బాబు పల్లకీ మోయడానికి అందరూ కదలిరావాలా..?

Best Web Hosting Provider In India 2024

 

చంద్రగిరిలో చెత్తయిన నువ్వు…కుప్పంలో బంగారం అయ్యావా బాబూ..?

మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)

బాబు కదిలి రా అంటే రావడానికి ఎవరికైనా ఏం మేలు చేశాడని..?

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసినా..ఒక్క మేలు చెప్పలేని దుస్థితి చంద్రబాబుది.: మాజీ మంత్రి పేర్ని నాని

14 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు కనిగిరిలో పేదరికం కనిపించలేదా..?

ఇప్పుడు అధికారం ఇస్తే అరచేతిలో వైకుంఠం చూపిస్తావా?

చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేవరకూ ఎవరూ అమెరికా వెళ్లలేదట..విమానం ఎక్కలేదట..!

1.60 కోట్ల కుటుంబాల్లో ఎన్ని కోట్ల ఉద్యోగాలిచ్చారో బాబు, పవన్‌లు చెప్పాలి

హెరిటేజ్, ప్రియా సంస్థల్లో మరి ధరలు తగ్గించలేదెందుకు బాబూ..?: మాజీ మంత్రి  పేర్ని నాని

ఇంటింటికీ మద్యం తక్కువ ధరకే ఇస్తానని ప్రచారం చేసే నాయకుడు చంద్రబాబే.

2014లో పుట్టిన ప్రతి ఆడబిడ్డకూ రూ.25 వేలు బ్యాంకు డిపాజిట్‌ వేశావా బాబూ?

నాడు ఇంటికి 12 సిలిండర్లన్నావ్‌..ఏమయ్యాయి..?

రూ.10ని రూ.100 ఎలా చేయాలో నేర్పిస్తాడట..కానీ రెండెకరాలను 2 లక్షల కోట్లు ఎలా చేయాలో
నేర్పించడట..!

సీఎం అభ్యర్థి మా నాన్నే అని లోకేశ్ అంటున్నా…పవన్‌కు సిగ్గు లేకపోతే ఏం చేస్తాం?

ఎవరితో ప్రయాణం చేయాలనేది షర్మిల గారి వ్యక్తిగతం: మాజీ మంత్రి పేర్ని నాని

తాడేప‌ల్లి: అధికారం పోతే మాత్రం చంద్ర‌బాబు పల్లకీ మోయడానికి అందరూ కదలిరావాలా..? మాజీ మంత్రి  పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్ర‌శ్నించారు. చంద్రబాబు ఎవరికి ఏం చేశారని కదలిరావాలి అంటూ ఎద్దేవా చేశారు. ప్రజలు ఎందుకు రావాలో చంద్రబాబు చెప్పలేదన్నారు. ఎంతసేపు సీఎం వైయ‌స్ జగన్‌ను దూషించడమే చంద్రబాబు పని అంటూ మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కనిగిరి గుర్తుకు రాలేదా? 14 ఏళ్ల పాలనలో గ్రామాల్లో ఒక్క ఆఫీస్‌ అయినా చంద్రబాబు కట్టారా?. చంద్రబాబు పాలనలో ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచారా?. చంద్రబాబు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చంద్రబాబు, పవన్‌ చేసిందేమీ లేదు. ఇప్పుడు అధికారంలోకి వస్తే ఏదో చేస్తామని చెప్తుతున్నారు అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు.  శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.

