Best Web Hosting Provider In India 2024
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్‌లో అనామిక పెట్టి కాఫీ లాంటి టీ బాగుండకపోవడంతో అంతా కావ్యను కాఫీ పెట్టి తీసుకురమ్మంటారు. దాంతో కావ్య కాఫీ అందరికీ ప్రిపేర్ చేస్తుంది. ఇంతలో రాజ్‌కు శ్వేత నుంచి కాల్ వస్తుంది. కానీ, రాజ్ కట్ చేస్తాడు. ఎవర్రా ఫోన్ అని ప్రకాశం అడిగితే.. ఫ్రెండ్ అని చెప్పి కంగారుగా పైన గదిలోకి వెళ్తాడు రాజ్. ఇంతలో కావ్య అందరికీ కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. అనామిక మాత్రం అక్కర్లేదు అంటుంది.
ట్రెండింగ్ వార్తలు
ఆలోచనలో శ్వేత
కావ్య కాఫీని అంతా మెచ్చుకుంటారు. మా వదినను చూసి నేర్చుకో.. తను నేర్పిస్తుంది ఫీల్ అవ్వకు అని కల్యాణ్ అంటాడు. మరోవైపు కల్యాణ్ పెళ్లి తర్వాత కాల్ చేస్తా అన్నాడు ఇప్పటివరకు చేయలేదు. లాయర్‌ను మాట్లాడాలి, విడాకులకు అప్లై చేయాలని అంత కచ్చితంగా చెప్పాడు అని శ్వేత ఆలోచిస్తుంటుంది. ఇంతలో రాజ్ కాల్ చేసి నేనే కాల్ చేస్తానన్నాను కదా. ఎందుకు చేస్తావ్ అని రాజ్ అంటే.. పక్కన కావ్య ఉందా అని శ్వేత అడుగుతుంది.
అంతా పక్కనే ఉన్నారు అని రాజ్ అంటాడు. అందరి ముందు చాలా ఇబ్బంది పెట్టానా. సారీ అని శ్వేత అంటుంది. సారీ ఎందుకు అని రాజ్ అంటే.. సరే ఇవాళ్టి విషయం మర్చిపోయారా అని లాయర్, విడాకుల గురించి గుర్తు చేస్తుంది శ్వేత. అవును, మర్చిపోయాను అని, లాయర్‌ను అపాయింట్ మెంట్ తీసుకున్నావా అని అడుగుతాడు రాజ్. ఎప్పుడో తీసుకున్నాను. మనల్ని కలిసి కోర్టుకు వెళ్తారట. కానీ, ఒక్కసారి ముందుకు వెళితే.. వెనక్కి తగ్గడమంటూ ఉండదు అని శ్వేత అంటుంది.
కావ్యపై చాడీలు
లేదు కచ్చితంగా తీసుకోవాల్సిందే అని రాజ్ అంటాడు. ఇంతలో కావ్య వచ్చి టీ, టిఫిన్ చేయరా అని అడుగుతుంది. ముఖ్యమైన మీటింగ్ ఉందని చెప్పి చిరాకుగా వెళ్లిపోతాడు రాజ్. మరోవైపు తనకు కావ్య వల్ల అవమానం జరిగిందని తెగ ఫీల్ అయిపోతుంది అనామిక. తన దగ్గరికి వచ్చిన రుద్రాణి ఆ కోపానికి మరింత ఆజ్యం పోస్తుంది. నన్నెవరు అవమానించలేదు. మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన తను అవమానించడం ఇంకా బాధగా ఉందని అనామిక అంటుంది.
