Best Web Hosting Provider In India 2024
TGO Mamatha Transfer: తెలంగాణ గెజిటెడ్ అధికారుల అద్యక్షరాలు,కూకట్ పల్లి జోన్ పరిధిలో సుధీర్ఘ కాలంగా జోనల్ కమిషనర్ గా పని చేసిన మమతపై రేవంత్ సర్కార్ బదిలీ వేటు వేసింది.ఆమెను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ డైరెక్టర్ గా బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉతతర్వులు జారీ చేసింది.
ట్రెండింగ్ వార్తలు
జోనల్ కమిషనర్ మమత బీఆర్ఎస్ పార్టీ విధేయురాలిగా పని చేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో ఓ మంత్రి అండతో తనకు కావాల్సిన చోట పోస్టింగ్ వేయించుకోవడం… గంటలో తనకు వచ్చిన బదిలీ ఆర్డర్ను సైతం వెనెక్కి తీసుకునేలా ప్రభుత్వం పై ఒత్తిడి చేశారనే వార్తలు అప్పట్లో వచ్చాయి. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటంతో మమతపై వేటు పడుతుందని అందరూ భావించారు. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకే టీజీఓ సంఘం తరఫున జోనల్ కమిషనర్ మమత సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలపడంతో ఇప్పట్లో ఆమె పై వేటు పడదని అందరూ అనుకున్నప్పటికీ… శనివారం GHMC పరిధిలో జోనల్ కమిషనర్ లకు స్థాన చలనం కల్పించి మమతను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ డైరెక్టర్ గా బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. ఆమె స్థానంలో ఐఏఎస్ అధికారి అభిలాష అభినవ్ ను కూకట్ పల్లె జోనల్ కమిషనర్ గా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
శేరిలింగంపల్లి కమిషనర్ సైతం బదిలీ….
మమత తో పాటు శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ సైతం బదిలీ అయ్యారు.GHMC పరిధిలో శ్రీనివాస్ రెడ్డి డిప్యూటేషన్ ప్రభుత్వం రద్దు చేసింది.చేనేత,జవులి శాఖ అదనపు డైరెక్టర్ గా పాత చోటికే ప్రభుత్వం అతన్ని బదిలీ చేసింది.అతని స్థానంలో ఐఏఎస్ అధికారి స్నేహ శబరేష్ నియామకం అయ్యారు.GHMC సుపెరెందెంట్ ఇంజనీర్ వెంకట రమణ ను మూసి అభివృధి సంస్థ ఏస్ ఈ గా నియమించింది.ప్రస్తుతం మూసి అభివృధి సంస్థ ఏస్ ఈ గా ఉన్న మల్లిఖార్జున ను ఈ ఎన్సి ఆఫీస్ లో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.