OTT: ‘గే’ పాత్రలో నటించిన మెగాస్టార్.. సైలెంట్‌గా ఓటీటీలో మూవీ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Best Web Hosting Provider In India 2024

Kaathal The Core OTT Streaming: ప్రస్తుతం ఓటీటీల హవా పెరిగిపోయింది. థియేటర్లలో కంటే ఓటీటీల్లో సినిమాలు చూసే వీక్షకులు ఎక్కువై పోయారు. దాంతో థియేటర్లలో రిలీజైన తక్కువ సమయంలోనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి సినిమాలను వదులుతున్నారు సినీ నిర్మాతలు. సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలను కూడా నెల రోజుల గ్యాపుతో ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇక కొన్ని సినిమాలు అయితే ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.

 

ట్రెండింగ్ వార్తలు

అలా తాజాగా వచ్చిన సినిమానే కాదల్ ది కోర్. మలయాళ చిత్ర పరిశ్రమలో మెగాస్టార్‌గా పేరు తెచ్చుకున్న మమ్ముట్టీ నటించిన లేటెస్ట్ మూవీ కాదల్. ఈ సినిమాలో ఏ స్టార్ చేయనటువంటి సాహసం చేస్తూ మమ్ముట్టి గే పాత్రలో నటించాడు. ఒక మెగాస్టార్ అయి స్వలింగ సంపర్కుడిగా నటించడం గొప్పగా మాత్రమే కాకుండా పలు వివాదాలను కూడా తెచ్చిపెట్టింది. ఎవరూ ఊహించని విధంగా థియేటర్లలో సూపర్ హిట్ కొట్టిన కాదల్ సినిమాపై వరల్డ్ వైడ్‌గా పెద్ద వివాదమే జరిగింది.

కాదల్ సినిమాను కువైట్, ఖతర్ వంటి దేశాలు బ్యాన్ కూడా చేశాయి. కాదల్ మూవీ హోమో సెక్సువాలిటీని ప్రోత్సహించే విధంగా ఉందంటూ చాలా మంది గగ్గోలు పెట్టారు, గొడవలు చేశారు. కానీ, ఆ వివాదాలు, గొడవలు అన్నింటిని తట్టుకుని థియేటర్లలో నవంబర్ 23న రిలీజై బాక్సాఫీస్‌ను షేక్ చేసింది కాదల్ మూవీ. అతి చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన కాదల్ ది కోర్ మూవీ ఏకంగా రూ. 150 కోట్లను కొల్లగొట్టింది. దీంతో మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది కాదల్ మూవీ.

అలాంటి కాదల్ ది కోర్ మూవీ ఎలాంటి ప్రచారం లేకుండా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మలయాళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, తమిళంలో కాదల్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇదివరకు రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ చేయగా ప్రస్తుతం మాత్రం ఉచితంగా కాదల్ మూవీ ప్రసారం అవుతోంది.

 

అయితే, ముందుగా ఇండియాలో కాకుండా కేవలం ఓవర్సీస్ ప్రేక్షకులకు మాత్రమే ఓటీటీలో కాదల్ మూవీని స్ట్రీమింగ్ చేశారు. అది కూడా ఒక చిన్న కండిషన్ పెట్టి. కాదల్ మూవీని అమెజాన్ ప్రైమ్ రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ చేస్తోంది. అంటే పే అండ్ వ్యూ పద్ధతిలో కాదల్ మూవీని ఓటీటీలోకి విడుదల చేశారు.

2.99 డాలర్స్ చెల్లించి కాదల్ మూవీని అమెజాన్ ప్రైమ్‌లో ప్రేక్షకులు చూసే అవకాశం కల్పించారు. కానీ, ఇప్పుడు మాత్రం ఫ్రీగానే అమెజాన్ ప్రైమ్ వీడియోలో కాదల్ మూవీని స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే త్వరలో జియో సినిమా ఓటీటీలో కూడా కాదల్ మూవీని స్ట్రీమింగ్ చేస్తామని ప్రకటించారు. కాగా కాదల్ ది కోర్ సినిమాలో జ్యోతిక మరో ప్రధాన పాత్ర పోషించింది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన కాదల్ సినిమాకు జో బేబీ దర్శకత్వం వహించారు.

ఇకపోతే కాదల్ మూవీకి ఆదర్శ్ సుకుమారన్, పాల్సన్ స్కారియా రచన చేయగా మమ్ముట్టి కంపెనీ నిర్మించింది. మాథ్యూస్ పులికాన్ సంగీతం అందించారు. సాలు కె. థామస్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించగా.. ఫ్రాన్సిస్ లూయిస్ ఎడిటర్‌గా వ్యవహరించారు. మమ్ముట్టి, జ్యోతిక నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి.

 
WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024