Captain Miller Runtime: ధనుష్ కెప్టెన్ మిల్లర్ రన్‌టైమ్ ఇదే

Best Web Hosting Provider In India 2024

Captain Miller Runtime: తమిళ విలక్షణ నటుడు ధనుష్ నటించిన పాన్ ఇండియా మూవీ కెప్టెన్ మిల్లర్. ఈసారి సంక్రాంతి సినిమాగా రిలీజ్ అవుతోంది. అయితే కేవలం తమిళంలో మాత్రమే ప్రస్తుతానికి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. జనవరి 12న మూవీ రిలీజ్ కానుండగా.. తాజాగా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. అరుణ్ మాతేశ్వరన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

ఇక కెప్టెన్ మిల్లర్ మూవీ రన్‌టైమ్ 157 నిమిషాలుగా ఉంది. అంటే 2 గంటల 37 నిమిషాలు. ఈ సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్ ను మేకర్స్ ఆపారు. తెలుగులో సంక్రాంతికి పెద్ద సినిమాలు ఉండటంతో థియేటర్లు దొరకలేదు. దీంతో ప్రస్తుతానికి ఇక్కడ రిలీజ్ నిలిపేయాలని నిర్ణయించారు. తమిళంలోనూ కెప్టెన్ మిల్లర్ కు పోటీ ఉంది. అక్కడ శివ కార్తికేయన్ నటించిన అయలాన్ మూవీ నుంచి బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ ఉంది.

ప్రియాంకా మోహన్ ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ గా నటించింది. శివ రాజ్‌కుమార్, సందీప్ కిషన్ లాంటి వాళ్లు ముఖ్యమైన పాత్రలు పోషించారు. సెంథిల్ త్యాగరాజ్, అర్జున్ త్యాగరాజన్ కెప్టెన్ మిల్లర్ మూవీని నిర్మించారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

నిజానికి కెప్టెన్ మిల్లర్ డిసెంబర్ 15నే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్లు ఒక నెల ముందే మేకర్స్ అనౌన్స్ చేశారు. పొంగల్ సందర్బంగా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. 1930ల బ్యాక్‍డ్రాప్‍లో పీరియాడిక్ యాక్షన్ మూవీగా కెప్టెన్ మిల్లర్ రూపొందుతోంది. బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడే వీరుడు కెప్టెన్ మిల్లర్ పాత్ర చేస్తున్నారు ధనుశ్.

కెప్టెన్ మిల్లర్ మూవీ రెండు భాగాలుగా రావడం ఖాయమైందని సమాచారం బయటికి వచ్చింది. ఈ విషయంపై సినీ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ ట్వీట్ చేశారు. ధనుశ్ నటిస్తున్న కెప్టెన్ మిల్లర్ రెండు భాగాలుగా రావడం కన్‍ఫామ్ అయిందని పేర్కొన్నారు. గతంలో వచ్చిన కెప్టెన్ మిల్లర్ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్‍గా ఉంది. సినిమాపై అంచనాలను అమాంతం పెంచింది.

ఇక ఈ మధ్యే కెప్టెన్ మిల్లర్ ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా జరుపుకుంది. ఈ ఈవెంట్లో ఈ మధ్యే కన్నుమూసిన విజయ్ కాంత్ కు ధనుష్ ఓ మ్యూజికల్ నివాళి అర్పించాడు. ఇది అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఫ్యాన్స్ కోసం ఓ పాట పాడాలని కోరగా.. అతడు విజయ్ కాంత్ మూవీలోని పాట పాడటం విశేషం. అతడు పాడటం మొదలు పెట్టగానే అక్కడున్న వేలాది మంది అభిమానులు కూడా అతనితో కలిసి గళం విప్పారు.

ఇది విజయ్ కాంత్ కు అసలైన నివాళి అంటూ కొందరు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. ఇక కెప్టెన్ మిల్లర్ మూవీలో ధనుష్ చాలా డిఫరెంట్ స్టైల్లో కనిపిస్తున్నాడు. ఈ సినిమా కోసం అతని మేకోవర్ అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచింది. ఈ మూవీ తర్వాత డీ51, రాయన్ లాంటి సినిమాల్లో అతడు నటిస్తున్నాడు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024