TS Mlc Bye Election: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Best Web Hosting Provider In India 2024


TS Mlc Bye Election: తెలంగాణ శాసనమండలిలో ఖాళీ అయిన రెండు స్థానాలను భర్తీ చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో రెండు స్థానాలు ఖాళీ అవడంతో వాటిని భర్తీ చేసేందుకు షెడ్యూల్‌ విడుదల చేశారు.

ట్రెండింగ్ వార్తలు

ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు ఉన్నారు. వీరిలో కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌ రెడ్డిలు శాసన సభకు ఎన్నిక కావడంతో డిసెంబర్ 9వ తేదీన తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. వీరిద్దరికి 2027 నవంబర్ 30వ తేదీ వరకు శాసన మండలి గడువు ఉంది. వీటితో పాటు యూపీలో ఖాళీ అయిన ఒక స్థానానికి కూడా ఉప ఎన్నిక జరుగనుంది.

జనవరి 11వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. జనవరి 18వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 19వ తేదీ వరకు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు జనవరి 22వ తేదీ వరకు గడువు ప్రకటించారు.

2024 జనవరి 29వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్ర నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కిస్తారు. ఫిబ్రవరి 1 వ తేదీ లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తారు.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొని ఉంది. కాంగ్రెస్ పార్టీ తరపున రకరకాల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే అభ్యర్థి ఎంపిక ఇప్పటికే పూర్తైందని రేవంత్ రెడ్డి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల సమయంలో రేవంత్‌ రెడ్డి వెంట నడిచిన వారిలో మహబూబ్‌ నగర్‌ చెందిన వ్యక్తి పేరు ఖరారు కావొచ్చని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ముఖ్యమంత్రి నుంచి భరోసా లభించినటక్టు ప్రచారం జరుగుతోంది.

గత కొన్నేళ్లగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల్లో కీలకంగా పాల్గొన్న సదరు వ్యక్తిని ఎంపిక చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

WhatsApp channel

Source / Credits

Best Web Hosting Provider In India 2024