Best Web Hosting Provider In India 2024

Krishna mukunda murari serial january 6th episode: కృష్ణ ముకుంద మురారి సీరియల్ రోజురోజుకీ ఉత్కంఠగా మారింది. ఓ వైపు భవానీ దేవి ముకుంద, మురారిల పెళ్లి చేయాలని చూస్తుంటే మరొకవైపు కృష్ణ నిర్దోషి అని నిరూపించేందుకు శ్రమిస్తున్నారు. కృష్ణ చిన్నాన్న పెద్దపల్లి ప్రభాకర్ యాక్సిడెంట్ చేయలేదని, సర్జరీ చేయించిన వ్యక్తి అతను కాదని మురారి చెప్తాడు. తనకి సర్జరీ చేయించిన వ్యక్తిని గుర్తు పట్టగలిగే ఏకైక వ్యక్తి పరిమళ. ఆమె చెప్పినట్టుగా ఆర్టిస్ట్ శ్రీధర్ తో మురారి స్కెచ్ వేయించాలని చూస్తాడు. కానీ విషయం తెలిసిన దేవ్ శ్రీధర్ ని డబ్బులతో కొనేసి తప్పు స్కెచ్ వేసేలా చేస్తాడు. ఇది కూడా మురారి వాళ్ళ ప్లాన్ అని భవానీ అపార్థం చేసుకుంటుంది.
ట్రెండింగ్ వార్తలు
శ్రీధర్ హత్య చేసిన వాడు దొరికేశాడు
ఎలాగైనా శ్రీధర్ నుంచి నిజం రాబట్టాలని అనుకునే టైమ్ కి దేవ్ అతడిని చంపేస్తాడు. దీంతో సీరియల్ కీలక మలుపు తిరిగింది. శ్రీధర్ ని చంపిన వ్యక్తి చేతికి ఉన్న ఉంగరం ముద్ర అతని మొహం మీద ఉంటుంది. అది మురారి, కృష్ణ గమనిస్తారు. ఆ ఉంగరం ఎవరిదో తెలిస్తే అసలు దోషి దొరికినట్టేనని అనుకుంటారు. మరోవైపు పెళ్ళికి రెండు రోజులే సమయం ఉందని ఈలోపు కేసు తేల్చలేకపోతే తనకి ఇష్టం లేకపోయినా ముకుందని పెళ్లి చేసుకుంటానని మురారి మాట ఇస్తాడు. ఈరోజు ఎపిసోడ్ ప్రోమోలో ఏముందంటే..
భవానీ చెప్పినట్టుగా ముకుంద, మురారికి నలుగు ఏర్పాట్లు చేస్తుంది. కావాలని కృష్ణ ఉంటున్న ఇంట్లో ముకుందకి నలుగు పెడుతున్నట్టు చెప్తుంది. అటు మురారికి రేవతి నలుగు పెడుతుంది. అత్తయ్య నా జీవితం నిలబెడుతుంది మీరే ముందుగా మీరే నాకు గంధం పూయండని ముకుంద భవానీని అడుగుతుంది. ఇదంతా కృష్ణ బాధగా చూస్తూ ఉంటుంది. భవానీ ఇక కృష్ణని ముకుందకి గంధం రాయమని చెప్తుంది. కృష్ణ చేసేది ఏమి లేక బాధగా తనకి గంధం పూస్తుంది. అప్పుడే మురారి భవానీ వాళ్ళ దగ్గరకు వస్తాడు.
శ్రీధర్ ని ముగ్గురు, నలుగురు కలిసి చంపారని చెప్పాను కదా. వాళ్ళలో ఒకడు పోలీసులకు దొరికాడని మురారి భవానీకి చెప్తాడు. ఆ మాట విని ముకుంద టెన్షన్ పడుతుంది. పోలీసుల చేతికి చిక్కిన వాడు దేవ్ పేరు బయట పెడతాడా లేదంటే దేవ్ మరొక ఎత్తుగడ వేసి తప్పించుకుంటాడా తెలియాలంటే ఈరోజు ప్రసారమయ్యే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.
నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
శ్రీధర్ ని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని కృష్ణ, మురారి ఆలోచిస్తూ ఉంటారు. ఈ కేసు పరిష్కారం అవాలంటే ఉంగరం వ్యక్తి దొరకాలని అనుకుంటారు. ఇక కృష్ణలో అసలు భయం అనేది కనిపించడం లేదని భవానీ ఆలోచిస్తూ ఉంటుంది. ఒకవేళ తానేమైన తప్పు చేస్తున్నానా అని తనని తాను ప్రశ్నించుకుంటుంది. కానీ అంతలోనే తానేమీ తప్పు చేయడం లేదని డిసైడ్ అవుతుంది. తన కూతురి జీవితం నాశనం చేయవద్దని భవానీని బతిమలాడటానికి శకుంతల వస్తుంది కానీ కనీసం ఒక్క మాట కూడా మాట్లాడనివ్వకుండా భవానీ తనని పంపించేస్తుంది.
ఆదర్శ్ వస్తాడా? దేవ్ దొరికిపోతాడా?
అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర భోజనానికి కూర్చున్న సమయంలో కృష్ణ దేవ్ చేతికి ఉన్న ఉంగరం చూస్తుంది. శ్రీధర్ మొహం మీద ఉన్న ఉంగరం గుర్తులాగా ఉందని మొదట అనుకున్నా కూడా దేవ్ అన్నయ్య అలా ఎందుకు చేస్తాడులే అనుకుని ఈ విషయం మురారికి చెప్పకుండా ఉంటుంది. ఇక భవానీ ముకుంద, మురారికి నలుగు పెట్టె కార్యక్రమం జరుగుతుందని అది కూడా కృష్ణ ఇంట్లోనే అని చెప్పేసరికి తను ఏడుస్తూ బాధగా అన్నం ప్లేట్ లో చెయ్యి కడిగేసుకుని వెళ్ళిపోతుంది.
భవానీ మాటలు తలుచుకుని కృష్ణ ఏడుస్తూ ఉంటుంది. ఈ పెళ్లి ఆగాలంటే ఉంగరం వ్యక్తి దొరకాలి, లేదంటే పెద్దత్తయ్య మనసు అయినా మారాలి. లేదంటే ఆదర్శ్ అయినా తిరిగి రావాలి. ఈ మూడింటిలో ఏదో ఒకటి జరిగితేనే పెళ్లి ఆగిపోతుందని మనసులో అనుకుంటుంది. మురారి కృష్ణ బాధని గమనించి తనకి ధైర్యం చెప్తాడు.