Best Web Hosting Provider In India 2024

Naa Saami Ranga Theatrical Rights: ఈ ఏడాది మరోసారి సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు అక్కినేని నాగార్జున. నా సామిరంగ అంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. గుంటూరు కారం, సైంధవ్, హనుమాన్ లాంటి సినిమాలు కూడా రిలీజ్ కానుండటంతో మొదట ఈ సినిమా మేకర్స్ సంక్రాంతి రిలీజ్ కు వెనుకాడినట్లు తెలిసింది.
ట్రెండింగ్ వార్తలు
అయితే నాగార్జున మాత్రం ఈ మూవీపై నమ్మకంతో సంక్రాంతికే రిలీజ్ చేయాలని పట్టుబట్టాడు. శ్రీనివాస చిట్టూరి ఈ మూవీని నిర్మించాడు. నా సామిరంగ నాన్ థియేట్రికల్ హక్కులను కూడా నాగార్జునే అమ్ముడుపోయేలా చూడటంతో చాలా వరకూ బడ్జెట్ రికవరీ అయింది. ఇక ఇప్పుడు ఈ మూవీ థియేట్రికల్ హక్కులను కూడా నాగార్జునే సొంతం చేసుకున్నాడట.
రూ.15 కోట్లకు థియేట్రికల్ హక్కులు
తెలంగాణ, ఏపీల్లో మూవీ రిలీజ్ కోసం ఈ హక్కులను నాగార్జున ఏకంగా రూ.15 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. మరో మూడు సినిమాల మధ్య కూడా నా సామిరంగ మూవీ విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్న నాగ్.. ఈ భారీ మొత్తంతో హక్కులు కొనుగోలు చేశాడు. ఈ సినిమా కోసం రూ.10 కోట్ల రెమ్యునరేషన్ ను నాగార్జున తీసుకున్నాడు.
ఇప్పుడు థియేట్రికల్ హక్కులు దక్కించుకోవడంతో రెమ్యునరేషన్ పోనూ మిగిలిన మొత్తాన్నే నాగార్జునే నిర్మాతకు చెల్లించాల్సి ఉంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు చెందిన డిస్ట్రిబ్యూటర్లతో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి నాగార్జున ప్లాన్ చేస్తున్నాడు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ను విజయ్ బిన్నీ డైరెక్ట్ చేశాడు. అతనికి ఇదే తొలి సినిమా. అయినా సినిమాపై నమ్మకంతో నాగార్జున రిస్క్ చేస్తున్నాడనే చెప్పాలి.
నా సామిరంగ మూవీలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్, మిర్నా, రుష్కర్ దిల్లాన్ కూడా నటించారు. కీరవాణి మ్యూజిక్ అందించాడు. నా సామిరంగ మూవీ జనవరి 14న రిలీజ్ కానుంది. అయితే అంతకుముందే జనవరి 12న గుంటూరు కారం, హనుమాన్ సినిమాలు రానుండగా.. జనవరి 13న వెంకటేశ్ మూవీ సైంధవ్ కూడా రిలీజ్ కాబోతోంది.
జనవరి 13న రిలీజ్ కావాల్సిన ఈగల్ సినిమాను ఇప్పటికే వాయిదా వేశారు. ఇక పోటీ ఈ నాలుగు సినిమాల మధ్యే ఉండనుంది. అయితే సంక్రాంతి రేసులో చివరిగా రిలీజ్ కానున్న సినిమా కావడంతో నా సామిరంగకు కాస్త కలిసి రావచ్చు. జనవరి 14 నాటికి గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్ టాక్ ఏంటో తెలిసిపోతుంది. ఒకవేళ వీటిలో ఏ ఒకటో, రెండో సినిమాలకు నెగటివ్ టాక్ వచ్చినా అది నా సామిరంగకు కలిసి వస్తుంది.
జోజు జార్జ్ హీరోగా నటించిన మలయాళం మూవీ పురింజు మరియం జోస్ ఆధారంగా నా సామి రంగం తెరకెక్కింది. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా 2019లో విడుదలైన పురింజు మరియం జోస్ మూవీ ఆ ఏడాది మలయాళంలో అత్యధిక వసూళ్లను రాబట్టిన మూవీగా నిలిచింది. మలయాళంలో జోజు జార్జ్ పాత్రను తెలుగులో నాగార్జున చేస్తున్నాడు. జోజు జార్జ్ స్నేహితుడి పాత్రలో మలయాళంలో చెంబన్ వినోద్ జోస్ కనిపించగా ఈ క్యారెక్టర్‌ను తెలుగు రీమేక్‌లో అల్లరి నరేష్ చేశాడు.