Urfi Javed: ఆస్పత్రి పాలైన బిగ్ బాస్ బ్యూటి.. ఆ ఫొటో ఏంటీ, ఆ ట్వీట్ ఏంటీ అంటూ ఫైర్! వెంటనే డిలీట్

Best Web Hosting Provider In India 2024

Urfi Javed In Hospital: సోషల్ మీడియా సెన్సేషన్, విచిత్ర డ్రెస్సులతో అందరి కళ్లలో పడే ఉర్ఫీ జావేద్ ఆస్పత్రి పాలైనట్లుగా తెలుస్తోంది. తాజాగా ఆసుపత్రి బెడ్‌పై మొహానికి ఆక్సీజన్ మాస్క్ పెట్టుకుని ఉన్న ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది ఉర్ఫీ జావేద్. ఈ ఫొటోను గురువారం తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది ఉర్ఫీ జావేద్. అయితే, కొన్ని గంటల తర్వాత ఆ ఫొటోను డిలీట్ చేసింది ఉర్ఫీ జావేద్.

ట్రెండింగ్ వార్తలు

ఉర్ఫీ జావేద్ షేర్ చేసిన ఫొటోలో ఆమె ఆసుపత్రిలో పేషంట్స్ ధరించే దుస్తులు వేసుకుని మంచంపై కూర్చుంది. ఉర్ఫీ జావేద్ కళ్లు మూసుకుని, చిరునవ్వుతో, తన రెండు చేతులతో రెండు ఫింగర్స్ చూపిస్తూ పోజు ఇచ్చింది. ఇది శాంతికి, విక్టరీకి చిహ్నాం అని తెలుస్తోంది. అలాగే ఈ ఫొటోలో ఉర్ఫీ జావేద్ ఆక్సిజన్ మాస్క్ కూడా ధరించింది. ఆమె ఆసుపత్రిలో ఎందుకు చేరిందే తన అభిమానులకు, ఫాలోవర్లకు ఇన్ స్టాలో తెలుపలేదు.

అయితే, ఈ ఫొటోను షేర్ చేసిన ఉర్ఫీ జావేద్ ‘2024ను ఘనంగా ప్రారంభిస్తున్నాను’ అని రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అయింది. నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘హేయ్, ఏమైంది?’ అని సంభావనా సేథ్ కామెంట్ చేశారు. మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని ఓ అభిమాని ట్వీట్ చేశాడు. మరో వ్యక్తి ‘మంచి అనుభూతి చెందండి, అలాగే మీకు చాలా ప్రశాంతమైన కొత్త 2024 శుభాకాంక్షలు’ అని రాశారు. ‘నేను అయోమయంలో ఉన్నాను’ అని మరొకరు కామెంట్ చేశారు.

“ఇది ఎప్పటిలా వేసుకునే దుస్తుల డిజైనా, లేదా మీరు నిజంగా అనారోగ్యంతో ఉన్నారా?”, “త్వరగా కోలుకోండి” అంటూ చాలా మంది అభిమానులు రాసుకొచ్చారు. నువ్ ఉన్న పరిస్థితి ఏంటీ.. నువ్ పెట్టిన ట్వీట్ ట్వీట్ ఏంటీ అంటూ మరికొంతమంది ఫైర్ అయ్యారు. అందుకే ఆక్సీజన్ మాస్క్‌తో ఉన్న ఫొటోను ఉర్ఫీ జావేద్ వెంటనే డిలీట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇలా మరోసారి ఉర్ఫీ జావేద్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇదిలా ఉంటే ఉర్ఫీ జావేద్ క్రమం తప్పకుండా ఇన్ స్టా గ్రామ్‌లో పోస్టులు, ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఆమె ప్రత్యేకమైన, విచిత్రమైన, ఎవరూ ఎప్పుడు వేయని, వేసుకోలేని డిజైన్లతో దుస్తులను ధరిస్తూ అలరిస్తుంటుంది. అలా విచిత్ర వేషధారణలో చాలా మంది అభిమానులకు సైతం సంపాదించుకుంది ఉర్ఫీ జావేద్. అయితే కొన్నిసార్లు ఇలా విచిత్రమైన వేషధారణతో బెదిరింపులు కూడా తెచ్చుకుంది ఉర్ఫీ జావేద్.

గత ఏడాది భూల్ భులయా చిత్రంలోని రాజ్ పాల్ యాదవ్ లుక్‌ను ఉర్ఫీ జావేద్ రీక్రియేట్ చేసింది. ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దాంతో అనేకమంది దృష్టిని ఆ పిక్ ఆకర్షించింది. అది చూసిన పలువురు పండితులు ఉర్ఫీ జావేద్‌ను హెచ్చరించారు. అంతేకాకుండా ఆ వీడియోను తొలగించకపోతే తనకు హాని చేస్తానంటూ గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఉర్ఫీకి “హత్య బెదిరింపులు” సైతం వచ్చాయి.

ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు కూడా ఇచ్చింది ఉర్ఫీ జావేద్. ఇక బిగ్ బాస్ హిందీ ఓటీటీ సీజన్‌లో పాల్గొన్న ఉర్ఫీ జావేద్ మంచి ఫేమ్ సంపాదించింది. అంతకుముందు, ఆ తర్వాత పలు టీవీ సీరియళ్లలో కూడా నటించింది ఉర్ఫీ జావేద్.

హాస్పిటల్ బెడ్‌పై ఉన్న ఫొటో షేర్ చేసిన ఉర్ఫీ జావేద్‌పై నెటిజన్ల కామెంట్స్
హాస్పిటల్ బెడ్‌పై ఉన్న ఫొటో షేర్ చేసిన ఉర్ఫీ జావేద్‌పై నెటిజన్ల కామెంట్స్
WhatsApp channel

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024