Best Web Hosting Provider In India 2024
రాష్ట్ర బీసీ సంక్షేమం,సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ
ఎన్నికల ముందు కులానికో వాగ్దానం.. ఎన్నికలయ్యాక తోకలు కత్తిరిస్తానంటాడు
ఇంతకాలం చంద్రబాబు చేసిన ద్రోహాన్ని బీసీలు గ్రహించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్కీములన్నీ టీడీపీ స్కామిస్టులు దోచేశారు
ఇక మీ మాయ మాటలు,రోత రాతలు బీసీలు పట్టించుకోరు
బీసీలు చైతన్యవంతులయ్యారు…మీ ఉచ్చులో ఇక ఎన్నటికీ పడరు.
2024లో బీసీలే మరోసారి టీడీపీకి గుణపాఠం చెప్పబోతున్నారు.
సామాజిక న్యాయానికి అర్ధం, పరమార్ధం చెప్పింది వైఎస్ జగన్ గారే.
మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ స్పష్టీకరణ
గన్నవరం: బీసీలను బానిస వర్గాలుగా చూసిన పెత్తందార్లు చంద్రబాబు అండ్ కో..! అని రాష్ట్ర బీసీ సంక్షేమం,సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక న్యాయం పదాలకు అర్ధం, పరమార్ధం చెప్పింది వైయస్ జగన్ మాత్రమే అని పేర్కొన్నారు. గతంలో ఈ వర్గాల వారిని టీడీపీ వారు బానిసలుగా చూశారు. సమాజంలో బీసీలను బాధిత వర్గాలుగా మార్చారు. బలహీన వర్గాలు బాధలో ఉంటేనే పెత్తందార్ల ముందు సాగిలపడి, వారు చెప్పినట్లు వింటారు అన్నది వారి నమ్మకం అంటూ ధ్వజమెత్తారు. రాష్ట్ర బీసీ సంక్షేమం,సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గన్నవరంలో మీడియాతో మాట్లాడారు.
వైయస్ జగన్ నిర్ణయాలతో టీడీపీ వెన్నులో వణుకు:
– వైయస్ జగన్ నిర్ణయాల వల్ల ప్రజల్లో లభిస్తున్న ఆదరణ చూసి టీడీపీ బెంబేలెత్తుతోంది..ఆ పార్టీ నాయకులు కంపిస్తున్నారు.
– దానికి నిదర్శనమే ఈ రోజు ఈనాడులో ‘పెత్తందారి పోకడ’ అనే శీర్షికతో వచ్చిన వార్తే.
– బీసీ వర్గాలను బానిస వర్గాలు చూసిన పెత్తందార్లు టీడీపీ, చంద్రబాబు అండ్ కో..నే.
– ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు కొంత మంది బీసీలు ఆయన పట్ల ఆకర్షితులైన మాట వాస్తవం.
– ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిగా చేసిన సందర్భంలో చంద్రబాబుకు మద్దతు పలికిన ప్రతి ఒక్క నాయకుడూ చంద్రబాబు వెన్నుపోటులో వాటాదారేలే.
– యనమల, అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణ వంటి నేతలంతా ఆ మోసంలో వాటాదారులు.
– ఇంత కాలం బలహీనవర్గాలను పలువిధాలుగా మోసం చేసి, మీరు చేసిన మోసాన్ని ప్రత్యర్థులపై నెట్టి, ప్రజల దృష్టిని మరల్చి అధికారం పొందిన సందర్భాలున్నాయి.
– కానీ ఈ రోజు అది సాధ్యం కాదని చంద్రబాబుకు కూడా తెలిసిపోయింది. ఎందుకంటే బీసీలు అంత బలంగా ఉన్నారు. చంద్రబాబు మోసాన్ని బీసీలు గ్రహించారు.
– రాజకీయ వ్యూహంలో భాగంగా, జగన్ గారు తీసుకుంటున్న నిర్ణయాలకు టీడీపీలో భయం పుట్టిందనేది వాస్తవం.
– అందుకే వారు ప్రజాస్వామ్య వాదులు బాధపడేలా తమ భాషను వాడుతున్నారు.
– సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తిపై బండారు సత్యనారాయణ, అచ్చెన్నాయుడులు వాడిన భాషను ఎవరూ హర్షించరు.
సామాజిక న్యాయానికి అర్ధం, పరమార్ధం చెప్పింది వైఎస్ జగన్ గారే:
– ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ సామాజిక న్యాయం పదాలకు అర్ధం, పరమార్ధం చెప్పింది వైఎస్ జగన్ గారు మాత్రమే.
– గతంలో ఈ వర్గాల వారిని టీడీపీ వారు బానిసలుగా చూశారు. సమాజంలో బీసీలను బాధిత వర్గాలుగా మార్చారు.
– బలహీన వర్గాలు బాధలో ఉంటేనే పెత్తందార్ల ముందు సాగిలపడి, వారు చెప్పినట్లు వింటారు అన్నది వారి నమ్మకం.
– వైయస్ జగన్ గారు ఒక్క స్ట్రోక్‌తో పేద వాడు పెత్తందారుల వద్దకు వెళ్లకుండా, ఎవరి సిఫార్సులు లేకుండా, ఎవరి చుట్టూ తిరిగే పనిలేకుండా, ప్రతి నెలా అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను బాధ్యతగా డీబీటీ ద్వారా అందిస్తున్నారు.
– గతంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల స్కీములన్నీ గతంలో టీడీపీ స్కామిస్టులు దోపిడీ చేశారు.
– ఈ రాష్ట్రంలో పేదవాడి ఆరోగ్యం గురించి చంద్రబాబు ఏనాడైనా ఆలోచించాడా?
పేదవాడు చదువు గురించి ఆలోచించాడా?. పేదవాడికి ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీషు మీడియం చెప్పించాలని ఆలోచించాడా..?
– టీడీపీ నాయకులు ఈ విషయాన్ని చంద్రబాబును ప్రశ్నించండి.
– ఆరోగ్య శ్రీని ఆనాడు వైయస్ఆర్ ప్రవేశపెడితే.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కార్పొరేట్ ఆస్పత్రుల బాగు కోసం పనిచేశాడు.
– ఆరోగ్య శ్రీలో 2300 ప్రొసీజర్స్ ఉంటే దాన్ని 1000 ప్రొసీజర్స్‌కి తగ్గించాడు.
– చంద్రబాబుకు ఒకటే ధైర్యం..తనకు ఈనాడు ఉంది..తనకు ఏబీఎన్ ఉంది, టీవీ5 టీవీ చానల్ ఉందన్నదే.
– తనకు అవసరం వస్తే ఎవడి కాళ్లైనా పట్టుకోగలననే ధైర్యం ఆయనది.
– ఈ ధైర్యంతో ప్రజలను ఏమార్చారు. దాన్ని ప్రజలు తెలుసుకోవడానికి కొంత ఆలస్యం అయ్యింది.
– ప్రత్యేకంగా బీసీ వర్గాలు చంద్రబాబు చేసిన మోసాన్ని తెలుసుకోడానికి కొంత ఆలస్యమైంది.
– ఆదరణ అన్నాడు..ఇంకా ఆ పదాన్ని ఉచ్ఛరిస్తున్నారు..బీసీ నేతలారా ఆలోచించండి.
– కులవృత్తి చేసుకునే వారిని విద్యావంతులుగా చేస్తేనే సామాజికంగా ఎదుగుదల ఉంటుందని మేధావులు చెప్పారు.
– ఎప్పుడైనా చంద్రబాబు ఇలా ఆలోచించాడా? పది శాతం కడితే 90 శాతం లోన్ అంటూ ఎన్నికల ముందు వాగ్దానాలు చేస్తాడు. ఎన్నికలయ్యాక నా దగ్గరకు వస్తే.. తోకలు కత్తిరిస్తానని బెదిరిస్తాడు.
– ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ద్వారా బీసీ బిడ్డలను ఇంజినీరింగ్, డాక్టర్ లాంటి ఉన్నత చదువులు చదివించిన వైఎస్సార్ గారిలా చంద్రబాబు ఎప్పుడైనా ఆలోచించాడా?
బాబుకు ఎందుకు బాధ..?:
– బదిలీల అంటూ మాట్లాడుతున్నాడు. రాజకీయ వ్యూహంలో భాగంగా, కొంతమంది అభ్యర్థులను మార్పులు, చేర్పులు చేస్తే చంద్రబాబుకు ఎందుకు బాధ?
– మార్పులు, చేర్పులకు ఎమ్మెల్యేలు, మంత్రులు అనే బేధం లేదు. దానికి నేనూ అతీతుడిని కాదు. జగన్ గారి నిర్ణయాన్ని స్వాగతించాను.
– దానికి మాకు బాధ లేదుగానీ.. మీరు బాధపడటమేంటి..? కారణం మీరనుకున్న స్ట్రాటజీ పారడం లేదు.
– కారణం, స్థానిక నాయకులపై నిందలేశాం..ప్రజలందరూ నమ్మేశారు..ఇక వాళ్లకు ఓట్లు వేయకుండా మీకు వేస్తారని మీరు భావించారు. మార్పులు, చేర్పులతో మీ పాచిక పారటం లేదు.
– ఇన్నాళ్ళూ బీసీలను మోసం చేసిన మీరు.. జయహో బీసీ అనటానికి సిగ్గు ఎక్కడ లేదు..? బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత మీకెక్కడుంది?
– అచ్చెన్నాయుడిని అడుగుతున్నా…రాజమండ్రిలో పవన్ కల్యాణ్ వస్తే నిన్ను పక్కకి గెంటేశారు. చంద్రబాబు బీసీలకు ఇచ్చే ప్రాధాన్యత ఏమిటో నీకు ఇంకా అర్థం కాలేదా..
– చంద్రబాబు తన చుట్టూ నలుగురు బీసీ నాయకులను, యనమల, అచ్చెన్నాయుడు, బండారు, అయ్యన్న లాంటివారిని పెట్టుకుని, మీ చేతే బీసీల కళ్ళు పొడిపిస్తున్నాడు.
– చంద్రబాబు ఉసిగొల్పాడని, మీరు స్థాయిని మర్చిపోయి ఒక ముఖ్యమంత్రిని, పేదవాడి ఆకలి తీరుస్తున్న జగన్ గారిని ఇష్టారీతిన మాట్లాడటం మంచిది కాదు.
– బీసీలు మేధావులు..చైతన్యవంతులయ్యారు. 2024 ఎన్నికల్లో బీసీలే టీడీపీకి గుణపాఠం చెప్పబోతున్నారు.
బీసీల్లో వచ్చిన చైతన్యమే 2024లో వైఎస్సార్ కాంగ్రెస్‌ను 175కు 175 స్థానాల్లో గెలిపిస్తారు.
– అంబేద్కర్, పూలే వంటి మహనీయులు ఆశించే సంస్కరణలు అమలు చేస్తున్న జగన్ గారిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుంటారు.
– మీరెన్ని కుట్రలు చేసినా… మీరు ఎంతగా రోత రాతలు రాసినా.. బీసీలు మిమ్మల్ని ఎప్పటికీ నమ్మరు.