Best Web Hosting Provider In India 2024

YSRTP Merge with Congress : తెలుగు రాజకీయాల్లో మరో రాజకీయ పార్టీ ప్రస్థానం ముగియబోతుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ షర్మిల… తెలంగాణ గడ్డపై సొంతంగా పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పేరుతో కొంతకాలం పార్టీని నడిపారు. తెలంగాణవ్యాప్తంగా సుదీర్ఘమైన పాదయాత్రను చేశారు. కానీ కీలకమైన అసెంబ్లీ ఎన్నికల వేళ పోటీ నుంచి తప్పుకున్నారు. ఇదే సమయంలో హస్తం పెద్దలతో టచ్ లోకి వెళ్లారు. హస్తిన వెళ్లి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో చర్చలు కూడా జరిపారు. ఆ చర్చల ప్రధాన ఉద్దేశ్యం పార్టీ విలీనం…! మొదట్లో ఈ విలీన ప్రతిపాదన వార్తలు షర్మిల ఖండిస్తూ వచ్చినప్పటికీ…. ఆ తర్వాత పరోక్షంగా విలీనానికి సై అనేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారు. అయితే ఇవాళ అధికారికంగా వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయటమే కాకుండా… హస్తం కండువా కప్పుకునేందుకు రెడీ అయిపోయారు వైఎస్ షర్మిల.
ట్రెండింగ్ వార్తలు
ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న షర్మిల… ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలవబోతున్నారు. పార్టీ విలీనంపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా సోనియాగాంధీ,రాహుల్ గాంధీ, ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. అయితే ఈ సందర్భంగానే… షర్మిల పాత్రపై కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటన చేస్తుందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో షర్మిల సేవల్ని వినియోగించుకోవడంపై కాంగ్రెస్ పార్టీ సైతం స్పష్టమైన అవగాహనతో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఆమెకు జాతీయ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ పదవిని ఇస్తారనే చర్చ ఉంది. అంతేకాకుండా రాజ్యసభకు పంపటమా లేక ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు ఇవ్వాలా అనే దానిపై కూడా హస్తం పెద్దలు కసరత్తు చేస్తున్నారంట..! ఇక షర్మిలతో పాటు మంగళగిరికి చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి(రాజీనామా చేసిన ఎమ్మెల్యే) కూడా కాంగ్రెస్ లో చేరొచ్చని సమాచారం.
షర్మిల ప్రస్థానంలోని పలు విషయాలు:
- ప్రస్తుతం 49 ఏళ్ల వైఎస్ షర్మిల.. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సోదరి.
2. 2009లో విమాన ప్రమాదంలో వైఎస్ఆర్ మరణించారు. ఈ నేపథ్యంలో ఆయన మరణాన్ని తట్టుకోలేక చాలా మంది వైఎస్ఆర్ అభిమానులు చనిపోయారు. వారికి సంఘీభావం తెలిపేందుకు ఆయన సోదరుడు జగన్మోహన్ రెడ్డి యాత్రను ప్రారంభించారు. అయితే దీనికి కాంగ్రెస్ హైకమాండ్ మద్దతు ఇవ్వలేదు. ఈ క్రమంలోనే ఆయనతో పాటు తల్లి వైఎస్ విజయమ్మ కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు.
3. షర్మిల కూడా 2020 వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ లో భాగంగానే పని చేశారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు… పార్టీ కార్యక్రమాలను దగ్గరుండి చూశారు.
4. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిల… తన సోదరుడు వైఎస్ జగన్ స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున విస్తృతంగా ప్రచారం చేశారు.
5. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరమవుతూ వచ్చారు. అంతేకాకుండా… తెలంగాణ వేదికగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ప్రకటించారు షర్మిల. కొత్త పార్టీ పెట్టిన ఏడాది తర్వాత ఆమె తల్లి వైఎస్ విజయమ్మ తన కుమారుడి పార్టీ అయిన వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి షర్మిల పార్టీకి మద్దతు ప్రకటించారు.
6. తెలంగాణ వ్యాప్తంగా సుదీర్ఘమైన పాదయాత్రను చేశారు వైఎస్ షర్మిల. కానీ తాజాగా జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతిచ్చి పోటీ నుంచి విరమించుకున్నారు.
8. షర్మిల మత ప్రచారకుడైన బ్రదర్ అనిల్ కుమార్‌ను వివాహం చేసుకున్నారు. అనిల్ కుమార్ హిందువు. కానీ వైఎస్ఆర్ కుటుంబం క్రిస్టియన్ కావడంతో 1995లో షర్మిలను వివాహం చేసుకున్న తర్వాత క్రైస్తవ మతంలోకి మారారు బ్రదర్ అనిల్. 1998లో అనిల్ కుమార్ మత ప్రచారకుడిగా మారారు.
9. షర్మిల- బ్రదర్ అనిల్ దంపతులకు రాజా రెడ్డి, అంజిలి రెడ్డి పిల్లలు ఉన్నారు.
10. ఫిబ్రవరి 17న అట్లూరి ప్రియతో రాజా రెడ్డి వివాహం జరగనుంది. ప్రియా చట్నీస్ ఫుడ్ చైన్ యజమాని అట్లూరి విజయ వెంకట ప్రసాద్ మనవరాలే ఈమె. వైఎస్ రాజా రెడ్డి, ప్రియా అట్లూరి అమెరికాలో మాస్టర్స్ చదువుతున్న సమయంలో కలిశారు.
సంబంధిత కథనం