రాజకీయాల్లో పగవానికి కూడా చంద్రబాబు లాంటి దుర్గతి పట్టకూడదు:
– చంద్రబాబునాయుడు కనిగిరిలో రా…కదలిరా..అనే టైటిల్‌ పెట్టి ప్రకాశం జిల్లా మొత్తం నుంచి జనాన్ని పోగేసి సభ పెట్టాడు.
– రా..కదలిరా..దివంగత ఎన్టీఆర్‌ రాజకీయ నినాదమైన తెలుగుదేశం పార్టీ పిలుస్తోంది..రా..కదలిరా లోంచి ఎన్టీఆర్‌ ఆత్మను, తెలుగుదేశం పార్టీని పీకేసీ ఈ టైటిల్‌ పెట్టాడు.
– ఎవరు రావాలి..? ఎందుకు రావాలి? ఈయన ఎవరికి ఏం చేశాడని రావాలి? ప్రజలు ఎందుకు కదలాలి అనేది సమాధానం చెప్పలేదు.
– 14 ఏళ్ళలో నేను ఈ మంచి చేశాను..ఈ ఐదేళ్లలో అటువంటి మంచి జరగడం లేదు కాబట్టి మీరంతా కదలిరండి..అని ఒక్క మాట కూడా చంద్రబాబు ఆ సభలో చెప్పలేదు.
– పగవాడికి కూడా చంద్రబాబుకు పట్టిన దుర్గతి రాజకీయాల్లో పట్టకూడదు.
– గంట సేపు మాట్లాడిన మాటల్లో జగన్‌ గారిని దూషించడం..తనకు తాను గాలికొట్టుకోవడం తప్ప ఏమీలేదు.
– పక్కోడు మనకు గాలి కొడితే బాగుంటుంది కానీ ఈయన గాలి ఈయనే కొట్టుకుంటాడు.
– అసత్యాలతో కూడిన పొగడ్తలు..జగన్‌ గారిని దూషించడం తప్ప ఏమీలేదు.
– కనిగిరి వాళ్లు ఇక్కడ చాలా పేదరికంలో మగ్గిపోతారు..హైదరాబాద్, బెంగుళూరు వెళ్లి కోట్లు సంపాదిస్తారట.
– అవకాశాలు లేక కనిగిరి వారు బయటకు వెళ్తున్నారు…నన్ను తీసుకురండి..వారికి హైదరాబాద్, బెంగుళూరు లాంటి అవకాశాలు కల్పిస్తాను అంటాడట.
– ఇవి పాపం మాటలు కావా? 2019 వరకూ నువ్వే కదా ఉన్నది..అప్పుడు కనిగిరి గుర్తుకు రాలేదా? వారికి ఎందుకు ఆ అవకాశాలు కల్పించలేదు?
– అంతకు ముందు తొమ్మిదేళ్లు కూడా నువ్వే ఉన్నావు కదా..? అప్పుడు కనిగిరి కనిపించలేదు..వారి పేదరికం కనిపించలేదు.
– రేపు అధికారం ఇస్తే కనిగిరి వారికి అవకాశాలు కల్పిస్తాననడం కంటే అరచేతిలో వైకుంఠం చూపిండం మరొకటి లేదు.
– ఎక్కడ మీటింగు జరిగితే అక్కడ పవన్‌ కల్యాణ్‌ నేను ఈ ఊర్లో పుట్టాను..ఈ ఊర్లో ఆడుకున్నా అంటాడు.
– చంద్రబాబు ఈ ఊరికి నేను ఇది చేస్తా..అది చేస్తా అంటూ అబద్ధపు హామీలు ఇస్తాడు.

ఈ ఐదేళ్లలో జరుగుతున్న అభివృద్ధి నీ 14 ఏళ్లలో ఏనాడైనా జరిగిందా?:

– ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి నీ 14 ఏళ్ల పాలనలో ఏనాడైనా జరిగిందా?
– నీ పరిపాలనలో ఒక గ్రామానికైనా గ్రామ పంచాయతీ భవనం ఉందా?
– రాష్ట్రంలో 17 మెడికల్‌ కాలేజీల నిర్మాణం, నాలుగు పోర్టులు నిర్మాణం, వందల సంఖ్యలో రైతు భరోసా కేంద్రాలు, సచివాలయ భవంతుల నిర్మాణం సాగుతున్నారు.
– గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, పాఠశాలల నిర్మాణాలు ఏవీ అభివృద్ధి కాదా?
– ఈ ఐదేళ్లలో ఎన్ని ప్రైవేటు పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయో కనిపించడం లేదా? ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తరలివచ్చాయో తెలియడం లేదా?
– ఏ ప్రభుత్వమైతే వ్యక్తుల యెక్క ఆదాయాన్ని పెంచి…ఖర్చులు తగ్గిస్తే అదే సుపరిపాలన అంటున్నాడు.
– ఎవరి ఆదాయాన్ని పెంచాడు..ఏం ఖర్చు తగ్గించాడో చంద్రబాబు చెప్పాలి.
– తన 14 ఏళ్ల పరిపాలనలో రేట్లు ఎప్పుడైనా తగ్గించాడా? తన ప్రమాణస్వీకారం రోజున ఉన్న ఏ వస్తువు రేటైనా తగ్గించాడా?
– ఆయన అమెరికాకు దారిచూపిస్తే…ఆ దారిలో అనేక మంది ప్రకాశం జిల్లా వాసులు అమెరికా వెళ్లి కోట్లు సంపాదించారట.
– ఈయన ముఖ్యమంత్రి అయ్యేవరకూ ఎవరూ అమెరికా వెళ్లలేదు..విమానం ఎక్కలేదు..
– ఈయన వచ్చి అందర్నీ తాళ్లేసి కట్టి విమానం ఎక్కించాడు..పలకా బలపం పట్టించి చదువు నేర్పించాడట.
– ఒకప్పుడట..ఉద్యోగాలు విపరీతంగా ఇచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌గా తన హయాంలో నిలిచింది.

