Best Web Hosting Provider In India 2024
AP Telangana Weather Updates : తెలంగాణ , ఆంధప్రదేశ్ వ్యాప్తంగా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచు తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోంది. అయితే తెలంగాణ ప్రాంతంలో ఆదివారం అత్యంత చలి తీవ్రత ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హన్మకొండ, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కు వర్షసూచన అమరావతి వాతావరణ కేంద్రం.
ట్రెండింగ్ వార్తలు
ద్రోణి ఎఫెక్ట్ – ఏపీకి వర్ష సూచన
బంగాళాతాన్ని అనుకొని ద్రోణి కొనసాగుతుంది. ఇది ప్రస్తుతం దక్షిణ శ్రీలంక నుంచి నైరుతి బంగాళాఖాతం, దక్షిణాంధ్ర తీర ప్రాంతం వరకు విస్తరించిన ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. ఉత్తర శ్రీలంక తీరం మీదుగా సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వెల్లడించింది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడుతాయని పేర్కొంది.
దక్షిణ కోస్తాలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరికొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడొచ్చని అంచనా వేసింది. ఇక రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని తెలిపింది.
ఉత్తర కోస్తాలో ఆదివారం తేలికపాటి వర్షాలు పడుతాయని ఐఎండీ చెప్పింది. రేపు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంటుందని తెలిపింది. రాయలసీమ జిల్లాలో చూస్తే…. ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడొచ్చని పేర్కొంది. రేపు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.