Best Web Hosting Provider In India 2024
Sam Bahadur OTT Release: విక్కీ కౌశల్ హీరోగా నటించిన సామ్ బహదూర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 నుంచి జీ5 ఓటీటీలో ఈ బాలీవుడ్ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లో సామ్ బహదూర్ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
ట్రెండింగ్ వార్తలు
ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను దాదాపు యాభై కోట్లకు జీ5 దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. థియేట్రికల్ రిలీజ్‌కు ముందే హక్కులను అమ్ముడుపోయినట్లు సమాచారం. థియేటర్లలో రిలీజైన యాభై రోజుల తర్వాత సామ్ బహదూర్ మూవీని ఓటీటీలో రిలీజ్ చేసేలా నిర్మాతలతో జీ5 ఒప్పందం చేసుకున్నట్లు చెబుతున్నారు.
ఆ ఒప్పందం మేరకు జనవరి 26న సామ్ బహదూర్ ఓటీటీలో రిలీజ్ అవుతోన్నట్లు తెలిసింది.ఇండియన్ ఫస్ట్ ఫీల్డ్ మార్షల్ మానేక్‌షా అలియాస్ సామ్ బహదూర్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ బాలీవుడ్ మూవీకి మేఘన గుల్జార్ దర్శకత్వం వహించింది.
120 కోట్ల కలెక్షన్స్…
బయోగ్రాఫికల్ వార్ డ్రామాగా దాదాపు 55 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన సామ్ బహదూర్ మూవీ థియేటర్లలో 120 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. సామ్ బహదూర్ సినిమాలో ఫాతిమా సనా షేక్, సన్యా మల్మోత్రా హీరోయిన్లుగా నటించారు.
ఈ సినిమాలో సామ్ బహదూర్ పాత్రలో విక్కీ కౌశల్ నటనకు ప్రశంసలు దక్కాయి. అతడి కెరీర్‌లోనే బెస్ట్ మూవీస్‌లో ఒకటిగా సామ్ బహదూర్ నిలిచింది 2017లో మేఘనా గుల్జార్ సామ్ బహదూర్ జీవితంపై సినిమా చేయాలని నిర్ణయించుకున్నది. దాదాపు ఐదేళ్ల పాటు సామ్ బహదూర్ జీవితంపై రీసెర్చ్ చేసి ఈ మూవీని తెరకెక్కించింది.
యానిమల్‌కు పోటీగా…
రణ్‌బీర్‌కపూర్, సందీప్ వంగా కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ యానిమల్‌కు పోటీగా సామ్ బహదూర్ థియేటర్లలో రిలీజైంది. యానిమల్ ప్రభంజనాన్ని తట్టుకొని ఈ మూవీ వంద కోట్ల వసూళ్లను సాధించడం గమనార్హం. తొలి రోజు కేవలం ఆరు కోట్ల వసూళ్లను మాత్రమే సామ్ బహదూర్ మూవీ రాబట్టింది.
మౌత్ టాక్‌తో రోజురోజుకు వసూళ్లు పెరిగాయి. మూడో రోజు 11, నాలుగోరోజు 15 కోట్ల వరకు వసూళ్లను సాధించింది. థియేటర్లతోపాటు ఓటీటీలో యానిమల్ మూవీతో సామ్ బహదూర్ పోటీపడబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. యానిమల్ మూవీ కూడా జనవరి 26నే ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు సమాచారం.
ఉరి తర్వాత….
ఉరి తర్వాత విక్కీ కౌశల్ కెరీర్‌లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్‌గా సామ్ బహదూర్ నిలిచింది. సామ్ బహదూర్‌కు ముందు విక్కీ కౌశల్ సోలో హీరోగా నటించిన ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ డిజాస్టర్‌గా నిలిచింది. షారుఖ్‌ఖాన్ డంకీలో విక్కీ కౌశల్ ఓ కీలక పాత్రలో నటించాడు.
ఆ సినిమా కూడా 400 కోట్ల వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం విక్కీ కౌశల్ మేరే మెహబూబ్ మేరే సనమ్, చవ్వా సినిమాలు చేస్తున్నాడు. చవ్వాలో విక్కీ కౌశల్ ఛత్రపతి శివాజీ పాత్రలో కనిపించబోతున్నాడు.ఈ ఏడాది ఈ రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటితో పాటు మరో నాలుగు సినిమాల్ని విక్కీ కౌశల్ అంగీకరించాడు.