1.60 కోట్ల కుటుంబాల్లో ఎన్ని కోట్ల ఉద్యోగాలిచ్చారో బాబు, పవన్‌లు చెప్పాలి:
– ఇంటికో ఉద్యోగం అని చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కలిసి 2014లో హామీ ఇచ్చారు.
– 1.60 కోట్ల కుటుంబాలున్న ఈ రాష్ట్రంలో ఎన్ని కోట్ల కుటుంబాలకు ఉద్యోగాలిచ్చారో వారిద్దరూ చెప్పాలి.
– ప్రభుత్వ ఉద్యోగాలు అసలు నియామకాలు చేశారా?
– నేడు జగన్మోహన్‌రెడ్డి గారు వచ్చి 1.40 లక్షల సచివాలయ ఉద్యోగాలు, 48 వేలకు పైగా వైద్యశాఖలో ఉద్యోగాలు..ఉద్యోగ కల్పన కాదా?
– సుమారుగా 2 లక్షల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు రంగంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు జగన్మోహన్‌రెడ్డి గారు కల్పిస్తే మీకు కనిపించవు.
– మీరు మాత్రం ఏమీ చేయకుండా అన్నీ చేసినట్లు ప్రజలు భ్రమించాలని భావిస్తారు.
– చంద్రబాబు కానీ, పవన్‌ కల్యాణ్‌ కానీ…ఎప్పటికప్పుడు మేము వస్తే ఇది చేస్తాం అంటారు కానీ ఉన్నప్పుడు మాత్రం ఏమీ చేయరు.
– అధికారం పోయినప్పుడు మాత్రం మీరు మాకు అధికారం ఇవ్వండి… మీకు అరచేతిలో వైకుంఠం చూపిస్తాం అంటారు.
– అధికారం పోతే మాత్రం ఉద్యోగాలిస్తాం..ఇళ్లిస్తాం..బంగారం ఇస్తాం…సంపద సృష్టిస్తాం అంటారు.

హెరిటేజ్, ప్రియా సంస్థల్లో హైదరాబాద్‌లో ఒక రేటు, ఇక్కడో రేటు ఉన్నాయా?:
– జగన్‌ గారి పాలనలో బాదుడే బాదుడట..నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి అంటున్నాడు.
– చంద్రబాబునాయుడిని ఒకటే ప్రశ్నిస్తున్నాం…మీ హెరిటేజ్‌ కంపెనీ వ్యాపారంలో బిగ్‌ బజార్‌ మీదే.
– బిగ్‌ బజార్‌లో హైదరాబాద్‌లో, బెంగుళూరులో రేట్లు ఏలా ఉన్నాయో చూద్దాం రా..
– హైదరాబాద్‌ వెళ్దాం రండి..చూపిద్దాం…నిత్యావసర సరకుల ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
– హెరిటేజ్‌ సంస్థ ప్యూచర్‌లో కలిసింది..హెరిటేజ్‌లో పాలప్యాకెట్‌ ధర ఎంత ఉంది..?
– హెరిటేజ్‌లో నెయ్యి కేజీ ఎంత ఉంది..? బెంగుళూరు, హైదరాబాద్‌లలో ఎంతుంది?
– అక్కడున్న అరకేజీ 360–370 రూపాయలే కదా..పాలప్యాకెట్‌ ధర అదే 30–32 రూపాయలే కదా?
– ఆంధ్రప్రదేశ్‌ హెరిటేజ్‌ షాపుల్లో ఏమైనా తక్కువ రేటుతో అమ్ముతున్నారా?
– వ్యత్యాసం ఉంటే మీ దుకాణంలోనూ ఉండాలి కదా..? తేడాలు లేవు కదా?
– పచ్చి మోసం, దగా మాటలు మాట్లాడుతున్నారు.
– మీ మాటలు విని రామోజీరావు కూడా తప్పుడు రాతలు రాస్తున్నారు కదా?
– జగన్మోహన్‌ రెడ్డి గారి ప్రభుత్వం కిరాణ సరుకులు ధరలు పెరిగాయని మోసపు మాటలు మాట్లాడుతున్నారు.
– ప్రియా ఉత్పత్తుల్లో మీ పచ్చళ్లు, వడియాలు, అప్పడాలు అన్నీ అమ్ముతున్నారు కదా?
– హైదరాబాద్‌లో మీ ప్రియా పచ్చళ్ల రేటెంత..? అప్పడాల రేటెంత? శనగపొడి..కందిపొడి రేటెంత..? బెజవాడలో ఎంత రేటు..?
– రేట్లు ఏమైనా తేడా ఉన్నాయా? తేడా ఉండాలి కదా..?
– ఇటువంటి అబద్ధపు విషపు మాటలతో విషం చిమ్మడం, బురద చిమ్మడం పనిగా పెట్టుకున్నారు.
– లేని దాన్ని సృష్టించి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, మహాటీవీ, టీవీ5, ఈటీవీ లాంటి వాటిల్లో జగన్‌ గారిపై విషాన్ని అక్షర రూపంలో, వార్తల రూపంలో చిమ్ముతున్నారు.

