ఎన్టీఆర్ జిల్లా / నందిగామ మండలం :
ది.12-10-2022(బుధవారం) ..
సంక్షేమం -అభివృద్ధే ధ్యేయంగా పరిపాలన ..
అడవిరావులపాడు గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం”లో భాగంగా సంక్షేమ పథకాలను వివరిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నందిగామ మండలంలోని అడవిరావులపాడు గ్రామంలో గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బుధవారం సాయంత్రం ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ – ప్రజల సమస్యలను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు అడిగి తెలుసుకున్నారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని , గ్రామాలలో ఇంటింటికి తాగునీటి కుళాయి పథకం, సీసీ డ్రైనేజీల నిర్మాణం , గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలు ,విలేజ్ హెల్త్ క్లినిక్ లు , సచివాలయ భవనాలను నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు ,అవి పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు చేపట్టినట్టు చెప్పారు ,అన్ని వర్గాలకు సమన్యాయం చేయడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమతమని , ప్రజా సంక్షేమమే పరమావధిగా ఆయన పాలన సాగిస్తున్నారన్నారు , సీఎం సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు , మూడేళ్ల పాలనలో ప్రతి కుటుంబానికి లబ్ధి జరిగేలా ప్రభుత్వం పని చేసిందని , ఆ లబ్ధిని వివరించడానికి గడపగడపకు వెళ్తున్నామని – అదేవిధంగా స్థానికంగా సమస్యలను కూడా తెలుసుకొని పరిష్కరించడానికి చర్యలు చేపడుతున్నామన్నారు , అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మరింత కాలం ముఖ్యమంత్రిగా కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పారు ..
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సూర వెంకట నరసమ్మ కొండ వైస్ ఎంపీపీ ఆకుల రంగ హనుమంతరావు , మండల పార్టీ కన్వీనర్ శివనాగేశ్వరరావు , ఎమ్మార్వో నరసింహారావు ,సచివాలయ సిబ్బంది- వాలంటీర్లు ,తదితరులు పాల్గొన్నారు ..