Best Web Hosting Provider In India 2024

CM Jagan Meet KCR Updates: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. ఎముక మార్పిడి చికిత్స తర్వాత తన సొంత నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్ ను పరామర్శించారు. పుష్పగుచ్ఛాన్ని అందించి పరామర్శించారు. అనంతరం కేసీఆర్ ను యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ వెంట ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్సీ రఘురాం, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు.
ట్రెండింగ్ వార్తలు
స్వాగతం పలికిన కేటీఆర్
గురువారం నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య తదితరులున్నారు. అంతకుముందు బేగంపేటకు ప్రత్యేక విమానం లో చేరుకున్న సీఎం జగన్ కు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్వాగతం పలికారు.
కేసీఆర్ నివాసంలో లంచ్…
మధ్యాహ్నం కేసీఆర్ నివాసంలోనే జగన్మోహన్ రెడ్డి భోజనం చేశారు. ఆ తర్వాత… లోటస్‌పాండ్‌లోని నివాసానికి వెళ్లారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ప్రస్తుతం ఆయన త్లలి వైఎస్ విజయమ్మ లోటస్‌పాండ్ లోనే ఉన్నారు. అయితే దాదాపు రెండేళ్ల తర్వాత లోటస్ పాండ్ లోని ఇంటికి వచ్చారు జగన్.
ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ జారిపడటంతో ఎడమ తుంటికి తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. వైద్యులు కేసీఆర్ కు తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. కేసీఆర్ వేగంగా కోలుకుంటున్నట్లు కొద్దిరోజుల కిందట వైద్యులు ప్రకటించారు. ఆ తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయగా… ప్రస్తుతం నందినగర్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. కేసీఆర్ కు 6 నుంచి 8 వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారు.