Best Web Hosting Provider In India 2024
దక్షిణ భారతదేశంలో అందరూ అన్నమే తింటారు. అయితే దీనిని చేసేప్పుడు కచ్చితంగా కొన్ని రకాలు తప్పులు చేస్తారు. నిజానికి ఎవరినైనా మీకు వంట వచ్చా అని ప్రశ్నిస్తే.. రాదు.. కానీ రైస్ పెట్టడం మాత్రమే వచ్చు అని చెబుతారు. అన్నం వండటం పెద్ద పనికాదు. అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనంలోనూ అన్నం తినడం సాధారణమే.
ట్రెండింగ్ వార్తలు
వంట చేయడం కూడా ఒక కళ. ఈ కళలో నైపుణ్యం కలిగిన వారు తక్కువ మందే ఉంటారు. మనం బియ్యం ద్వారా పలావ్, బిర్యానీ వంటి ఎన్నో వంటకాలను తయారు చేసుకోవచ్చు. నిజానికి వంటలో ఇరవై ఏళ్ల అనుభవం ఉన్నా అన్నం పెట్టడంలో శ్రద్ధ వహించాలి. అన్నం వండేటప్పుడు మీరు చేస్తున్న కొన్ని తప్పులను కచ్చితంగా తెలుసుకోవాలి.
అన్నం వండేటప్పుడు మీరు చేసే అత్యంత సాధారణ తప్పులలో ఒకటి గింజలను సరిగ్గా కడగకపోవడం. బియ్యం కడగనప్పుడు, అది అదనపు పిండిని కలిగి ఉంటుంది. ఇది వంట సమయంలో చాలా జిగటగా చేస్తుంది. కొన్నిసార్లు పైకి తేలుతూ ఉంటుంది. దీనిని నివారించడానికి బియ్యం కనీసం 3-4 సార్లు చల్లటి నీటిలో కడగాలి. కొందరికి బియ్యం ఒక్కసారే కడిగే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం వల్ల బియ్యంలో పురుగులు రాకుండా కంపెనీలు కొన్ని రసాయనాలను ఉపయోగిస్తాయి. ఈ రసాయనాలు మీ కడుపులోకి వెళ్తాయి.
బియ్యం సరిగా కడిగినా అన్నం సరిగా అవ్వడం లేదని కొన్నిసార్లు కంప్లైంట్ చేయెుచ్చు. అయితే నీరు-బియ్యం నిష్పత్తిని సరిగా అంచనా వేయకపోవడమే దీనికి కారణం. బియ్యాన్ని, నీళ్లను సరైన మోతాదులో కలపడం అలవాటు చేసుకోండి. ఈ పరిమాణం అన్ని రకాల బియ్యానికి సరిపోదు. పెట్టిన బియ్యం కంటే 2 రెట్లు ఎక్కువ నీరు పోస్తారు. కానీ కొన్ని రకాల బియ్యంలో తక్కువ నీరు అవసరం ఉంటుంది.
వంట చేసేటప్పుడు మీరు చేసే మరో సాధారణ తప్పు ఏంటంటే వైట్ రైస్, బ్రౌన్ రైస్ వంట పద్ధతులను తెలుసుకోలేకపోవడం. బ్రౌన్ రైస్ అంటే తినదగిన పొట్టు తొలగించబడిన ధాన్యపు బియ్యం. తెల్ల బియ్యం కంటే ఉడికించడానికి ఎక్కువ సమయం పడుతుంది. బ్రౌన్ రైస్ గింజల బయటి పొట్టు నీటిని లోపలకు పంపేందుకు సమయం తీసుకుంటుంది. బ్రౌన్ రైస్ వండేటప్పుడు వైట్ రైస్ కంటే ¼ నుండి ½ వరకు ఎక్కువ నీరు వాడాలి. వైట్ రైస్ వండడం కంటే బ్రౌన్ రైస్ వండేందుకు సమయం ఎక్కువగా పడుతుంది.
అన్నం వండేటప్పుడు చేసే సాధారణ తప్పు ఏంటంటే ఎక్కువ వేడిని ఉపయోగిస్తారు. ఎంత ఎక్కువ గ్యాస్ పెడితే అంత వేగంగా రైస్ అవుతుందని అనుకుంటారు. కానీ ఈ ప్రక్రియ మీ ఆహారాన్ని పాడు చేస్తుంది. దీని వలన బియ్యం జిగటగా మారుతుంది. మీరు తక్కువ గ్యాస్‌తో ఉడికించినప్పుడు, ఎక్కువ సమయం పడుతుంది, కానీ రుచిగా ఉంటుంది.
మరో సాధారణ తప్పు ఏంటంటే.. అన్నం వండిన వెంటనే తినే అలవాటు మానేయండి. మీరు కుక్కర్‌లో లేదా ఓపెన్ పాట్‌లో అన్నం వండినప్పటికీ, కొన్ని నిమిషాలు అలాగే ఉంచండి. పొయ్యి మీద నుంచి దించగానే తినకూడదు.