Best Web Hosting Provider In India 2024

కొబ్బరితో ప్రయోజనాలను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొబ్బరి నీరు, కొబ్బరితో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. వందకు వంద శాతం మంది కొబ్బరిని తీసి.. దాని చిప్పను మాత్రం పడేస్తారు. కానీ అలా చేయకుంటే సరైన విధానం వాడితే మంచి ప్రయోజనాలు మీ సొంతం అవుతాయి. ఎలా వాడాలో తెలియాలి అంతే. నిజానికి మన సంస్కృతి కొబ్బరి చెట్టును కల్పవృక్షంగా పూజిస్తుంది. చాలా మంది తెల్లవారుజామున నిద్రలేచి కొబ్బరి చెట్టును చూస్తారు. అన్ని పూజలు లేదా పండుగలకు కొబ్బరికాయ అవసరం. కొబ్బరితో వంటకాలు కూడా చేస్తారు.
ట్రెండింగ్ వార్తలు
కొబ్బరి, దాని నీరు ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటాయి. అంతే కాకుండా కొందరు కొబ్బరి పీచును కూడా వాడుతారు. కానీ దాదాపు అందరూ కొబ్బరి చిప్పను మాత్రం ఉపయోగించరు. చెత్తకుప్పల్లో పడేస్తుంటారు. నిజానికి కొబ్బరి చిప్పలతో అనేక విధాలుగా ప్రయోజనాలు ఉన్నాయి. దాని అద్భుతమైన ఉపయోగాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
గాయపడిన అవయవాలకు కొబ్బరి చిప్ప దివ్యౌషధం. కొబ్బరి చిప్పను ఎండలో ఆరబెట్టి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని పసుపుతో కలిపి ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి. ఇది గాయం కారణంగా వచ్చే వాపును తగ్గిస్తుంది.
చిన్నపిల్లలు, పెద్దల దంతాలు కొన్నిసార్లు పసుపు రంగులోకి మారుతాయి. పసుపు పళ్ళకు కొబ్బరి చిప్ప పొడితో శుభ్రం చేస్తే మంచిది. ఈ పొడిని సిద్ధం చేయడానికి చిప్పను ముందుగా నిప్పులో కాల్చాలి. తర్వాత మెత్తటి పొడిలా చేసుకోవాలి. ఆ పౌడర్‌లో కొంచెం బేకింగ్ సోడా మిక్స్ చేసి దానితో పళ్ళు తోముకుంటే దంతాల మీద పసుపు రంగు పోయి తెల్లగా మెరిసిపోతాయి.
అమ్మాయిలు, అబ్బాయిలు జుట్టు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. జుట్టు బాగా పెరగడానికి, చుండ్రు సమస్యల నుండి బయటపడటానికి చాలా రకాల మందులు వాడతారు. కొబ్బరి చిప్పతో చేసిన బొగ్గు జుట్టుకు చాలా మంచిది. ఇది జుట్టును పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. దీన్ని రెగ్యులర్‌గా ఉపయోగించవచ్చు. కాల్చిన కొబ్బరి చిప్పను కొబ్బరి నూనెలో కలిపి జుట్టుకు పూయాలి. ఇది స్కాల్ప్ pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. కొబ్బరి పొట్టు బూడిదను హెయిర్ మాస్క్‌గా కూడా ఉపయోగించవచ్చు. దీన్ని తలకు పట్టించి మసాజ్ చేసి షాంపూతో కడిగేయాలి.
అర్షమెులలు ఉన్నవారు కొబ్బరి చిప్పతో ప్రయోజనం పొందవచ్చు. కొబ్బరి చిప్పను నిప్పులో కాల్చి దాని పొడిని సిద్ధం చేసుకోవాలి. పొడిని బాగా జల్లెడ పట్టి నీటిలో వేసి ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. ఇలా రోజూ సమస్య దూరమవుతుంది.
మహిళలు బహిష్టు సమయంలో భరించలేని నొప్పిని అనుభవిస్తారు. ఇలాంటి సమస్య ఉన్నవారు కొబ్బరి చిప్పను కాల్చి దాని పొడిని నీటిలో వేసి తాగాలి. ఇది ఋతుస్రావంతో సంబంధం ఉన్న నొప్పిని తగ్గిస్తుంది. ఇది కొందరికి అలర్జీ సమస్యను కలిగిస్తుంది. ఇలాంటి సమస్య ఉన్నవారు వెంటనే దీని వాడకాన్ని ఆపేయాలి.