మా పాలనలో రైతును విత్తనం నుంచి అమ్మకం వరకూ చేయిపట్టి నడిపించాం:
– ఈ నాలుగేళ్లలో ఎక్కడ చూసినా రైతు ఆత్మహత్యలని మాట్లాడుతున్నాడు..
– ఎక్కడ ఆత్మహత్యలు జరుగుతున్నాయో చూద్దాం రా చంద్రబాబూ..
– ఈ రాష్ట్రంలో జగన్‌ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్షం పడకుండా ఏ జిల్లాలోనైనా ఉందా?
– పంటలు పండకుండా రైతు వ్యవసాయం చేయకుండా ఎక్కడున్న ఉన్నారా?
– రైతుకు గిట్టుబాటు ధర లేకుండా ఏ జిల్లా అయినా ఉందా?
– రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుంచి పంట అమ్ముకోవడం వరకూ ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుంది.
– ఊరు పొలిమేర దాటకుండా ఊర్లో పంట గిట్టుబాటు ధరకు రైతు వద్ద కొనుగోలు చేయడం మీ కళ్లముందు కనిపిస్తున్నా అసత్యాలు మాట్లాడుతున్నారు.
– ఈ జగన్‌ రెడ్డి మందు రేట్లు భారీగా పెంచాడు..నాకు ఓటేయండి..మీ మద్యం రేట్లు తగ్గించేస్తాను అంటున్నాడు.
– సరసమైన రేట్లతో ఇంటింటికి మందు సప్లై చేస్తాడట..తాగుబోతులకు ఇది మంచి శుభవార్త అట.
– ఇది ఆయన పేద వాడి జీవితాన్ని మరింత కుంగతీయడానికి వారి బలహీనతలతో ఏ విధంగా ఆడుకుంటున్నాడో అర్ధం అవుతుంది.
– నిజంగా ఇతను ఒక పరిపాలకుడా? అధికారం కోసం వెంపర్లాడే దిగజారుడు మనస్తత్వం మాత్రమే ఇక్కడ కనిపిస్తోంది.
– బ్రాంది తక్కువ రేట్లకే ఇంటింటికి అందిస్తామని హామీ ఇచ్చే రాజకీయ నాయకుడిని ఈ ప్రపంచంలో ఎక్కడన్నా చూశామా?
– ఇలాంటి హామీని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన సందర్భాలు ఎక్కడన్నా చూశామా?
– మీ అబ్బాయి ఎన్ని కేసులు పెట్టించుకుంటే అన్ని పదవులు అంటాడు.
– ఆ మాటలు విని మీ కార్యకర్తలు జనాన్ని కొడుతున్నారు..వైఎస్సార్సీపీ వాళ్లను కొడుతున్నారు..కేసులు పెట్టించుకుంటున్నారు.
– మీరొచ్చి కేసులు పెడుతున్నారంటూ మొర్రో అని ఏడుస్తున్నారు..

నువ్వు చంద్రగిరి చెత్తగా ఉండి..కుప్పానికి వెళ్లి బంగారం అయ్యావా?:
– ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు ట్రాన్స్‌ఫర్లా అంటూ చంద్రబాబు విమర్శిస్తున్నాడు.
– ఒక చోట పనికిరాని చెత్త మరొక చోట బంగారం అవుతుందా అని ప్రశ్నిస్తున్నాడు.
– ఆయన వద్ద జవహర్‌ అనే ఒక మంత్రి ఉండేవాడు..ఆ మంత్రిని కొవ్వూరు నుంచి కృష్ణా జిల్లా తిరువూరుకు ట్రాన్స్‌ఫర్‌ చేశాడు..
– కొవ్వూరులో చెత్తను తిరువూరులో బంగారం అవుతుందని ట్రాన్స్‌ఫర్‌ చేశారా?
– మీరు తొలుత చంద్రగిరిలో పోటీ చేశారు..అక్కడి నుంచి మీరు కుప్పానికి ఎందుకు ట్రాన్స్‌ఫర్‌ అయ్యారు..?
– చంద్రగిరిలోని చెత్త కుప్పంలో బంగారం అవుతుందా?
– నరసాపురం, ముమ్మడివరం, రామచంద్రాపురంలో ఎమ్మెల్యేలను తీసుకొచ్చి పార్లమెంటుకు పెట్టలేదా?
– ఎంత మంది పార్లమెంటు సభ్యులను ఎమ్మెల్యేలుగా మీరు ట్రాన్స్‌ఫర్లు చేయలేదు..?
– మీరు చేస్తే పరిపాలన దక్షుడు, రాజనీతిజ్ఞుడు ప్రజలు భజన చేయాలి.
– జగన్‌ గారు కొన్ని సర్ధుబాట్లు చేస్తే చెత్త, బంగారం అంటూ మాట్లాడుతున్నాడు.

