White Shoes Cleaning : ఈ చిట్కాలు పాటిస్తే.. వైట్ షూ వేసుకున్నా మరక మంచిదే

Best Web Hosting Provider In India 2024

వైట్ షూస్ వేసుకుంటే కాస్త క్లాసిక్ లుక్ కనిపిస్తుంది. అందరిలోనూ మీరు ప్రత్యేకంగా కనిపిస్తారు. అయితే చాలా మంది ఎదుర్కొనే ప్రధాన సమస్య ఏంటంటే.. వైట్ షూస్ వేసుకుని ఒక్కసారి బయటకు వెళ్లి వస్తే చాలు.. దుమ్ము, మరకలు పడతాయి. దీంతో కాస్త ఇబ్బంది అనిపిస్తుంది. తర్వాత మీరు కనిపించే లుక్‌లో చాలా మార్పు కనిపిస్తుంది. కొందరైతే దగ్గరకు కూడా రారు. అందుకోసమే సింపుల్ టిప్స్ పాటిస్తే.. వైట్ షూస్ తలతల మెరిసిపోతాయి.

ట్రెండింగ్ వార్తలు

రోజువారీ దుస్తులు, పార్టీ, విహారయాత్ర వంటి ప్రతి దుస్తులతో తెల్లటి బూట్లు సరిపోతాయి. ఇవి చాలా క్లాసిక్ లుక్ ఇస్తాయి. అందుకే దాదాపు ఎక్కువ మంది తెలుపు రంగు బూట్లను ఇష్టపడతారు. వాటిని శుభ్రం చేయడం అనేది పెద్ద టాస్క్. కొందరైతే ఏకంగా నీటిలో నానెబెట్టేస్తారు. ఇలా చేస్తే బూట్లు పాడైపోతాయి. అలాకుండా చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే.. షూస్ మెరిసేలా చేయెుచ్చు.

దాదాపు ప్రతి ఒక్కరి వద్ద బూట్లు ఉంటాయి. ముఖ్యంగా నలుపు, తెలుపు బూట్లు కచ్చితంగా ఉంటాయి. అవసరాన్ని బట్టి ఏ రంగు బూట్లు వేసుకోవాలో డిసైడ్ అవుతారు. నలుపు, తెలుపు బూట్లు ఎలాంటి డ్రెస్ మీదకైనా సెట్ అవుతాయి. దీంతో వీటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మరకలు పడితే నల్లటి షూ సరే.. కానీ తెల్లటి షూ పరిస్థితే దారుణంగా ఉంటుంది. ఎంత క్లాసీగా ఉంటుందో.. మరక తర్వాత అంత ఘోరంగా తయారవుతుంది. దీని శుభ్రం చేయడం చాలా కష్టం.

డిష్ సోప్, వేడి నీరు తెల్లటి బూట్లను క్లీన్ చేసేందుకు మంచి చిట్కా. అన్ని రకాల పదార్థాలతో తయారు చేసిన బూట్లు శుభ్రం చేయడానికి ఈ పద్ధతి మంచిది. దీని కోసం మీరు చేయాల్సిందల్లా ఒక కప్పు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ డిష్ వాషింగ్ లిక్విడ్ మిక్స్ చేసి బాగా కలపాలి. దీని తర్వాత ఒక గుడ్డ లేదా టూత్ బ్రష్‌ తీసుకుని బూట్లు శుభ్రం చేయండి. అన్ని మరకలను తొలగించిన తర్వాత, వాటిని శుభ్రమైన నీటితో శుభ్రం చేసుకోండి. గాలికి పొడిగా ఉండేలా బూట్లు వేలాడదీయండి.

తెల్లటి బూట్ల రంగు మురికిగా మారిన తర్వాత నల్లగా మారితే బేకింగ్ సోడా, వెనిగర్ ఉపయోగించి పాలిష్ చేయండి. దీని కోసం ఒక టేబుల్ స్పూన్ గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ వైట్ వెనిగర్, అదే మొత్తంలో బేకింగ్ సోడా కలపాలి. అనంతరం టూత్ బ్రష్ ఉపయోగించి, వృత్తాకార కదలికలో షూలను స్క్రబ్ చేయండి. ఇప్పుడు బూట్లను గాలిలో కొంతసేపు ఆరనివ్వండి. తర్వాత శుభ్రమైన నీటితో కడిగి ఆరనివ్వాలి.

దంతాల మాదిరిగానే టూత్‌పేస్ట్ కూడా మీ తెల్లటి బూట్‌లను మెరిసేలా చేస్తుంది. దీని కోసం వైట్ టూత్‌పేస్ట్‌ని ఉపయోగించి ప్రయత్నించండి. బ్రష్‌పై టూత్‌పేస్ట్ పెట్టండి. షూలను క్లీన్ చేయండి. పదినిమిషాలు అలాగే ఉంచిన తర్వాత నీళ్లతో లేదా తడి గుడ్డతో కడగాలి. అప్పుడు మీ షూస్ తలతల మెరిసిపోతాయి.

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024