Sailesh Kolanu on Saindhav Scene: నోట్లో కాల్చిన బుల్లెట్ అక్కడి నుంచి బయటకు.. సైంధవ్ డైరెక్టర్ ఫన్నీ రియాక్షన్

Best Web Hosting Provider In India 2024

Sailesh Kolanu on Saindhav Scene: టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ నటించిన సైంధవ్ మూవీ సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో రిలీజవుతున్న విషయం తెలుసు కదా. అయితే ఈ మూవీ నుంచి ఈ మధ్యే రిలీజైన ట్రైలర్ లో ఓ సీన్ పై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. హీరో వెంకటేశ్ ఓ వ్యక్తి నోట్లో పిస్టల్ పెట్టి కాలిస్తే.. బుల్లెట్ అతని కింది నుంచి బయటకు వచ్చినట్లుగా చూపించారు.

ట్రెండింగ్ వార్తలు

ఈ సీన్ పై ట్రోలింగ్ జరగడంతో సైంధవ్ మూవీ డైరెక్టర్ శైలేష్ కొలను స్పందించాడు. సాధారణంగా నోట్లో కాలిస్తే సాధారణంగా తల వెనుక నుంచి బుల్లెట్ బయటకు వస్తుంది కదా అన్న లాజిక్ కు విరుద్ధంగా ఈ సీన్ ఉండటంపై అతడు కాస్త ఫన్నీగా రియాక్టయ్యాడు. అది ఎలా సాధ్యమో ఓ పెద్ద వివరణ కూడా తన సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్ ద్వారా వివరించడం విశేషం.

ఆ సీన్ ఎలా సాధ్యమంటే..

శైలేష్ కొలను రియాక్షన్ ఇదీ.. “హహహ.. చాలా ఫన్నీగా ఉంది. నాకు అన్నింటినీ వివరించడం ఇష్టం కాబట్టి.. ఈ సీన్ గురించి కూడా వివరిస్తా. సాధారణంగా ఎవరైనా నోట్లో కాలిస్తే అది తల వెనుక భాగం నుంచి బయటకు వస్తుంది. కానీ ఓ వ్యక్తిని ఓ కోణంలో కూర్చోబెట్టి.. అతని నోట్లో పిస్టల్ పెట్టి బ్యారల్ ను 80 డిగ్రీల కోణంలో ఉంచితే.. బుల్లెట్ శరీరంలోని ముఖ్యమైన భాగాలకు తగిలే అవకాశం ఉంటుంది.

మీరు పోస్ట్ చేసిన డయాగ్రామ్ ను చూసుకుంటే.. సరిగ్గా కాలిస్తే బుల్లెట్ మొదట అతని అన్నవాహికను పంక్చర్ చేస్తుంది. తర్వాత లివర్, తర్వాత పాంక్రియాస్, బహుశా గుండెను కూడా. ఆ తర్వాత నేరుగా పెద్ద, చిన్న పేగులకు వెళ్తుంది. చివరికి కోలన్ లోకి వెళ్లి అక్కడి నుంచి బయటకు వస్తుంది.

ఇలా జరగాలంటే చాలా అనుభవం కావాలి. ప్రాక్టీస్ ద్వారా దీనిని సాధ్యం చేయొచ్చు. సినిమాలో సైకోకు ఉన్న ప్రత్యేకమైన నైపుణ్యం ఇది. థియరెటికల్లీ పాజిబుల్ అని మాస్ మూమెంట్ క్రియేట్ చేశా. కానీ వీడియో మాత్రం చాలా ఫన్నీగా ఉంది బ్రదర్” అంటూ ఓ సుదీర్ఘ పోస్ట్ చేశాడు.

సదరు అభిమాని పోస్ట్ చేసిన వీడియోతోపాటు డైరెక్టర్ శైలేష్ కొలను ఇచ్చిన వివరణ కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. మరోవైపు వెంకటేశ్ నటించిన సైంధవ్ మూవీ.. జనవరి 13న రిలీజ్ కాబోతోంది. హిట్ ఫ్రాంఛైజీతో మంచి పేరు సంపాదించిన శైలేష్ కొలను డైరెక్షన్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

బాలీవుడ్ న‌టుడు న‌వాజుద్దీన్ సిద్ధిఖీ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. సైంధ‌వ్ సినిమాతోనే న‌వాజుద్దీన్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అంతే కాకుండా మ‌రో ఇంపార్టెంట్ రోల్‌లో కోలీవుడ్ హీరో ఆర్య క‌నిపించ‌బోతున్నాడు.

సైంధ‌వ్ సినిమా తెలుగు, హిందీతో పాటు పాన్ ఇండియ‌న్ లెవ‌ల్‌లో రిలీజ్ అవుతోంది. సైంధ‌వ్ సినిమాను తొలుత క్రిస్మ‌క్‌కు రిలీజ్ చేయాల‌ని భావించారు. కానీ ప్ర‌భాస్ స‌లార్ క్రిస్మ‌ర్‌కు బాక్సాఫీస్ బ‌రిలో నిల‌వ‌డంతో సైంధ‌వ్ సంక్రాంతికి వ‌చ్చేస్తోంది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024