పుట్టిన ప్రతి ఆడబిడ్డకూ రూ.25 వేలు బ్యాంకు డిపాజిట్‌ వేశావా బాబూ?:
– సూపర్‌ సిక్స్‌ అని కొత్తగా ఈయనే కనిపెట్టాడట.
– డ్వాక్రాలను, దీపాన్ని నేనే కనిపెట్టాడట..ఈ రాష్ట్రంలోని ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తాడట..మూడు గ్యాస్‌ సిలిండర్లు ఇస్తాడట.
– చంద్రబాబునాయుడి 2014 మేనిఫెస్టోలో పేజీ 17లో పుట్టిన ప్రతి ఆడబిడ్డ పేరుతో మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకులో డిపాజిట్‌ చేస్తానన్నాడు.
– ఈ రాష్ట్రంలో ఏ ఆడబిడ్డకైనా పాతికవేలు రూపాయలు బ్యాంకు డిపాజిట్‌ ఎక్కడన్నా చేశాడా?
– పేద మహిళలకు స్మార్ట్‌ సెల్‌ఫోన్లు ఇస్తానన్నాడు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు సెల్‌ఫోన్లు ఇస్తాననన్నాడు. ఏ ఒక్క ఆడపిల్లకైనా ఒక్క సెల్‌ ఫోన్‌ ఇచ్చాడా?
– సంవత్సరానికి ఒక కుటుంబానికి 12 గ్యాస్‌ సిలిండర్లు..ఒక్కో సిలిండర్‌కు రూ.100 సబ్సిడీతో ఆధార్‌ కార్డుతో సంబంధం లేకుండా సరఫరా చేస్తామన్నాడు.
– మళ్లీ ఇప్పుడు మూడు సిలిండర్లు ఇస్తానంటూ వస్తున్నాడు. 2014లో 12 సిలిండర్ల హామీ ఏమైంది..?
– చంద్రబాబు 2014 మేనిఫెస్టో చూస్తే ఎంత దగాకోరు హామీలుంటాయో అర్ధమవుతుంది.
– అధికారం కోసం ఎంతటి పచ్చి దగాకైనా సిద్ధపడే వ్యక్తి చంద్రబాబు.
– నాకోసం కష్టపడండి..సైకిలెక్కండి..నేను దారి చూపిస్తా..బంగారు భవిష్యత్తు చూపిస్తా అంటున్నాడు.
– మండల కేంద్రాలకు మీరు నడుచుకుంటూ వెళ్తే అక్కడ వర్క్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తాను అంటున్నాడు.
– నీ 14 ఏళ్ల పాలనలో ఏ ఒక్క రోజైనా నీ కోసం కష్టపడిన తమ్ముడికి, నీకు ఓటేసిన ఓటరుకు ఏం బంగారు భవిష్యత్తు చూపించావో చెప్పాలి.
– మీ అబ్బాయికి తప్ప ఎవరికి బంగారు భవిష్యత్తు చూపించావో చెప్పాలి.
– మళ్లీ ఇప్పుడు ఈయన కోసం వంద రోజులు సైకిల్‌ తొక్కాలట…
– ఎక్కిన మొదటి సంవత్సరంలోనే కనిగిరికి మంచినీళ్లు ఇస్తానంటాడు…ఇంతకు ముందు ఎందుకు ఇవ్వలేదు సమాధానం చెప్పు చంద్రబాబు.
– 2014–19 వరకూ నిద్రపోయారా? కనిగిరిలో ఫ్లోరైడ్‌ లేదా? అప్పుడు మీ అబ్బాయే కదా నీటి సరఫరా చూసింది.

