Target Sharmila: కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరిందో లేదో వైసీపీ మంత్రులు ఆమెపై విమర్శలు ప్రారంభించారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఏపీ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వనుండటాన్ని సహించ లేకపోతున్నారు. సీనియర్ల నుంచి జూనియర్ల వరకు ఆమెను టార్గెట్ చేసుకున్నారు. ఇక వైసీపీ అనుకూల సోషల్ మీడియాలో నాలుగైదు రోజులుగా షర్మిలను టార్గెట్ చేసుకున్నాయి.
ట్రెండింగ్ వార్తలు
వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై వైసీపీ అక్కసును దాచుకునే ప్రయత్నం ఏమాత్రం చేయడం లేదు. కాంగ్రెస్ పార్టీతో ఉన్న పాతపగల్ని గుర్తు చేసుకుని ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయంలో పార్టీ అధినేత మనసెరిగి మసలుకుంటున్నారు. ఏపీలో మిగిలిన ప్రతిపక్షాలు షర్మిల చేరిక విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోయినా వైసీపీ మంత్రులు మాత్రం ఆమె ఎంట్రీని సహించ లేకపోతున్నట్టు ప్రకటనలు చేస్తున్నారు.
ఏపీ సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా తాము వారిని ప్రతిపక్షంగానే చూస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై స్పందించారు. ”షర్మిల కాంగ్రెస్‌లోకి వెళ్లినంత మాత్రాన మేం పార్టీ మారి మా కాళ్లు మేమే నరుక్కుంటామా?” అంటూ ఘాటుగా స్పందించారు.
మరోవైపు షర్మిల రాకపై ఆమె చిన్నాన్న వైవీసుబ్బారెడ్డి కూడా ఘాటుగానే స్పందించారు. ఎవరు ఏ పార్టీలో చేరినా.. తమకు వచ్చిన ఇబ్బందేమీ లేదని అన్నారు. ఏపీ ప్రజలు మళ్లీ జగనే సీఎం కావాలని కోరుకుంటున్నారని చెప్పారు.
ఏ పార్టీలో ఎవరు కలిసినా, కూటములుగా వచ్చినా మాకు భయం లేదని, మళ్లీ జగన్ సీఎం కావాలన్నారు. తమకు దేవుడి, ప్రజల ఆశీస్సులు ఉన్నాయని ఎవరు ఏ పార్టీలో చేరినా మాకు ఇబ్బంది ఉండదని చెప్పారు.
మాజీ మంత్రి కొడాలి నాని సైతం షర్మిల చేరికను తప్పు బట్టారు. షర్మిల కాంగ్రెస్ లో చేరితే వైసీపీ ఓటు బ్యాంక్ ఎందుకు చీలుతుందన్నారు. పురంధేశ్వరి బీజేపీలో చేరితే టీడీపీ ఓటు బ్యాంక్ చీలదా అని ప్రశ్నించారు. ఏపీలో కాంగ్రెస్ కు ఒక శాతం ఓటు బ్యాంక్ కూడా లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కుటుంబాల మధ్య చిచ్చు పెడతారని, ఎవరి తండ్రి చనిపోయినా పిల్లలను చంద్రబాబు బలి చేస్తారని ఆరోపించారు.
కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం…
షర్మిల చేరికతో ఏపీ కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం నెలకొంది. పదేళ్లుగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడుచు పెట్టుకుపోయింది. కరడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు మినహా పార్టీ క్యాడర్ మొత్తం చెల్లాచెదరైపోయింది. ఇప్పడిప్పుడే ఏపీ కాంగ్రెస్‌లో కదలిక వస్తోంది.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తర్వాత ఏపీకి కూడా మంచి రోజులు వస్తాయని ఆ పార్టీలో ఆశలు చిగురిస్తున్నాయి. తాజాగా షర్మిల రాకతో మంచి రోజులు వచ్చినట్టేనని భావిస్తున్నారు. షర్మిల రాకను వ్యతిరేకించే వారు కూడా కాంగ్రెస్‌లో ఉన్నా వారందరిని కలుపుకు పోవడం కీలకం కానుంది. హర్ష కుమార్ వంటి వారు ఇప్పటికే బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.
గత ఎన్నికల్లో 1శాతానికి మాత్రమే పరిమితమైన ఏపీ కాంగ్రెస్ పార్టీని కనీసం గణనీయమైన స్థాయికి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ క్రమంలో షర్మిల ఏ పదవి కోరినా ఇచ్చేందుకు రాహుల్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. షర్మిలకు ఏఐసిసి పదవి కావాలా, పిసిసి పదవి కావాలో తేల్చుకోమని ఆఫర్ ఇచ్చినట్టు చెబుతున్నారు. ఏ పదవి కోరినా ఆమెకు ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధంగా ఉన్నట్టు చెబుతున్నారు.
ఏపీలో కాంగ్రెస్ పార్టీకి బలమైన గుర్తింపు తీసుకువచ్చే నాయకత్వం కోసమే కాంగ్రెస్ పార్టీ చూస్తోందని, పార్టీకి జవసత్వాలు కల్పించాలంటే షర్మిల ఉపయోగపడుతుందని ఆ పార్టీ భావిస్తోంది.