Best Web Hosting Provider In India 2024
TSRTC Hire Buses: హైదరాబాద్ బస్ భవన్ లో గురువారంఆర్టీసి అద్దె బస్సుల యజమానులతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఉన్నతాధికారులు సమావేశమయ్యారు.
ట్రెండింగ్ వార్తలు
ఈ సమావేశంలో ప్రధానంగా ఐదు విషయాలను అద్దె బస్సు యజమానులు ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యల పరిష్కారానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు టీఎస్ఆర్టీసీ ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
కమిటీ సిఫార్సులను పరిశీలించిన తర్వాత..… యాజమాన్యం నిర్ణయం తీసుకుంటుందని అద్దె బస్సు యాజమానులకు అధికారులు వివరించారు. ఈ ప్రతపాదనలకు వారు సానుకూలంగా స్పందించారు.
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ని గురువారం ఉదయం అద్దె బస్సుల యజమానులు కలిశారు. తమ సమస్యలను పరిశీలించాలని వారు మంత్రిని కోరారు. దీనిపై సంస్థ ఎండీ వీసీ సజ్జనర్‌తో పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. సమస్యల పరిశీలనకు ఒక ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
“ అద్దె బస్సుల యజమానులు కొన్ని అంశాలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు. మహాలక్ష్మి స్కీం అమలు తర్వాత ఇబ్బందులు గురవుతున్నామని చెప్పారు. సంస్థ ఉన్నతాధికారులతో కలిసి ఈ రోజు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నామని, కమిటీ అన్ని అంశాలను శాస్త్రీయ కోణంలో పరిశీలిస్తుందని, సంస్థ సొంత బస్సులు, అద్దె బస్సుల డేటాను క్రోడికరించి…… ఒక నిర్ణయం తీసుకుంటుందని ఎండి వివరించారు. . దీనిపై అద్దె బస్సుల యాజమానులు కూడా సానుకూలంగా స్పందించారని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్ తెలిపారు.
(కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా)