Best Web Hosting Provider In India 2024
YS Sharmila joined the Congress Party: తెలుగు రాష్ట్రాల్లో మరో రాజకీయ పార్టీ ప్రస్థానం ముగిసినట్టైంది. తెలంగాణలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తందనుకున్న వైఎస్ షర్మిల.. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. దిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ సమక్షంలో వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో కలిపారు. హస్తం పార్టీ అగ్రనేతలు కండువా కప్పి ఆమెను ఆహ్వానించారు. షర్మిలతో పాటు ఆమె భర్త కూడా బ్రదర్ అనిల్ కూడా ఉన్నారు.
ట్రెండింగ్ వార్తలు
కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా మాట్లాడిన వైఎస్ షర్మిల…. కాంగ్రెస్ లో వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్‌ఆర్‌టీపీ) విలీనం చేయటం సంతోషంగా ఉందన్నారు. వైఎస్సార్ జీవితమంతా కాంగ్రెస్ కోసం పనిచేశారని చెప్పారు. తాను కూడా వైఎస్ఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నానని స్పష్టం చేశారు. పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తానని తెలిపారు.