బీసీలు కులవృత్తుల్లోనే ఉండి పోవాలా?:
– ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు జయహో బీసీ అని పాడతావు. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఏమీ చేయడు.
– ఇస్త్రీ పెట్టె ఇచ్చాం..గొర్రెలిచ్చాం..ఇవి తప్ప ఇంకోటి ఏమైనా చెప్తున్నాడా?
– అంటే బీసీలు కులవృత్తుల్లోనే ఉండిపోవాలా?
– ప్రపంచ వ్యాప్తంగా వెనుకబడిన కులాలు, పేదరికంలో ఉన్న దళితులు దేశవిదేశాలు వెళ్తున్నారంటే నాడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారు సంపూర్ణ పీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడం వల్లే.
– ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యలు చదువుకుని విద్యార్థులు దేశ విదేశాల్లో స్థిరపడ్డారు.
– నిన్న జరిగిన జయహో బీసీ సదస్సులో నీ హయాంలో బీసీలకు ఏం చేశావో ఒక్క మాటన్నా చెప్పగలిగావా? చెప్పలేడు.
– టీడీపీకి బీసీలు వెన్నెముకలు అంటూ గాలికొట్టి వారి ఓట్లు దండుకోవాలని మాటలు చెప్తున్నాడు.
– మైనార్టీలకు రంజాన్‌ తోఫా ఇవ్వలేదు అంటున్నారు. హెరిటేజ్‌లో ఉన్న సామాన్లు అమ్ముకోడానికి ఈ తోఫాలు పెట్టి దోచుకున్నావు.
– రంజాన్‌కి హెరిటేజ్‌ సేమ్యా వండుకుని తింటే మైనార్టీలు ఎదిగిపోయినట్లే అంటాడు.
– కానీ తన హయాంలో ఐదేళ్లలో మంత్రి మాత్రం ఉండడు.
– ఇదీ చంద్రబాబుకు మైనార్టీల పట్ల ఉన్న అంకితభావం.
– గుంటూరు ఛానల్‌ను పరుచూరు తెస్తా..ప్రకాశం జిల్లాను గోదావరి నీళ్లతో ప్రతి చేను తడిపేస్తాను అంటున్నాడు.
– 2014–19 మధ్య గుంటూరు ఛానల్‌ పరుచూరు వరకూ తీసుకెళ్లేందుకు కాళీ దొరకలేదా? మనసు రాలేదా?
– ప్రకాశం జిల్లాలో చదువుకున్న వారికంతా అదే ఊళ్లో ఉద్యోగం కల్పిస్తాడట…ఆయన మాటలు వింటే విచిత్రంగా ఉంటాయి.
– పేదరికం నిర్మూలించే బాధ్యత నాది అంటున్న చంద్రబాబు తన 14 ఏళ్ల కాలంలో ఏ పేదవాడ్ని పేదరికం లేకుండా చేశావో చెప్పు.
– చదువు నేర్పడం అనేది ప్రభుత్వ బాధ్యత కాదు అని ఒక బాధ్యతగల ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడిన దుర్మార్గుడు చంద్రబాబు.
– చదువు ప్రభుత్వం నేర్పకపోతే పేదరికం ఎలా పోతుందో ఆయనే చెప్పాలి.
– ఏ పేదవాడి ఇంట్లోనైనా పేదరికం పోవాలంటే ఆ ఇంట్లోని పిల్లల ఉన్నత చదువుల ద్వారా మాత్రమే పేదరికం పోతుందని నమ్మిన వ్యక్తి జగన్‌ గారు.
– ఒకటో తరగతి నుంచి పీజీ వరకూ ఈ ఐదేళ్లు రూ.70వేల కోట్లు విద్యకు ఖర్చు పెట్టి చదువు ప్రభుత్వ బాధ్యత అని భుజానకెత్తుకున్న సీఎం వైఎస్‌ జగన్‌ గారు.
– ఈయన పది రూపాయలను వందెలా చేయాలో..వందను వెయ్యి ఎలా చేయాలో నేర్పిస్తాడట.
– రెండెకరాల రైతు కడుపున పుట్టి చంద్రబాబు రెండు లక్షల కోట్లకు ఎలా ఎదగాలో నేర్చుకున్నాడు తప్ప ఏ పేదవాడికి ఆ విద్య నేర్పలేదు.
– ఆ విద్యను తన ఎమ్మెల్యేలకు, మంత్రులకు మాత్రమే నేర్పించాడు.

ఎన్టీఆర్, హరికృష్ణ, దగ్గబాటి, రామ్మూర్తినాయుడు నీకు వ్యతిరేకం కాదా..?:
– ఇంట్లో బాబాయి కూతరు, సొంత చెల్లి మీకు వ్యతిరేకం అంటున్నాడు.
– చంద్రబాబును ఒకటే ప్రశ్నిస్తున్నా…నందమూరి హరికృష్ణ మీకు వ్యతిరేఖమా కాదా? ఎన్టీఆర్‌ గారు మీకు వ్యతిరేఖమా కాదా?
– మీమీద పుస్తకం రాసిన దగ్గుపాటి వెంకటేశ్వరరావు మీకు వ్యతిరేఖమా కాదా? మీ వదిన పురంధేశ్వరి మీకు వ్యతిరేఖమా కాదా?
–అంతెందుకు మీ సొంత తమ్ముడు నారా రామ్మూర్తినాయుడు కాంగ్రెస్‌ పార్టీలో చేరి మీకు వ్యతిరేకంగా పనిచేశాడా లేదా?
– మీ సొంత అక్క కుటుంబం వైఎస్సార్సీపీలో చేరి పనిచేశారా లేదా?
– మరి వీళ్లంతా ఎవరు..? మనింట్లో వాళ్లు చేస్తే రాజకీయమా..? జగన్‌ గారికైతే తప్పా?
– చంద్రబాబు పరిపాలనలో ఉన్నప్పుడేమో దోచుకోవడం..దాచుకోవడం..అధికారాన్ని తనచుట్టూ ఉన్న తన చుట్టాలకు మాత్రమే పంచిపెట్టడం.
– అధికారంలో పోతే మాత్రం ఈయన్ని పల్లకీలో మోయడానికి రా కదిలి రండి అంటాడు.
– అధికారంలోకి వచ్చాక బీసీలు ఉండరు…మైనార్టీలకు మంత్రి ఇవ్వడు..
– నీ జన్మలో ఎప్పుడైనా ప్రజలకు కానీ, పేదలకు కానీ..బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు చేసిన ఒక్కటంటే ఒక్క మైలు రాయి చెప్పగలవా?
– రాజశేఖరరెడ్డి గారు 108 పెట్టారు..ఆరోగ్యశ్రీ పెట్టారని చెప్పుకుంటారు. ఉన్నత చదువులు చదివించారు.
– జగన్మోహన్‌రెడ్డి గారు 17 మెడికల్‌ కాలేజీలు పెట్టాడు. రూ.70 వేలు ఖర్చు పెట్టి స్కూల్స్‌ను అద్భుతంగా తయారు చేస్తున్నాడు. 4 పోర్టుల నిర్మాణం చేస్తున్నాడు.
– ఇలాంటి ఒక్కటంటే ఒక్క పథకం నీ రాజకీయ చరిత్రలో చెప్పగలవా?
– నీకు నిజంగా దమ్ముంటే కనిగిరిలో నువ్వు 2014–19 వరకూ నువ్వు చేసిన పరిపాలన తీసుకొస్తాను అని చెప్పే దమ్ముందా?

కాపీ కొట్టి మేనిఫెస్టో పెట్టడం తప్ప చేసిందేముంది?:
– కర్నాటకలో మహిళలు బస్సు ఎక్కుతున్నారు కాబట్టి ఇక్కడ బస్సు అంటాడు.
– ఎక్కడన్నా ఒక రాజకీయ పార్టీ గెలిస్తే దాని హామీలను కాపీ కొట్టి ఇక్కడే చెప్పే ఖర్మ తప్పితే ఏముంది నీ దగ్గర..?
– పవన్‌కల్యాణ్‌కి, మీకు సిగ్గుండాలి..2019లో మీరు, మీ కొడుకు దొంగలు అని పవన్‌ అన్నాడు.
– పవన్‌ ఒక బుద్దిలేని జీవి అని..రాజకీయాలు చేతగావని మీరు మాట్లాడారు.
– ఇప్పుడు మేమంతా కలిసిపోయాం..మాకు ఓటేయండి…ఉద్ధరిస్తాం అని మాట్లాడుతున్నారు.
– 14–19 మధ్య ఈ రాష్ట్ర ప్రజలకు 650 హామీలు ఇచ్చి మేనిఫెస్టో కూడా ఎక్కడా దొరక్కుండా తీసేశాడు.
– ఎన్టీఆర్‌ సుజల పథకం కింద ఇంటింటికి రూ.2కే 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ అన్నాడు. ఎవరికైనా ఇచ్చాడా?
– ఇళ్లు లేని పేదవాడికి మూడు సెంట్లు స్థలం అన్నాడు…ఎవరికిచ్చాడు.?
– కేజీ నుంచి పీజీ నుంచి ఉచిత విద్య అన్నాడు..పీజీ విద్యార్థులకు ఐప్యాడ్‌లు అన్నాడు.
– అధికారం వచ్చిన తర్వాత విద్య అనేది ప్రభుత్వ బాధ్యత కాదు అని మాట్లాడాడు.

ప్రశ్నలు–సమాధానాలు

కాపు నాయకులు పవన్‌ను ప్రశ్నిస్తే మాకేం సంబంధం..?:
– ఎవరు ఆ కాపు పెద్దలు ఎవరు..? ఏవరు రెచ్చగొట్టారు..?
– నేను కాపుల్లో నాయకుడినే..నన్నైతే ఎవరూ రెచ్చగొట్టలేదు.
– 2014లో పవన్‌కళ్యాణ్, చంద్రబాబు కలిసి కాపులను బీసీలుగా చేస్తాం..మాకు ఓటేయండి అని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక మర్చిపోయారని శూలాలతో పొడిచి చెప్పాడు.
– నిద్రపోతున్న ఏనుగు లాంటి చంద్రబాబును, కుంభకర్ణుడిలా నిద్రపోతున్న పవన్‌ కల్యాణ్‌ను నిద్ర లేపడానికి తుని మీటింగును ఆయన ఎంచుకున్నారు.
– హరిరామజోగయ్య గారితో మాకేం పని? ఆయన రోజూ మమ్మల్ని తిడుతుంటే?
– ఆయనతో పవన్‌ ఫోన్లో మాట్లాడారు..మీరు ముఖ్యమంత్రి అవ్వాలని నిరాహార దీక్ష చేస్తానంటే మీరు ఏదో చెప్పారు.
– కాపులను టోకుగా చంద్రబాబుకు తాకట్టు పెట్టే పవన్‌ విధానాలను ఆయన ప్రశ్నిస్తే దానికి వైఎస్సార్సీపీకి ఏం సంబంధం?
– ఆయన 20 సీట్లు తీసుకున్నా ఆయనకు నామోషీ కాదు.
– చంద్రబాబునాయుడు కొడుకు అసలు వాడెవడు..వీడెవడు..మా నాన్నే ముఖ్యమంత్రి అన్నాడు.
– పవన్‌ కల్యాణ్‌ కనీసం ఉపముఖ్యమంత్రి అయినా అవుతాడా అంటే అది చంద్రబాబు, పొలిట్‌బ్యూరో నిర్ణయిస్తుంది అన్నాడు.
– ఆయనకు సిగ్గులేకపోతే, ఆత్మాభిమానం, ఆత్మగౌరవం లేకపోతే వైఎస్సార్సీపీకి ఏం సంబంధం..?
– అంతకు ముందు నాకు కులం లేదని, ఇప్పుడు కాపు కులాన్ని తీసుకున్నాడు కదా..ఆ కాపులు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు.