నువ్ కావ్యలా గ్రిప్‌లో పెట్టుకోవాలి అని రుద్రాణి అంటే.. అలాంటి డ్రామాలు నావల్ల కాదని అనామిక అంటుంది. అలా చేయకుంటే నీకే నష్టం. ముందు నేను అలాగే అనుకున్నాను. కానీ, కావ్య నా నెత్తిమీద వచ్చి కూర్చుంది. ముందు కల్యాణ్‌ను నీవైపుకు తిప్పుకో. అతనికి కావ్య సీతమ్మ తల్లి లాగా. కావ్యది తప్పున్నట్లు కల్యాణ్‌కు చూపించు. తర్వాత కుటుంబం అంతా తిప్పుకో అని రుద్రాణి చెబితే.. అనామిక సరే అంటుంది. పిచ్చిదానా నేను నిన్ను నావైపుకు తిప్పుకున్నాను. నిన్ను ఆ కావ్యమీదకు వదులుతా అని రుద్రాణి మనసులో అనుకుంటుంది.
కావ్య షాక్
మరోవైపు లాయర్ కోసం కారులో రాజ్ శ్వేత ఎదురుచూస్తుంటారు. ఇలా వెయిట్ చేయడం ఏంటీ, ఆఫీస్‌కు రమ్మంటే అయిపోయేది కదా అని చిరాకు పడతాడు రాజ్. ఈ పనిమీదే వచ్చాం కదా ఎందుకు చిరాకు. నాకు చిరాకు పడేవాళ్లంటే చిరాకు అని శ్వేత కోపంగా అంటుంది. దాంతో కూల్ చేయడానికి ఐస్ క్రీమ్ తిందామా అంటాడు రాజ్. దాంతో ఇద్దరు కారు దిగి ఐస్ క్రీమ్ తింటుంటారు. అప్పుడే ఆటోలో వెళ్తున్న కావ్య రాజ్ ను చూసి షాక్ అవుతుంది.
శ్వేతకు ఐస్ క్రీమ్ అంటుకుంటే తుడుస్తూ రాజ్ చాలా చనువుగా ఉంటాడు. అదంతా ఆటోలో వెళ్తున్న కావ్య చూసి షాక్ అవుతుంది. ఆఫీస్‌కు అర్జంట్ మీటింగ్ ఉందని చెప్పి ఇక్కడ ఏం చేస్తున్నారు, ఆ అమ్మాయి ఎవరు. మావారితో అంత చనువుగా ఉంది అని భయపడుతుంది. దాంతో రాజ్‌కు కాల్ చేస్తుంది కావ్య. అది చూసి టెన్షన్ పడిన రాజ్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. ఎక్కడున్నారు అని కావ్య అడిగితే.. ఇంకెక్కడ ఉంటాను అని రాజ్ అంటాడు. ఆఫీస్‌కు వెళ్లిపోయాను అంటారు అని కావ్య అంటే.. అదే చెబుతున్నా అని రాజ్ అంటాడు.
కోపంతో కారు దిగిన రాజ్
మరి ఆ బైక్ సౌండ్స్ ఏంటీ అని కావ్య అడిగితే.. పైకి విండో తెరిచి మాట్లాడుతున్నా.. పెట్టేయ్ ఫోన్ అని రాజ్ కసురుకుంటాడు. దాంతో బాధగా కాల్ కట్ చేస్తుంది కావ్య. ఇంతలో శ్వేతకు లాయల్ కాల్ చేసి కోర్టుకు వెళ్లినట్లు, అరగంట తర్వాత కలుస్తా అని చెబుతాడు. దాంతో అయితే ఆఫీస్‌కే వచ్చి కలవమని అని రాజ్ చెబుతాడు. ఆటోలో కావ్య, కారులో రాజ్ శ్వేత వెళ్తారు. ఆటో డ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ రాజ్ వాళ్లకు అడ్డుగా వస్తాడు. దాంతో కోపంతో కారు దిగుతాడు రాజ్.
రాజ్‌ను చూసి ఇందాక నేను తనను రోడ్డు మీద చూశానని గిల్టీగా ఫీల్ అవుతారని కొంగు అడ్డుగా కప్పుకుంటుంది కావ్య. అలా ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం అని రాజ్ నీతులు చెబుతుంటాడు. శ్వేత కూడా కారు దిగి సారీ చెప్పాడు కదా పదా అని అంటుంది. దాంతో ఇద్దరు వెళ్లిపోతారు. అమ్మాయి పక్కన ఉంటే చాలు అందరూ హీరోలే అని డ్రైవర్ అంటే.. నీ మంచికోసమేగా చెప్పింది. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం తప్పే కదా అని కావ్య అంటుంది.
నెత్తిన పెట్టుకుని ఊరేగండి
మరోవైపు రుద్రాణిపై కుర్చీ పెట్టబోతుందు స్వప్న. ఏయ్.. ఏంటిది అని రుద్రాణి అడుగుతుంది. నేను మీ నెత్తిన కూర్చుంటాను. ఉత్సవ విగ్రహంలా నన్ను నెత్తిన పెట్టికుని ఊరేగండి అని స్వప్న అంటుంది. ఆరోజు నా తప్పు లేకుంటే నెత్తిన పెట్టుకుని ఊరేగుతా అంది కదా. అదే చేయమంటున్నా అని స్వప్న అంటుంది. రుద్రాణికి కరెక్ట్ మొగుడు నువ్వు, నేను కాదు.. ఈ పిల్లే అని అపర్ణ, ధాన్యలక్ష్మీ అనుకుంటారు. నేను ఏదో మాటవరుసకు అన్నాను రుద్రాణి అంటే.. నా కడుపులో ఉంది వీళ్ల వారసత్వమే కదా. నాకు ఓ జ్యూసో, ఫ్రూటో ఇవ్వొచ్చు కదా. ఎప్పుడు చూడు ఆ మేకప్, బ్లౌజ్‌లంటూ కన్నెపిల్లలా రెడీ అవ్వడమే తప్పా కోడలి గురించి పట్టించుకుందా అని స్వప్న అంటుంది.
దాంతో స్వప్నకు అపర్ణ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు నీకు ఏం కావాలి అని ఇందిరాదేవి అంటే.. నాకు అత్తయ్య సేవలు చేయాలని స్వప్న అంటుంది. దాంతో రుద్రాణి షాక్ అవుతుంది. స్వప్నది అసలే కనకం రక్తం అంతా ఈజీగా వదిలిపెట్టదు అని ధాన్యలక్ష్మీ అంటుంది. దానికి నేను కావ్యలా కాదు. సంధు దొరికితే మా అమ్మను లాగకండి. నాతో కొంచెం జాగ్రత్త అని ఫైర్ అవుతుంది స్వప్న. స్వప్న అడిగినదాన దాంట్లో న్యాయం ఉందని ఇందిరాదేవి అంటుంది.
కావ్యతో విడాకులు
బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో రాజ్ ఆఫీస్‌లో లాయర్ కలుస్తాడు. శ్వేత మొత్తం చెప్పింది కదా. ఎలా ప్రొసీడ్ అవ్వమంటారు అని రాజ్ అడుగుతాడు. అప్పుడే వచ్చిన కావ్య ఆ మాటలు వింటుంది. మా కేసులో ఇద్దరికీ డివోర్స్ తీసుకోవడం ఇష్టమే అని రాజ్ అనడం విని కావ్య షాక్ అవుతుంది. చాలా మంది ముందు ఓకే అన్నా తర్వాత నో అంటారు. మీరేమైనా అని లాయర్ అంటే.. అలాంటి ఉద్దేశం లేదని రాజ్ అంటాడు.
మనమేం తప్పు చేయడం లేదు కదా అని శ్వేత అంటే.. దీనికి ఇదే పరిష్కారం అని రాజ్ అంటాడు. తర్వాత ఆఫీస్‌లో శ్వేతతో చనువుగా మాట్లాడుతూ నవ్వుతూ వెళ్తుంటాడు రాజ్. అక్కడే ఉన్న కావ్య అదంతా చూస్తుంది. ఇంతలో కావ్యను రాజ్ చూసి షాక్ అవుతాడు.