ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.15-10-2022 (శనివారం) ..
శ్రీ రామలింగేశ్వర స్వామి నూతన రథాన్ని అత్యంత శోభాయమానంగా తీర్చిదిద్దాలి ..
అంతర్వేది రథ నిర్మాణ నిపుణులు గణపతి ఆచారి తో చర్చించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నందిగామ పట్టణంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి(శివాలయం) దేవస్థాన నూతన రథ నిర్మాణం పై సుప్రసిద్ధ రథ నిర్మాణ నిపుణులు – మహాబలేశ్వరం మరియు అంతర్వేది రథ తయారీదారులు గణపతి ఆచారి తో కలిసి శనివారం దేవస్థానం పాత రథాన్ని శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు పరిశీలించారు ,అనంతరం దేవస్థానం ఆవరణలో ఆలయ ఈవో మరియు వేద పండితుల తో కలిసి నూతన రథం నిర్మాణం పై చర్చించారు ..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ జగన్ మోహన్ రావు గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి సహకారంతో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధికి రూ.1.25 కోట్లు మంజూరయ్యాయని ,దానిలో రూ.26 లక్షలు నూతన రథ నిర్మాణానికి కేటాయించారని , రామలింగేశ్వరస్వామి ఉత్సవ రథాన్ని అత్యంత సుందరంగా -శోభాయమానంగా తీర్చిదిద్దేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు ,అదేవిధంగా ఆగమశాస్త్రం ప్రకారం -రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆచారాలకు, సాంప్రదాయాలకు అనుగుణంగా పురాతన రథ నియమావళిని అనుసరించి 16 స్తంభాలతో నూతన రథం నిర్మాణం జరగాలని సూచించారు ,అదే విధంగా ప్రతి ఏటా స్వామివారి ఊరేగింపు లో రధాన్ని లాగటానికి ట్రాక్టర్లు వినియోగిస్తున్నామని – నూతన రథాన్ని భక్తులు -ప్రజలు లాగుతూ స్వామివారి ఊరేగింపు జరిగేలా దానికి అనువుగా రధాన్ని నిర్మించాలని సూచించారు , ఈ సందర్భంగా దేవాదాయ శాఖకు రథ నిర్మాణానికి కేటాయించిన రూ.26 లక్షలు సరిపోవని ,మరికొన్ని నిధులు అవసరమవుతాయని రధ నిర్మాణ నిపుణులు గణపతి ఆచారి ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారి దృష్టికి తీసుకురాగా ,వెంటనే స్పందించిన ఆయన రథం తయారీకి అవసరమైన అదనపు నిధుల ఏర్పాటుపై దేవాదాయ శాఖ అధికారులతో చర్చిస్తానని తెలిపారు ,కార్తీక మాసం ఆరంభంలోనే రధం తయారీని ప్రారంభించాలని – 3 నెలల వ్యవధిలో రథం నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు ..
ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో , వేద పండితులు , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..