Hyderabad Crime News : దారుణం… కూతురిపై కన్నతండ్రి లైంగిక దాడి, సహాయం పేరుతో మరో వ్యక్తి అత్యాచారం

Best Web Hosting Provider In India 2024

Hyderabad Crime News : కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న తండ్రే కసాయిలా మారాడు.తండ్రి వేధింపుల నుంచి తప్పించుకునే లోపే మరో వ్యక్తి చేతిలో ఆమె అత్యాచారానికి గురైంది. జీడిమెట్ల పోలీసుల కథనం మేరకు…..బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం పొట్ట కూటి కోసం హైదరాబాద్ కు వలస వచ్చి కుత్బుల్లాపూర్ లో నివాసం ఉంటున్నారు.వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్ద కుమార్తె (18) తొమ్మిదవ తరగతి వరకు చదువుకుంది.కరోనా కారణంగా ఆమె విద్యను మధ్యలోనే ఆపేసి గత కొన్ని రోజులుగా ఇంట్లోనే ఉంటుంది.

 

ట్రెండింగ్ వార్తలు

ఇదీ జరిగింది….

తండ్రి కామాంధుడిగా మారి కూతురిపై పలు మార్లు లైంగిక దాడి చేశాడు.ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించేవాడు. తండ్రి వేధింపులు భరించలేక తన బాధను తల్లికి చెప్పుకోక….తండ్రిపై లేనిపోని అభాండాలు వేయొద్దని కూతురిని మందలించింది. కాగా గత ఏడాది దీపావళి సందర్భంగా కుత్బుల్లాపూర్ నుంచి రైలు లో స్వగృహం బీహార్ కు వెళుతుండగా…..ట్రైన్ లో సంతోష్ అనే యువకుడితో ఈమెకు పరిచయం ఏర్పడింది.వాట్సప్ ద్వారా ఇద్దరూ చాలా రోజులు చాటింగ్ చేసుకున్నారు.ఆ యువకుడు బడంగ్ పేట్ గాంధీనగర్ వద్ద ఉంటున్నట్లు యువతితో చెప్పాడు. వీరిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది.

గత ఏడాది డిసెంబర్ 26న సంతోష్ కలవాలని కోరడంతో ఈ యువతి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చి సంతోష్ ను కలిసింది.అనంతరం ఇంటికి వెళ్లగా తల్లి తండ్రులకు చెప్పకుండా వచ్చానన్న భయంతో మళ్ళీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చి రవి అనే యువకుడి ఫోన్ నుంచి ప్రియుడు సంతోష్ కు ఫోన్ చేసింది. ఇద్దరూ కలుసుకొని ఎవరి ఇంటికి వారు వెళ్లిపోగా మరుసటి రోజు రైల్వే స్టేషన్ లో ఫోన్ సహాయం చేసిన రవికి ఈ యువతి కాల్ చేసి తనకు ఏదైనా ఉద్యోగం ఉంటే చూడమని చెప్పింది. దీంతో రవి అనే వ్యక్తి తన రూం కు తీసుకెళ్ళి రెండు రోజుల పాటు ఆమెను అత్యాచారం చేశాడు.అక్కడ నుంచి తప్పించుకొని నేరుగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కు వచ్చి తన పై జరిగిన దాడుల అన్నిటి గురుంచి వారికి వివరించింది. దాంతో యువతి తండ్రి తో పాటు,రవి పై జీడిమెట్ల పోలీసులు అత్యాచార కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

WhatsApp channel
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024