Jntu Students: జేఎన్‌టియూ విద్యార్ధుల ఆందోళన

Best Web Hosting Provider In India 2024

Jntu Students: హైదరాబాద్ లోని జేఎన్‌టియూ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాలేజీ మెస్‌లో భోజనం సరిగా లేదని….తినే ఆహారంలో పురుగులు, బొద్దింకలు, వైర్ లు, గ్లాస్ ముక్కలు వస్తున్నాయని పీజీ విద్యార్థులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. కాలేజీకి కొత్త ప్రిన్సిపల్ వచ్చినప్పటి నుండి భోజనం సరిగా ఉండడం లేదని, విద్యార్థులకు సరిపడా ఆహారం ఉండడం లేదని….విద్యార్థులు కాలేజీ ఎదుట ధర్నా చేపట్టారు.

 

ట్రెండింగ్ వార్తలు

డౌన్ డౌన్ ప్రిన్సిపల్ అంటూ ఫ్లకార్డులతో రోడ్డు పై బైఠాయించి ధర్నా చేపట్టారు. విద్యార్ధుల సమస్యలపై ప్రిన్సిపల్‌కు పలు మార్లు ఫిర్యాదు చేసినా పట్టించు కోలేదని, ఫిర్యాదు చేసిన వారిని ప్రిన్సిపల్ టార్గెట్ చేస్తున్నారని విద్యార్థులు మండి పడుతున్నారు.

సాయంత్రం 6 గంటల లోపే మెస్ డోర్ మూసి వేస్తామని ప్రిన్సిపల్ బెదిరిస్తున్నారని విద్యార్థులు విమర్శిస్తున్నారు.విద్యార్థులు ఎక్కడికి వెళ్ళినా ఎందుకు వెళుతున్నారు? దేనికోసం వెళుతున్నారు అని ప్రశ్నిస్తున్నారని, కాలేజీలో ఎక్కడ కూర్చున్నా ఎందుకు కూర్చుంటున్నారని ప్రిన్సిపల్ కావాలనే విద్యార్ధులను ప్రశ్నిస్తున్నారన్నారు.

హాస్టల్ మెస్ సరిగా లేదని, మెస్‌లో లైటింగ్ లేక చీకట్లో భోజనం చేయాల్సి వస్తుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ప్రిన్సిపల్ ను ప్రశ్నిస్తే ” మీ కోసం ఇంద్ర భవనం కట్టించలేమని ఎగతాళి గా మాట్లాడుతున్నారని పీజీ విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

ఎక్కువ మాట్లాడిన వారిని హాస్టల్ ఖాళీ చేయాలని ప్రిన్సిపల్ బెదిరిస్తున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థులకు నచ్చజెప్పి ధర్నా విరమింప చేశారు.

ఓయూ విద్యార్ధినుల ఆందోళన

ఓయూ లేడీస్ హాస్టల్ లో కొందరు దుండగులు రాత్రిళ్ళు రూం డోర్ లు కొడుతున్నారని….లేడీస్ హాస్టల్‌లో సరైన భద్రతను కల్పించాలని గురువారం ఓయూ గేట్లు మూసి వేసి రోడ్డు పై బైఠాయించి విద్యార్థినులు ఆందోళన చేశారు. విద్యార్ధినుల సమస్యలపై విసి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు సరైన సెక్యూరిటీ ని కల్పించాలని డిమాండ్ చేశారు.

 

(కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా)

WhatsApp channel
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024