Best Web Hosting Provider In India 2024
Tollywood Releases This Week: శుక్రవారం వచ్చిందంటే కొత్త సినిమాలతో థియేటర్లు కళకళలాడుతుంటాయి. ఫ్యాన్స్ హంగామాతో ప్రతి థియేటర్ వద్ద జోష్ కనిపిస్తుంటుంది. బాక్సాఫీస్ లెక్కలు, రికార్డులతో సోషల్ మీడియా మోతెక్కిపోతుంది. కానీ ఈ ఫ్రైడే మాత్రం థియేటర్ల వద్ద ఆ సీన్ మొత్తం రివర్స్ గా కనిపిస్తోంది. 2024 ఫస్ట్ వీక్ సినీ లవర్స్‌కు ఊహించని షాకిచ్చింది. జనవరి ఫస్ట్ వీక్‌లో పెద్ద సినిమాలేవి ప్రేక్షకలు ముందుకు రాలేదు. సంక్రాంతి పోటీ నేపథ్యంలో తొలి వారంలో సినిమాలు రిలీజ్ చేసేందుకు నిర్మాతలు వెనకడుగు వేశారు. దాంతో ఈ వారం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సందడి కనిపించడం లేదు.
ట్రెండింగ్ వార్తలు
ఆరు చిన్న సినిమాలు…
ఈ వారం బాక్సాఫీస్ బరిలో మొత్తం చిన్న సినిమాలే నిలిచాయి. శివ కంఠమనేని, రాశి, నందితశ్వేత ప్రధాన పాత్రల్లో నటించిన రాఘవరెడ్డి ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. అలాగేప్రయోగాత్మక కథాంశంతో రూపొందిన 1134 కూడా నేడు థియేటర్లలోకి వచ్చింది. ఈ రెండు సినిమాలతో పాటుగా దీనెమ్మ జీవితం, ప్రేమకథ, డబుల్ ఇంజిన్, ప్లాంట్‌మ్యాన్, షాన్ అనే లో బడ్జెట్ మూవీస్ ఈ ఫ్రైడే విడుదలయ్యాయి. ఈ చిన్న సినిమాల్లో పేరున్న నటీనటులు ఎవరూ లేకపోవడం, పెద్దగా బజ్ లేకపోవడంతో ఈ ఫ్రైడే థియేటర్లు మొత్తం డల్ అయ్యాయి.
సలార్, డెవిల్‌కు ప్లస్…
ఈ శుక్రవారం పెద్ద సినిమాలు రిలీజ్ కాకపోవడంతో సలార్‌తో పాటు డెవిల్, బుబుల్ గల్ సినిమాలకు ప్లసయ్యే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి వరకు ఈ సినిమాలకు ఢోకా లేనట్లు తెలుస్తోంది. ఇప్పటికే సలార్ తెలుగు రాష్ట్రాల్లొ 225 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ప్రభాస్ మూవీతో పాటు కళ్యాణ్ రామ్ డెవిల్ కూడా ఈ వీక్‌లో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
సంక్రాంతి నుంచి అసలైన పోరు…
సంక్రాంతి నుంచే సినిమాల పరంగా అసలైన కొత్త ఏడాది మొదలుకానుంది. ఈ సంక్రాంతికి మహేష్ బాబు గుంటూరు కారంతో పాటు వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామిరంగతో పాటు తేజా సజ్జా హనుమాన్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. సంక్రాంతి బరిలో నిలిచిన ఈగల్ రేసు నుంచి తప్పుకుంది. వీటితో పాటు మరో మూడు డబ్బింగ్ సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి.
ధనుష్ కెప్టెన్ మిల్లర్, శివకార్తికేయన్ అయలాన్‌తో పాటు లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న మిషన్ ఛాప్టర్ వన్ రిలీజ్ కానున్నాయి. మొత్తంగా సంక్రాంతికి ఏడు సినిమాలు రిలీజ్ కానుండటంతో పోరు ఆసక్తికరంగా మారింది. సంక్రాంతి సినిమాల బిజినెస్ ఆరు వందల కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం.
టాపిక్