Best Web Hosting Provider In India 2024
Road Accident in Mahabubnagar: ఆటో – డీసీఎం వాహనం ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం… మహబూబ్ నగర్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ట్రెండింగ్ వార్తలు
ఏం జరిగిందంటే…?
బాలానగర్ లో జరిగే వారపు సంతకు పలు తండాలకు చెందిన గిరిజనులు వచ్చారు.కూరగాయలతో పాటు ఇతర వస్తువులు కొనుగోలు చేసి ఆటోలో తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో… ఓ చోటు ఆగిన ఆటోను డీసీఎం వాహనం బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ఆరుగురు మృతి చెందారు. ఇందులో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు… ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను బాలానగర్ మండల పరిధిలోని పలు తండాలకు చెందిన వాళ్లుగా గుర్తించారు.