Best Web Hosting Provider In India 2024

IRCTC Kerala Tour Package : కేరళకు వెళితే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అక్కడి వాతావరణం ఇట్టే నచ్చేస్తుంది. కొన్ని రోజులు అక్కడే ఉండిపోవాలి అనిపిస్తుంది. అలా వెళ్లాలనుకునేవారికి ఐఆర్‌సీటీసీ మంచి ప్యాకేజీలు అందిస్తోంది. తక్కవ ధరలో వెళ్లి రావొచ్చు. చాలా ప్రదేశాలు తిరిగి రావొచ్చు. ఈ 2024లో లాంగ్ వీకెండ్స్ ఎక్కువగా ఉన్నాయి. అలాంటి వారు కూడా కేరళ టూర్ ప్యాకేజీని ప్లాన్ చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో నుంచి రైలులో వెళ్లాల్సి ఉంటుంది. గుంటూరు జంక్షన్, హైదరాబాద్, నల్గొండ, సికింద్రాబాద్, తెనాలి జంక్షన్ నుంచి టైన్ అందుబాటులో ఉంటుంది.
ట్రెండింగ్ వార్తలు
కేరళలోలని అలెప్పీ, మున్నార్ సందర్శించుకోవాలని అనుకునేవారు ఈ ప్యాకేజీని ఎంచుకోవచ్చు. KERALA HILLS & WATERS పేరుతో ఈ ప్యాకేజీని అందుబాటలో ఉంది. అలెప్పీ, మున్నార్‌తో పాటుగా పలు టూరిజం ప్రదేశాలు కవర్ అవుతాయి. జనవరి 9న ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. కావాల్సిన వారు బుక్ చేసుకోవచ్చు. 5 రాత్రులు, 6 రోజులు ఈ టూర్ ఉంటుంది.
మెుదటి రోజు మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి టూర్ ప్రారంభమవుతుంది. రాత్రి మెుత్తం జర్నీ ఉంటుంది. రెండో రోజు మధ్యాహ్నం 12.55 గంటలకు ఎర్నాకులం రైల్వేస్టేషన్ వెళ్తారు. అక్కడ నుంచి మున్నార్ లోని హెటల్ కి వెళ్లి రెస్ట్ తీసుకుంటారు. రాత్రి మున్నార్ లోనే బస చేయాల్సి ఉంటుంది.
మూడో రోజు ఉదయం ఎరవికులం జాతీయ పార్క్ ను సందర్శన ఉంటుంది. మెట్టుపెట్టి డ్యామ్, ఏకో పాయింట్ కు వెళ్తారు. రాత్రి కూడా మున్నార్ లోనే బస చేస్తారు. నాలుగోరోజు అల్లెప్పీకి వెళ్తారు. బ్యాక్ వాటర్ అందాలను చూసి ఎంజాయ్ చేయెుచ్చు. రాత్రి అల్లెప్పీలోనే ఉంటారు.
ఐదో రోజు హెటల్ నుంచి చెక్ అవుట్ చేస్తారు. అక్కడ నుంచి ఎర్నాకులం రైల్వే స్టేషన్ వెళ్తారు. ఉదయం 11.20 గంటలకు శబరి ఎక్సె ప్రెస్ లో హైదరాబాద్ కు తిరుగుపయనమవుతారు. మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వస్తారు. దీంతో టూర్ ముగుస్తుంది.
కంఫర్ట్ (3ఏ) క్లాస్ సింగిల్ షేరింగ్ కు రూ. 33,480 ధర ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 19,370 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.15,580 గా ఉంది. స్టాండర్డ్ క్లాస్ లో వేర్వురు ధరలు ఉంటాయి. 5 నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే చిన్నారులకు కూడా వేర్వురు ధరలు నిర్ణయించారు. ఈ టూర్‌లో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. పూర్తి వివరాల కోసం ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్ సైట్ సందర్శించండి.