Best Web Hosting Provider In India 2024
Habsiguda Girl: సోదరుడు స్కూల్ బస్సు ఎక్కుతుండగా.. ప్రమాదవశాత్తూ బస్సు కింద పడిపోయి ఓ చిన్నారి మృతి చెందింది. రవీంద్ర నగర్ కాలనీకి చెందిన మిథున్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు.కుమారుడు స్థానికంగా ఓ ప్రైవేట్ స్కూల్ లో చదువుతుండగా…రెండేళ్ల కూతురు ఇంట్లోనే ఉంటుంది.
ట్రెండింగ్ వార్తలు
ఈ క్రమంలోనే గురువారం ఉదయం తన అన్నను స్కూల్ బస్సు ఎక్కించేెందుకు తండ్రి మిథున్‌తో కలిసి చిన్నారి బయటికి వచ్చింది. కుమారుడిని స్కూల్ బస్సు ఎక్కించిన తండ్రి బస్సు డ్రైవర్ తో మాట్లాడుతుండగా అమ్మమ్మ వద్ద ఉన్న చిన్నారి ఒక్కసారిగా డాడీ అంటూ మిథున్ వైపు పరుగులు తీసింది.
చిన్నారిని గమనించని బస్సు డ్రైవర్ ముందుకు పోనివ్వడంతో టైర్ కింద పడిపోయి స్పాట్ లోనే మృతి చెందింది.డ్రైవర్ నిర్లక్షం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చిన్నారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఘటనా స్థలానికి చేరుకున్న ఓయూ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. నగరంలో స్కూల్ బస్సు ప్రమాదాల వల్ల మరణిస్తున్న చిన్నారుల సంఖ్య పెరుగుతూ ఉండడం ఆందోళన కల్గిస్తుంది.తల్లి తండ్రుల నిర్లక్ష్యం,బస్సు డ్రైవర్ గమనించకాపోవడం వల్ల పసి కందులు ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్న పిల్లలను బయటికి తీసుకొచ్చినప్పుడు వారిని ఒంటరిగా వదిలేయకుండా, ఆప్రమత్తంగా ఉండాలని పలువురు నిపుణులు తల్లి తండ్రులకు సూచిస్తున్నారు.
సైబర్ నేరస్తుడి అరెస్ట్…
దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఓ మోస్ట్ వాంటెడ్ సైబర్ నేరస్తుడుని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.అనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు. నిందితుడిపై ఇప్పటికే సైబర్ కేసులు డబుల్ సెంచరీ దాటాయి.
బెంగళూరు లోని జెపి నగర్ కాలనీకి చెందిన జితేందర్ సింగ్ సైబర్ నేరాల్లో ఆరితేరాడు.నిందితుడు పై దేశ వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ లలో 227 కేసులు నమోదు అయ్యాయి.ఒక్క తెలంగాణ రాష్ట్ర పరిధిలోనే దాదాపు 83 సైబర్ కేసులు జితేందర్ సింగ్ పై నమోదయ్యాయి.సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరువు మండలం బిడియెల్ భానుర్ పోలీస్ స్టేషన్ లో జితేందర్ సింగ్ పై 2, గుమ్మీదడ లో ఒకటి, అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ లో 2సైబర్ క్రైమ్ కేసులు జితేందర్ సింగ్ పై ఉన్నాయి.
60 ఫోన్లు,63 సింకార్డులు,13 బ్యాంక్ అకౌంట్ లు….
ఉద్యోగాలు,లోన్లు, ఆన్లైన్ గేమ్స్ పేరిట ప్రజలను జితేందర్ సింగ్ మోసం చేస్తూ…డబ్బు వసూలు చేస్తుంటాడు.అందుకోసం అతడు ఏకంగా 60 మొబైల్ ఫోన్లు, 63 సిం కార్డులు 13 బ్యాంక్ అకౌంట్స్ వాడుతున్నాడు.అమాయకులనే లక్ష్యంగా చేసుకొని జితేందర్ మోసాలకు పాల్పడుతున్నాడు.
జితేందర్ సింగ్ మోసం చేసిన వారిలో ఎక్కువ శాతం మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఉండడం గమనార్హం.డబ్బులు ఫ్రీగా వస్తున్నాయని అత్యాశకు పోయి మోసాలకు గురి కావద్ధని సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు. సైబర్ మోసాలకు గురైనట్లు అనుమానం కలిగితే వెంటనే 1930 నంబర్ కు ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరారు.
(కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా)