
Best Web Hosting Provider In India 2024

Nayanthara Annapoorani: నయనతార అన్నపూర్ణి మూవీ డిసెంబర్ 29న నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. థియేటర్లలో కేవలం తమిళ భాషలోనే రిలీజైన ఈ మూవీ ఓటీటీలో మాత్రం తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైంది. థియేటర్లలో డిసెంబర్ 1న రిలీజైన ఈ మూవీ నెల రోజులు కూడా గడవక ముందే ఓటీటీలోకి వచ్చేసింది.
ట్రెండింగ్ వార్తలు
థియేటర్లలో అన్నపూర్ణి మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతోంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన సినిమాల్లో నేషనల్ వైడ్‌గా నవంబర్ వన్ ప్లేస్‌లో అన్నపూర్ణి నిలిచింది. బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల్ని దాటేసి అన్నపూర్ణి టాప్ ప్లేస్‌లోకి వచ్చేసింది. అన్నపూర్ణి సినిమాలో సత్యరాజ్, జై కీలక పాత్రలు పోషించారు. ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించాడు.
అన్నపూర్ణి కథ…
సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అమ్మాయిగా నయనతార ఈ సినిమాలో కనిపించింది. అన్నపూర్ణి చెఫ్ కావాలని కలలుకుంటుంది.తండ్రి మాత్రం ఎమ్‌బీఏ చేయాలని పట్టుపడతాడు. తండ్రికి ఎంబీఏ అని చెప్పి తన చిన్ననాటి స్నేహితుడు ఫర్హాన్ (జై) సహాయంతో చెఫ్ కోర్సులో జాయిన్ అవుతుంది తాను స్ఫూర్తిగా భావించే ఇండియన్ ఫేమస్ చెఫ్ ఆనంద్ సుందర్‌రాజన్ (సత్యరాజ్) అండతో ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీల్లో అన్నపూర్ణి ఎలా విజేతగా నిలిచింది. ఓ ప్రమాదంలో రుచి చూసే శక్తిని అన్నపూర్ణి ఎలా కోల్పోయింది అన్నదే ఈ సినిమా కథ.
వరదల ప్రభావం…
అన్నపూర్ణి సినిమాలో నయనతార యాక్టింగ్ బాగున్నా…కథలో కొత్తదనం లేకపోవడంతో సినిమా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. దానితో పాటు అన్నపూర్ణి రిలీజ్ టైమ్‌లో చెన్నైలో వరదలు రావడం కూడా సినిమా వసూళ్లపై ప్రభావాన్ని చూపించింది. అన్నపూర్ణి నయనతార హీరోయిన్‌గా నటించిన 75వ మూవీ. అన్నపూర్ణి సినిమాకు తమన్ సంగీతాన్ని అందించాడు. గత ఏడాదితమిళంలో నయనతార నటించిన అన్నపూర్ణితో ఇరైవన్ సినిమాలు డిజాస్టర్స్‌గా మిగిలాయి. ఈ రెండు సినిమాలు ఫెయిలైన నయనతారకు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం తమిళంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ తీసుకుంటున్న హీరోయిన్లలో ఒకరిగా నయనతార కొనసాగుతోంది.
జవాన్‌తో బాలీవుడ్ ఎంట్రీ…
జవాన్ సినిమాతో గత ఏడాది బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది నయనతార. షారుఖ్‌ఖాన్ హీరోగా నటించిన ఈ మూవీ థియేటర్లలో 1100 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. జవాన్ సినిమాకు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నర్మద అనే టాస్క్‌ఫోర్స్ పోలీస్ ఆఫీసర్‌గా యాక్షన్ ప్రధాన పాత్రలో నయనతార కనిపించింది. జవాన్‌తో బాలీవుడ్‌లో తొలి అడుగులోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్న నయనతారకు బాలీవుడ్‌లో పలు ఆఫర్స్ వరిస్తున్నాయి. కానీ కోలీవుడ్‌లో బిజీగా మారడంతో నయనతార హిందీలో సినిమాలు చేయలేకపోతున్నట్లు నయనతార తెలిపింది.
ప్రస్తుతం తమిళంలో టెస్ట్ సినిమా చేస్తోంది నయనతార. ఇందులో సిద్దార్థ్, మాధవన్ కీలక పాత్రలు పోషిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కుతోన్న మంగట్టిలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు సినిమాలకు మాత్రం నయనతార దూరంగా ఉంటోంది. డబ్బింగ్ సినిమాలతోనే టాలీవుడ్ ఆడియెన్స్‌కు పలకరిస్తోంది
టాపిక్