Best Web Hosting Provider In India 2024
Naa Saami Ranga Mirna Menon Look: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున లేటెస్ట్ మాస్, యాక్షన్, రొమాంటిక్ మూవీ నా సామిరంగ. ప్రముఖ కొరియోగ్రాఫర్‌గా పని చేసిన విజయ్ బిన్ని తొలిసారి మెగా ఫోన్ పట్టుకుని దర్శకత్వం వహిస్తున్నారు. అంటే నా సామిరంగ సినిమాతో విజయ్ బిన్ని దర్శకుడిగా తెలుగులోకి డెబ్యూ ఇచ్చారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్‌తో నా సామిరంగ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పిస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు
నా సామిరంగ చిత్రానికి శివేంద్ర దాశరధి సినిమాటోగ్రఫీ అందించారు. రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందించారు. ఆస్కార్ విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మంచి అంచనాలతో తెలుగు ప్రేక్షకులు ముందుకు రానుంది నా సామిరంగ సినిమా. నా సామిరంగ సినిమాను ఈ సంక్రాతిం పండుగ సందర్భంగా జనవరి 14న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. ఇందులో నాగార్జునకు జోడీగా బ్యూటిఫుల్ ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది.
సినిమా విడుదల తేది దగ్గర పడుతుండటంతో నా సామిరంగ లోని నటీనటలు పాత్రలను ఒక్కొక్కరిగా పరిచయం చేస్తున్నారు మేకర్స్. ముందుగా నాగార్జున్ గ్లింప్స్ వీడియోతో పాత్రను పరిచయం చేశారు. అనంతరం ఆషికా రంగనాథ్ పాత్రను అందమైన చీరకట్టుతోపాటు స్పెషల్ గ్లింప్స్‌తో రివీల్ చేశారు. ఇలా ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెన్ తో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే పోస్టర్‌లు, ఫస్ట్ టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
నా సామిరంగ నుంచి ఒక్కో పాత్రను పరిచయం చేసిన మేకర్స్ తాజాగా మరో క్యారెక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. జనవరి 4న అంటే గురువారం నా సామిరంగ సినిమా నుంచి మిర్నా మీనన్ పాత్రను పరిచయం చేశారు. ఇందులో మిర్నా మీనన్.. మంగగా కనిపించనుంది. దీనికి సంబంధించిన మంగ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. “మా అంజిగాడి ప్రాణం” అంటూ మంగగా గార్జియస్ మిర్నా మీనన్ అని నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా పోస్టర్ పోస్ట్ చేశారు.
ఆ పోస్టర్‌లో మిర్నా మీనన్.. చీరకట్టుకుని, పద్ధతిగా బొట్టు పెట్టుకుని, మెడలో మల్లెపూలతో అచ్చమైన పల్లెటూరి అమ్మాయిగా ఎంతో అందగా కనిపించింది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతోంది. అయితే నా సామిరంగ సినిమాలో అల్లరి నరేష్ అంజి పాత్ర చేస్తున్నాడు. అంటే అంజి ప్రేమించిన అమ్మాయిగా మంగ పాత్ర ఉండనుంది. ఇదివరకు రాజ్ తరుణ్ భాస్కర్‌గా పరిచయం చేశారు. రాజ్ తరుణ్‌కు జోడీగా బ్యూటి రుక్సార్ ధిల్లాన్‌ను ఇంట్రడ్యూస్ చేశారు.
రుక్సార్ ధిల్లాన్ కుమారిగా పరిచయం చేశారు. రాజ్ తరుణ్, రుక్సార్ ధిల్లాన్‌ది 80వ కాలం నాటి ప్రేమకథ అంటూ స్పెషల్ గ్లింప్స్ విడుదల చేశారు. ఇక నాగార్జునకు జోడీగా ఆషికా రంగనాథ్ చేస్తోంది. అంటే నా సామిరంగ సినిమాలో నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సార్ ధిల్లాన్ ఆరుగురు ప్రధాన పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే బ్యూటిఫుల్ మిర్నా మీనన్ ఇదివరకు అల్లరి నరేష్‌తో ఉగ్రం సినిమాలో హీరోయిన్‌గా చేసింది. అంటే నా సామిరంగ సినిమాతో అల్లరి నరేష్‌తో రెండోసారి జోడి కట్టనుంది మిర్నా మీనన్. ఇక ఈ ముద్దుగుమ్మ జైలర్ సినిమాలో కూడా అలరించింది. జైలర్ మూవీలో రజనీకాంత్‌కు కోడలుగా యాక్ట్ చేసింది. జైలర్‌లో మిర్నా మీనన్ గురించి సోషల్ మీడియాలో అనేకరకాల మీమ్స్ వచ్చిన విషయం తెలిసిందే. దాంతో మిర్నా మీనన్ చాలా పాపులర్ అయింది.