Praja Palana Applications : ముగిసిన ‘ప్రజా పాలన’ సభలు – 1.25 కోట్ల దరఖాస్తులు, వాటి కోసమే ఎక్కువ అర్జీలు

Best Web Hosting Provider In India 2024

Telangana Govt Praja Palana Applications: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన ‘ప్రజా పాలన’ కార్యక్రమం శుక్రవారం(జనవరి 6) ముగిసింది. అభయహస్తం పేరిట పలు పథకాలకు దరఖాస్తులను స్వీకరించింది. డిసెంబర్ 28 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం…. జనవరి 6 వరకు కొనసాగింది. ఇందులో భాగంగా… అర్హులైన వారి నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఏకంగా కోటిపైగా అప్లికేషన్లను స్వీకరించారు అధికారులు. మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అందాయి. వీటిలో కోటికి పైగా అభయహస్తానికి సంబంధించినవి ఉండగా… 20 లక్షల దరఖాస్తులు పలు సమస్యలపై వచ్చినట్లు అధికారవర్గాలు చెప్పాయి.

 

ట్రెండింగ్ వార్తలు

ఎక్కువగా వీటికే…

ప్రజా పాలన కార్యక్రమంలో ప్రభుత్వ స్కీమ్ ల కోసం అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. ఇందులోనూ ప్రధానంగా… ఇళ్లు, చేయూత, రేషన్ కార్డుల కోసం ఎక్కువగా అప్లికేషన్లు వచ్చాయి. తెల్ల కాగితంపై కూడా దరఖాస్తులు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పగా… ఎక్కువగా రేషన్ కార్డుల కోసం అర్జీలు వచ్చాయి. గత ప్రభుత్వంలో ఇచ్చిన గృహలక్ష్మి దర­ఖాస్తులను కాంగ్రెస్‌ సర్కార్ రద్దు చేయడంతో.. వారంతా తిరిగి దరఖాస్తు చే సుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజలు అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు ఇచ్చారు.

అభయహస్తం కింద తీసుకున్న దరఖాస్తుల్లో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాలు ఉన్నాయి. మహాలక్ష్మి స్కీమ్ కు మహిళలు భారీగా దరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పటికే రైతుబంధు కింద నిధులు తీసుకుంటున్న రైతులు…. రైతుభరోసాకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపిన నేపథ్యంలో…. దీనికి దరఖాస్తులు తగ్గాయి.

మళ్లీ 4 నెలల తర్వాత…

జనవరి 6వ తేదీ వరకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసింది. ప్రస్తుతానికి గడువు పొడిగించే ప్రసక్తే లేదని వెల్లడించింది. అయితే ఇప్పుడు దరఖాస్తు చేసుకోలేని వారు ఆందోళన చెందాల్సిన పని లేదని… మళ్లీ నాలుగు నెలల తర్వాత ప్రజా పాలన కార్యక్రమం ఉంటుందని తెలిపింది. ఇందులో మళ్లీ దరఖాస్తులను స్వీకరిస్తుందని చెప్పింది.

 

డేటా ఎంట్రీపై డెడ్ లైన్

ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కీలక ఆదేశాలు ఇచ్చారు. జనవరి 17 వతేదీ లోపు డేటా ఎంట్రీని పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియను మండల కేంద్రాల్లో చేపట్టి పూర్తి చేయాలన్నారు. ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి ప్రజాపాలన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినందున… దరఖాస్తు ఇవ్వని వారు, మరోసారి తిరిగి దారఖాస్తులు అందచేయవచ్చని తెలియజేశారు.

ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా… ముఖ్యంగా 5 పథకాలకు సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇందులో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాలున్నాయి. ప్రతి పథకానికి వేర్వేరుగా దరఖాస్తు చేసుకోనవసరం లేకుండా.. ఏ పథకానికి అర్హులైనవారు ఆ పథకానికి అవసరమైన వివరాలు మాత్రమే దరఖాస్తు ఫారంలో నింపాల్సి ఉంటుంది. ఒకే ఫారమ్ లో అన్ని పథకాలకు సంబంధించిన కాలమ్స్ ఇచ్చారు.దరఖాస్తు ఫారమ్ తో పాటు రేషన్‌కార్డు జత చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా… ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీలు, దరఖాస్తుదారు ఫొటో అతికించాలి.

మెుత్తం 4 పేజీల దరఖాస్తు ఫారం ఉంటుంది. తొలి పేజీలో కుటుంబ యజమాని పేరు, పుట్టిన తేదీ, ఆధార్‌ సంఖ్య, రేషన్‌కార్డు సంఖ్య, మొబైల్‌ ఫోన్‌ నంబరు, వృత్తితో పాటు సామాజికవర్గం వివరాలను నింపాలి.ఆ తర్వాత సామాజికవర్గ వివరాలతో పాటు కుటుంబసభ్యుల పేర్లు, వారి పుట్టిన తేదీలు, వారి ఆధార్‌ నంబర్లు రాయాలి. తర్వాత దరఖాస్తుదారు చిరునామా నింపాలి. కుటుంబ వివరాల తర్వాత పథకాలకు సంబంధించిన వివరాలున్నాయి. ఏ పథకానికి దరఖాస్తు చేయాలని అనుకుంటే ఆ పథకం దగ్గర టిక్‌ మార్కు చేయాలి.

 

 

WhatsApp channel
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024