జగన్‌ గారిని నమ్మిన వారు ఆయన కోసం ఏదైనా చేస్తారు:
– చంద్రబాబు చేసే పనులకు వాళ్ల క్యాడర్‌ తల పట్టుకోవాలి తప్పితే జగన్‌ గారిని నమ్మి వచ్చిన వారు ఏం చేసినా మాకిష్టమే అని చెప్పేవారే.
– ఎవరైనా పదవులు, అధికారం కోసం మాత్రమే వచ్చినవారుంటే ఒక పది శాతం ఉంటే..మిగిలిన వారంతా జగన్‌ గారితోనే ఉంటాం..ఏం చేసినా జగన్‌ గారి కోసమే చేస్తాం అంటారు.
– జగన్‌గారు ఏం చేసినా ఈ రాష్ట్ర ప్రజల కోసం, పార్టీ మేలు కోసం మాత్రమే చేస్తారని ప్రతి ఒక్క కార్యకర్త నమ్ముతాడు.
– వేరే పార్టీలో ఉన్న వారిని ఎవర్నీ నా పార్టీలోకి రానివ్వను అని పవన్‌ కల్యాణ్‌ గతంలో మాట్లాడాడు.
– మళ్లీ ఇప్పుడు తలుపులు తీసే ఉన్నాయంటున్నాడు…చంద్రబాబు ఇచ్చే ఆ 20 సీట్లలో కూడా పోటీ చేసే అభ్యర్థులు లేక వైఎస్సార్సీపీ నుంచి బయటకు వెళ్లిన వారిని నెత్తిన పెట్టుకుంటున్నాడు.
– ఏమైంది నీ నియమావళి..నీ పెద్ద పెద్ద మాటలు ఏమయ్యాయి..పవన్‌ కల్యాణ్‌ గారు..?
– నేను కొత్త తరాన్ని తయారు చేస్తాను అన్న మాటలు ఏమయ్యాయి?
– అసలు జనసేన పార్టీకి తలుపులు, కిటీకీలు ఉంటే కదా తీయడానికి..?

ఎవరితో ప్రయాణం చేయాలనేది షర్మిల గారి వ్యక్తిగతం:
– షర్మిల గారు ఒక రాజకీయ నాయకురాలు. చాలా మంది రాజకీయ నాయకులు పార్టీలు మారుతూనే ఉన్నారు.
– ఆమె పార్టీ పెట్టారు..కాంగ్రెస్‌ పార్టీని విమర్శించారు..తర్వాత అదే పార్టీలో విలీనం చేశారు.
– తన అభిప్రాయాన్ని మార్చుకుంటున్నారు. అంతే తప్ప వేరేది లేదు.
– వైఎస్సార్సీపీ జగన్‌ గారి నాయకత్వంలో ఏర్పడింది. జగన్‌ గారి కుటుంబ సభ్యురాలైనా షర్మిల గారు మాలాగానే పార్టీలో పనిచేశారు.
– మేమంతా జగన్‌ గారి నాయకత్వం చూసి వచ్చాం.
– నాయకత్వం నచ్చలేదంటే ఉన్నవారుంటారు..వెళ్లే వారుంటారు..
– అది వారిష్టం..ఎవరితో ప్రయాణం చేయాలి అనేది వారి వ్యక్తిగత నిర్ణయం.
– తెలంగాణలో పార్టీ పెట్టేటప్పుడే వద్దని జగన్‌ గారు చెప్పారు. నా స్వేచ్ఛాయుత జీవితం..నా ఇష్టం అన్నారు.
– ఇక వారి రాజకీయ ప్రయాణంతో జగన్‌ గారికి సంబంధం ఏముంటుంది?
– కాపు రామచంద్రారెడ్డి గారు వైఎస్సార్సీపీలో రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు.
– ఆయన వద్ద ఎంత డబ్బులున్నా జగన్‌ గారి బొమ్మలేకుండా గెలవగలడా?
– పార్టీలకు ఎమ్మెల్యే అభ్యర్థులు ఏమీ సమస్య కాదు కదా?
– ఆయనకు సీటు ఇస్తాను అని తిప్పుకుని ఇవ్వకపోతే తప్పు. ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా చేశారు.
– అవకాశం ఇస్తే ఒక రకం..ఇవ్వకపోతే ఒక రకంగా మాట్లాడటం అనేది ఎంత వరకూ సమంజసం అనేది మమ్మల్ని మేం ప్రశ్నించుకోవాలి.

Best Web Hosting Provider In India 2024