ysrcp nandigama :
ఎన్టీఆర్ జిల్లా / నందిగామ మండలం :
ది.17-10-2022(సోమవారం) ..
రాష్ట్రంలో సువర్ణ పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ..
మునగచర్ల గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం”లో భాగంగా సంక్షేమ పథకాలను వివరిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నందిగామ మండలంలోని మునగచర్ల గ్రామంలో గడపగడపకు- మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ – ప్రజల సమస్యలను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు అడిగి తెలుసుకున్నారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో నే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సువర్ణ పరిపాలన అందించారని తెలిపారు ,రాష్ట్రంలో రైతు పక్షపాత ప్రభుత్వం గా పాలన సాగిస్తున్న వైయస్ జగన్ రైతుల సంక్షేమం అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారన్నారు ,రైతు భరోసా ద్వారా ప్రతి ఏటా పెట్టుబడి సాయం కింద రైతులకు మూడు విడతల్లో రూ.13500 /- లను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారని చెప్పారు , అదేవిధంగా ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన విత్తనాలు -ఎరువులు- పురుగు మందులు సబ్సిడీపై అందించడమే కాకుండా రైతులకు వ్యవసాయం పై అవసరమైన సలహాలు-సూచనలను సంబంధిత అధికారుల ద్వారా అందించడం జరుగుతుందని తెలిపారు ,మునగచర్ల గ్రామ రైతులు ఒక గ్రూపుగా ఏర్పడటంతో వారికి సబ్సిడీపై వరి కోత యంత్రాన్ని కూడా అందించడం జరిగిందని తెలిపారు , అదేవిధంగా రైతులు పండించిన పత్తి పంటకు గిట్టుబాటు ధర- మద్దతు ధర కల్పిస్తూ రైతుల పాలిట కల్పవృక్షంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నారన్నారు , రైతులు పండించిన పంటను నేరుగా ఆయా గ్రామాల్లోనే కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం సహకార సంఘాల ద్వారా చర్యలు చేపట్టిందన్నారు ..
ఈ కార్యక్రమంలో గ్రామ కన్వీనర్ గంట వెంకటేశ్వరరావు ,వైస్ ఎంపీపీ ఆకుల రంగా (హనుమంతరావు) ,మండల కన్వీనర్ శివ నాగేశ్వరరావు , జిల్లపల్లి రంగారావు పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు ,తదితరులు పాల్గొన్నారు ..