Best Web Hosting Provider In India 2024
AP Municipal Workers Strike : మున్సిపల్ కార్మికుల సంఘాలు అడిగిన ప్రతీ డిమాండ్ ను అంగీకరించామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అన్ని కేటగిరీల కార్మికులకు హెల్త్ అలవెన్సులు అనే పేరు లేకుండా మొత్తం వేతనంగానే చెల్లింపులు చేస్తామని చెప్పామన్నారు. హెల్త్ అలవెన్సులు రూ.6 వేలు అందులోనే కలిపి ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఎక్స్ గ్రేషీయాను కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఇస్తామన్నారు. ప్రమాదంలో చనిపోయిన కార్మికులకు పరిహారం రూ.7 లక్షలకు పెంచాలని కార్మిక సంఘాలు కోరాయని, దానికి ప్రభుత్వం అంగీకరించిందన్నారు. అలాగే మరికొన్ని డిమాండ్ లకు మంత్రుల కమిటీ అంగీకారం తెలిపిందన్నారు. తక్షణం సమ్మె విరమించి విధుల్లో చేరితే కార్మికుల డిమాండ్లు అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇస్తోందన్నారు. సమ్మె కాల్ ఆఫ్ చేస్తే నోటిఫికేషన్ ఇస్తామన్నారు. పెంపు అంతా వచ్చే ప్రభుత్వంలోనే ఇస్తామని కార్మిక సంఘాలకు తేల్చి చెప్పామన్నారు.
ట్రెండింగ్ వార్తలు
సమానపనికి సమాన జీతం
ఏపీ ప్రభుత్వంతో మున్సిపల్ కార్మిక సంఘాల చర్చలు విఫలమయ్యాయి. కార్మికుల డిమాండ్ లు పరిష్కారించేలా చర్చలు జరగలేదని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు తెలిపారు. 11వ పీఆర్సీలో ఇప్పటి వరకూ రెండు విభాగాలే ఉన్నాయని, మిగిలిన కార్మికులను చేర్చాలని కోరామన్నారు. రూ.6 వేల అలవెన్స్ జీతంలో పెంచడం వల్ల అదనపు లబ్ధి లేదన్నారు. ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తున్న వారికి రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశామని, దానిపై ఏం చెప్పలేదన్నారు. సమానపనికి సమాన జీతం అంటే ఎందుకు ఒప్పుకోరని ప్రశ్నించారు. ఔట్ సోర్సింగ్ వాళ్లను కాంట్రాక్ట్ లోకి తెస్తామన్నారన్నారు.
సమ్మె విరమించమన్నరని, కానీ కుదరదని చెప్పామన్నారు. పారిశుద్ధ్య సంఘాలతో మీటింగ్ ఏర్పాటు చేసుకుని నిర్ణయం చెపుతామని, అప్పటి వరకు సమ్మె కొనసాగుతుందని మంత్రులతో చెప్పారమన్నారు. ఎన్నికలకు ముందు రాజకీయం చేయడానికి అన్నింటినీ తెరమీదకు తెస్తున్నారని మంత్రుల అంటున్నారని నాలుగున్నరేళ్లుగా అధికారులు, మంత్రులు కార్యాలయాలు చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని ఉమామహేశ్వరావు ఆరోపించారు. ఎన్నికల సమయం కనుకే మా డిమాండ్లపై ఆలోచిస్తారని రాజకీయ చైతన్యంతోనే ఉద్యమిస్తున్నామన్నారు. కార్మికులు డిమాండ్లు పరిష్కరించకపోతే ఎన్నికల్లో సత్తా చూపుతామన్నారు.
డిమాండ్లు నెరవేర్చే వరకూ సమ్మె ఆగదు
అలవెన్సులు కూడా వేతనంలోనే కలిపి ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని ఏఐటీయూసీ కార్మిక సంఘం నేత రవీంద్రనాథ్ అన్నారు. పారిశుద్ధ్యం పని చేసే కార్మికులకు వేతనం పెంచమని డిమాండ్ చేస్తే, ఇప్పుడు అలవెన్సులు కలిపేసి అదే సరిపెట్టుకోవాలని ప్రభుత్వం చెబుతోందన్నారు. సమ్మె యథాతథంగా కొనసాగుతుందని, డిమాండ్లు నెరవేర్చే వరకూ సమ్మె ఆపేది లేదన్నారు.
రిస్క్ అలవెన్స్ పై
రిస్క్ తో పనిచేసే వారికి రిస్క్ అలవెన్స్ ఇచ్చేందుకు అంగీకరించాలని జీఎంవోను అడిగామని, స్పష్టత ఇవ్వలేదని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఉమా మహేశ్వరరావు తెలిపారు. శానిటేటెడ్ రిలేటెడ్ వర్కర్లు ఒకే కేటగిరికి తెచ్చి రూ.21 వేలు జీతానికి మంత్రులు, అధికారుల అంగీకారించారని తెలిపారు. ఆరు వేలు హెల్త్ అలవెన్స్ జీతంగా మార్పు, రూ.15 వేలు జీతంతో కలిపి రూ.21 వేలు నిర్ణయించామన్నారు. శానిటేషన్ డ్రైవర్లు, క్లీనర్లు, మలేరియా ఫాగింగ్ చేసే వర్కర్లు, పార్కుల్లో శానిటేషన్ సిబ్బందిని కూడా ఈ కోవలో చేర్చాలన్న డిమాండ్ కు జీఎంఓ అంగీకారం తెలిపిందన్నారు. కుక్కలు, పాములు , కోతులు పట్టే వారు, అనాథ శవాలు ఖననం చేసే వారిని కూడా రూ.21 వేల శాలరీకి అంగీకరించారన్నారు. ఇంజినీరింగ్ విభాగం 8 కేటగిరీల అన్ స్కిల్డ్ నుంచి సెమీ స్కిల్డ్ కు మంత్రులు, అధికారుల కమిటీ అంగీకారం తెలిపిందన్నారు. విలీన గ్రామాల పంచాయతీ కార్మికులను మున్సిపల్ కార్మికులుగా గుర్తించి 36 వేల మందికి రూ.21 వేలు జీతం ఇచ్చేందుకు జీఎంఓ అంగీకారం తెలిపిందన్నారు. ప్రమాదవశాత్తు చనిపోయిన కార్మికులకు పరిహారం 2019 నుంచి ఇవ్వాని డిమాండ్ చేశామన్నారు.