును నియమించారు. రామగుండం సీపీగా ఎల్.ఎస్.చౌహాన్, ఎల్బీనగర్ డీసీపీగా సీ.హెచ్ ప్రవీణ్‌కుమార్, టీఎస్ ట్రాన్స్‌కో ఎస్పీగా డి.ఉదయ్‌కుమార్ రెడ్డి, మాదాపూర్ డీసీపీగా జి.వినీత్ కు బాధ్యతలు అప్పగించారు.
ట్రెండింగ్ వార్తలు
మెదక్ ఎస్పీగా బాలస్వామి
జోగులాంబ డీఐజీగా జోయల్ డేవిస్ ను నియమించారు. ఐపీఎస్ అధికారి విష్ణు వారియర్‌ను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసింది. పీవీ పద్మజను మల్కాజ్‌గిరి డీసీపీగా నియమించగా, నిర్మల్ ఎస్పీగా జానకీ షర్మిల, జానకీ ధరావత్‌ను సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా బదిలీ చేశారు. ఖమ్మం సీపీగా సునీల్‌దత్, సీఐడీ ఎస్పీగా ఎస్.రాజేంద్ర ప్రసాద్ ను బదిలీ చేశారు. ఆదిలాబాద్ ఎస్పీగా గౌష్ ఆలం, ములుగు ఎస్పీగా శబరీష్, మేడ్చల్ డీసీపీగా నిఖితా పంత్, సిద్దిపేట సీపీగా బి.అనురాధ, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీగా బిరుదురాజు రోహిత్ రాజు, మెదక్ ఎస్పీగా బి.బాలస్వామి, భయశంకర్‌భూపాలపల్లి ఎస్డీగా అశోక్‌కుమార్ ను నియమించారు.
ఐఏఎస్ ల బదిలీలు
తెలంగాణలో మరోసారి భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ కార్యదర్శిగా స్మితా సబర్వాల్ ను నియమించగా… ఇరిగేషన్ కార్యదర్శిగా రాహుల్ బొజ్జాను నియమించింది ప్రభుత్వం. సీఎంవో సంయుక్త కార్యదర్శిగా సంగీతా సర్వే సత్యనారాయణను నియమించగా.. నల్గొండ జిల్లా కలెక్టర్ గా హరిచంద్రను నియమించింది. మొత్తం 26 మంది అధికారులకు స్థాన చలనం కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అధికారుల బదిలీలు…
ఇరిగేషన్ శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జ.
నల్గొండ కలెక్టర్‌గా దాసరి హరిచంద్ర.
తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా స్మితా సబర్వాల్ బదిలీ.
గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా మహేశ్ దత్ ఎక్కా.
ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీగా శరత్ నియామకం.
ట్రైబల్ వెల్ఫేర్ ఎండీగా చిత్తం లక్ష్మి.
మున్సిపల్ అడ్మనిస్ట్రేషన్ డైరెక్టర్ గా దివ్యా.
మహబూబ్ బాద్ జిల్లా కలెక్టర్ గా కుమార్ సింగ్.
పురావస్తు శాఖ డైరెక్టర్ గా భారతి హోలికేరి.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా శశాంక నియామకం.
సీఎం ఓఎస్డీగా వేముల శ్రీనివాసులు.
సీఎంవో సెక్రటరీగా ఐఎఫ్‌ఎస్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి నియామకం.