Janhvi on Sridevi: అమ్మ నన్ను తెలుగులో తిట్టేది: శ్రీదేవిపై జాన్వీ కపూర్

Best Web Hosting Provider In India 2024


Janhvi on Sridevi: ఒకప్పుడు టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌ను ఏలిన నటి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ ప్రస్తుతం హిందీ సినిమాలోని టాప్ హీరోయిన్స్ లో ఒకరు. ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో ఆమె తన తల్లి శ్రీదేవిని గుర్తు చేసుకుంటూ కాస్త ఎమోషనల్ అయింది. ఆమె తనను తెలుగులో తిట్టేదని జాన్వీ చెబుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియా ఎక్స్‌లో వైరల్ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

ఆ వీడియోలో తన తల్లి శ్రీదేవి గదిలోకి వెళ్లి తాను లిప్‌స్టిక్ దొంగతనం చేసినప్పుడు ఆమె ఎలా తెలుగులో తిట్టేదో జాన్వీ చెప్పింది. ఈ వీడియో చూసి ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ అయ్యారు. ఒకప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలను ఏలిన శ్రీదేవి.. ఆరేళ్ల కిందట అకాల మరణం చెందడాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.

నా కొడకా అని తిట్టేది: జాన్వీ

ఆ వీడియోలో జాన్వీ మాట్లాడుతూ.. “అమ్మ ప్రతిసారీ ఆ మాట నాతో అనేది. నేను ఆమె గదిలోకి వెళ్లి ఆమె లిప్‌స్టిక్స్ దొంగిలించేదాన్ని. నా పాకెట్స్ అన్నీ ఫుల్ అయ్యేవి. ఆమె నా దగ్గరికి వచ్చి నీ జేబులు చూపించు అని అడిగేది. నో అమ్మ అని నేను అనేదాన్ని. అప్పుడామె నా కొడకా అని తిట్టేది” అని చెప్పింది. ఈ వీడియో అభిమానుల మనసులు గెలుచుకుంటోంది.

తెలుగమ్మాయి అయిన శ్రీదేవి టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వెళ్లి బోనీ కపూర్ ను పెళ్లి చేసుకుంది. ఇప్పుడు జాన్వీ ఆమె గురించి చెబుతున్న వీడియో చూసి ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. ఆమెను ఎంతగా మిస్ అవుతున్నారో తమ కామెంట్స్ ద్వారా చెప్పారు. సో క్యూట్, సో స్వీట్, ఆమె సినిమాల్లో లేని లోటు పూడ్చలేనిది అంటూ కొందరు ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు.

జాన్వీ బాలీవుడ్ లోకి ఎంటరైన దఢక్ సినిమా రిలీజ్ కు కొన్నాళ్ల ముందే శ్రీదేవి కన్నుమూసింది. తనను సిల్వర్ స్క్రీన్ పై తన తల్లి చూడలేకపోవడం చాలా బాధ కలిగించిందని చాలాసార్లు ఆమె చెప్పింది. ఇప్పుడు తన తల్లి సొంత ఇండస్ట్రీ అయిన టాలీవుడ్ లోకి జాన్వీ అడుగు పెడుతోంది. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మూవీలో జాన్వీ నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ దేవర మూవీలో జాన్వీ ఓ పల్లెటూరు అమ్మాయిగా కనిపించనుంది. ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైన సమయంలో వైరల్ అయింది. చాలా మంది ఆమెలో శ్రీదేవిని చూసుకున్నారు.

ఇక ఈ మధ్యే కాఫీ విత్ కరణ్ షోలో తన చెల్లి ఖుషీ కపూర్ తో కలిసి పాల్గొన్న జాన్వీ.. తన తల్లి మరణ వార్త విన్న సమయంలో ఎలా రియాక్టయ్యానో చెబుతూ ఎమోషనల్ అయింది. తాను, చెల్లి ఖుషీ కపూర్ ఇద్దరం చాలా ఏడ్చినట్లు చెప్పింది.

WhatsApp channel

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024