Best Web Hosting Provider In India 2024

Garlic Fried Rice: చలికాలంలో వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. మధ్యాహ్నం, రాత్రి టేస్టీగా వేడిగా ఫ్రైడ్ రైస్ లాంటివి తినాలన్న కోరిక పుడుతుంది. బయట కొనుక్కున్న ఫ్రైడ్ రైస్ తినడం వల్ల ఆరోగ్యానికి చేటు. కాబట్టి ఇంట్లోనే రోగనిరోధక శక్తిని పెంచే గార్లిక్ ఫ్రైడ్ రైస్‌ను ట్రై చేయండి. ఈ వెల్లుల్లి ఫ్రైడ్ రైస్ చాలా సులువుగా అయిపోతుంది. ఇది ఇండో చైనీస్ వంటకం. దీని తింటున్న కొద్దీ మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. ఇందులో ఎక్కువగా వెల్లుల్లిపాయల్ని వేసాము, కాబట్టి రుచి బాగుంటుంది. వెల్లుల్లి ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం.
ట్రెండింగ్ వార్తలు
ఫ్రైడ్ రైస్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
బియ్యం – ఒక కప్పు
వెల్లుల్లి తరుగు – మూడు స్పూన్లు
క్యారెట్ తరుగు – పావు కప్పు
బీన్స్ తరుగు – పావు కప్పు
ఉల్లికాడల తరుగు – రెండు స్పూన్లు
మిరియాల పొడి – అర స్పూను
సోయా సాస్ – అర స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – మూడు స్పూన్లు
గార్లిక్ ఫ్రైడ్ రైస్ రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. ఆ నూనెలో తరిగిన వెల్లుల్లి వేసి రంగు మారేవరకు వేయించి వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
2. ఆ మిగతా నూనెలో బీన్స్, క్యారెట్ల తరుగు వేసి వేయించాలి.
3. అందులోనే ఉప్పు, మిరియాల పొడి, సోయాసాస్ కూడా వేసి కలపాలి.
4. ఇప్పుడు ముందుగానే వండుకున్న అన్నాన్ని వేసి కలుపుకోవాలి.
5. ముందుగా వేయించుకున్న వెల్లుల్లి తరుగును చల్లుకోవాలి.
6. స్ప్రింగ్ ఆనియన్స్ తరిగి పైన గార్నిష్ చేసుకోవాలి.
7. అంతే వెల్లుల్లి ఫ్రైడ్ రైస్ రెడీ అయినట్టే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.
8. దీనిలో కారం ఉండదు కాబట్టి పిల్లలు కూడా తినవచ్చు.
వెల్లుల్లిని చలికాలంలో తినడం చాలా ముఖ్యం. ఎందుకంటే వాతావరణం చల్లబడినప్పుడు మన శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువ. వీటిని తినడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. గుండెకు మేలు చేస్తుంది. రక్తనాళాలు శుభ్రపడతాయి. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా కాపాడతాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. జీవక్రియ సక్రమంగా జరిగి ఆహారం జీర్ణం అవుతుంది. వారానికి కనీసం రెండుసార్లు ఈ వెల్లుల్లి ఫ్రైడ్ రైస్‌ను తినడం అలవాటు చేసుకుంటే మంచిది. వెల్లుల్లి తినడం వల్ల శరీరంలో అధిక కొవ్వు కరుగుతుంది. కాబట్టి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఇవి చాలా అవసరం. నోటి దుర్వాసనను తగ్గించేందుకు వెల్లుల్లి ఉపయోగపడుతుంది. అలాగే దంత క్షయాన్ని కూడా కాపాడుతుంది. మహిళలు ఖచ్చితంగా వెల్లుల్లి తినాలి. ఇది ఒక అద్భుతమైన యాంటీ యాక్సిడెంట్లు పీరియడ్స్ సమయంలో వచ్చే చికాకు, కోపం వంటివి రాకుండా అడ్డకుంటాయి.
టాపిక్