Best Web Hosting Provider In India 2024
Mutton Bones Recipe: మటన్ బోన్స్ తో వండే పులుసు మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీన్ని వండడం చాలా సులువు. కావాలనుకుంటే దీన్ని నేరుగా స్పూన్ తో తినవచ్చు లేదా అన్నంలో కలుపుకొని తినవచ్చు. చపాతీలు, దోశలు వంటి వాటికి జతగాను తినవచ్చు. ఎలా తిన్నా అన్ని ప్రయోజనాలే ఉంటాయి. మటన్‌తో పులుసు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
ట్రెండింగ్ వార్తలు
మటన్ బోన్స్ పులుసు రెసిపీకి కావలసిన పదార్థాలు
మటన్ ఎముకలు – అరకిలో
ఉల్లిపాయలు – రెండు
పచ్చిమిరపకాయలు – మూడు
కారం – ఒక స్పూను
టమోటాలు – రెండు
కొత్తిమీర తరుగు – ఒక స్పూను
పసుపు పొడి – అర స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక స్పూను
జీలకర్ర పొడి – అర స్పూను
కొత్తిమీర తరుగు – నాలుగు స్పూన్లు
పుదీనా తరుగు – నాలుగు స్పూన్లు
లవంగాలు – 6
యాలకులు – మూడు
ఉప్పు – రుచికి సరిపడా
మిరియాలు పొడి – అరస్పూను
బిర్యానీ ఆకు – ఒకటి
మటన్ బోన్స్ పులుసు రెసిపీ
1. ప్రెషర్ కుక్కర్‌ను స్టవ్ మీద పెట్టి నూనె వేయాలి. అందులో లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసి వేయించాలి.
2. నిలువుగా తరిగిన ఉల్లిపాయలు, నిలువుగా తరిగిన పచ్చిమిర్చిని వేసి బాగా కలుపుకోవాలి.
3. అవి బాగా వేగాక శుభ్రం చేసిన మటన్ ఎముకలను వేసి బాగా కలపాలి.
4. మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మగ్గించాలి.
5. ఆ తరువాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలుపుకోవాలి.
6. రెండు నిమిషాలు మగ్గించాక చిన్న ముక్కలుగా కోసుకున్న టమోటోలను వేసి బాగా కలపాలి.
7. మూత పెట్టి అవి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి.
8. తర్వాత ఒక స్పూను కారం ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి.
9. పుదీనా తరుగును వేసి నాలుగైదు కప్పుల నీరును పోయాలి.
10. కుక్కర్ మీద మూత పెట్టి ఐదు విజల్స్ వచ్చేదాకా ఉంచాలి.
11. తర్వాత మూత తీసి పైన కొత్తిమీర తరుగును చల్లుకోవాలి.
12. అంతే మటన్ పులుసు రెడీ అయినట్టే. దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.
టాపిక్