Stranger Things 5 OTT: ఓటీటీ సూపర్ హిట్ సిరీస్‌‌లో కొత్త సీజన్.. స్ట్రేంజర్ థింగ్స్ 5 రిలీజ్ డేట్ ప్రకటన

Best Web Hosting Provider In India 2024

Stranger Things 5 OTT Streaming Date: ఓటీటీ ప్రపంచంలో సూపర్ హిట్ అయిన సిరీసుల్లో స్ట్రేంజర్ థింగ్స్ ఒకటి. ఇదొక మంచి ఫీల్ గుడ్ వెబ్ సిరీస్. విచిత్రమైన పవర్స్‌తో ఉన్న మనుషులు చేసే విన్యాసులు ప్రేక్షకులను కట్టిపడేసాయి. అందుకే ఎన్ని సీజన్స్ వచ్చినా అవి హిట్ అవుతూ వస్తున్నాయి. స్ట్రేంజర్ థింగ్స్ సిరీసులో ఇప్పటికీ నాలుగు సీజన్స్ వచ్చాయి. వాటన్నింటికి ప్రపంచవ్యాప్తంగా సూపర్ క్రేజ్ వచ్చింది.

 

ట్రెండింగ్ వార్తలు

అయితే, త్వరలో ఈ స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ ముగియనుంది. ఈ సిరీస్ నుంచి చివరి సీజన్‌ను (Stranger Things Season 5 ) మేకర్స్ తీసుకురానున్నారు. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన ఈ సైన్స్ ఫిక్షన్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ ఐదో సీజన్‌తో పూర్తి కానుంది. స్ట్రేంజర్ థింగ్స్ 5 సీజన్ షూటింగ్ ఇటీవలే అధికారికంగా ప్రారంభమైంది. జనవరి 5న స్ట్రేంజర్ థింగ్స్ ఐదో సీజన్ ప్రారంభమైనట్లు ఇటీవలే మేకర్స్ తెలిపారు.

ఈ స్ట్రేంజర్ థింగ్స్ 5వ సీజన్‌లో హాకిన్స్ రహస్యాలు మరింత క్లిష్టంగా మారడంతో అందులోని పాత్రల భవిష్యత్తు విచిత్రంగా మారనుందని మేకర్స్ పేర్కొన్నారు. ఈ షూటింగ్ ద్వారా పాత్రల్లో నటించే నటీనటులు, సాంకేతిక సిబ్బంది మళ్లీ ఇబ్పందులు పడనున్నారని సరదాగా చెప్పుకొచ్చారు. అయితే, ఇంతకుముందు ఈ పాపులర్ సిరీస్ రిలీజ్ డేట్ విషయంలో చాలా అనుమానాలు నెలకొన్నాయి. ఇప్పుడు వాటన్నింటిని పటాపంచలు చేస్తూ డేట్ కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ స్ట్రేంజర్ థింగ్స్ 5వ సీజన్‌ను నెట్ ఫ్లిక్స్‌లో వచ్చే ఏడాది అంటే 2025 సంవత్సరంలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. అయితే, రిలీజ్ డేట్ అనుకున్న ఇప్పుడు అయితే దాన్ని తెలుపలేదు. కేవలం 2025లో రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే జూన్ 2023లో ప్రారంభం కావాల్సిన స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 షూటింగ్ హాలీవుడ్‌లో SAG-AFTRS సమ్మే కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది.

 

హాలీవుడ్‌లో ఎస్ఏజీ-ఏఎఫ్టీఆర్ఏ సమ్మే సుమారు 140 రోజులపాటు జరిగింది. దాంతో స్ట్రేంజర్ థింగ్స్ మేకర్స్ ప్రొడక్షన్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ సమ్మే కారణంగా స్ట్రేంజర్ థింగ్స్ 5వ సీజన్ షూటింగ్ దాదాపు ఏడు నెలల ఆలస్యం అయింది. ఇలా చాలా లాంగ్ గ్యాప్ తర్వాత నెట్ ఫ్లిక్స్ స్ట్రేంజర్ థింగ్స్ చివరి సీజన్ అట్లాంటాలో ఘనంగా, అధికారికంగా ప్రారంభమైంది.

స్టూడియో ఫ్లోర్‌లో చిత్రీకరించిన సన్నివేశంలో జో కీరీ (స్టీవ్), నటాలియా డయ్యర్ (నాన్సీ), మాయా హాక్ (రాబిన్), చార్లీ హీటన్ (జోనాథన్) సహా ప్రధాన తారాగణం హాజరైనట్లు అట్లాంటా ఫిల్మింగ్ వంటి సోషల్ మీడియాలో పోస్ట్‌ల ద్వారా తెలిసింది. కాగా ఈ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5లో కొత్త పాత్రలు ఏమాత్రం రావని మేకర్స్ తెలిపారు. వేగ్నా స్పర్ష వల్ల విస్తుపోయిన మాక్స్‌తో సీజన్ 4 ముగిసింది. సీజన్ 5లో వేగ్నా శాపం మాక్స్‌పై ఎలాంటి ప్రభావం చూపింది, ఏర్పడిన పరిణామాలు ఏంటి అనేవి చూపించనున్నారట.

మాక్స్ శాపాన్ని పోగొట్టడం హాకిన్స్ హీరోలకు పెద్ద సవాలుగా మారుతుందట. ఈ క్రమంలో పరిస్థితులు కీలకమైన పజిల్స్‌గా మారతయాని మేకర్స్ చెబుతున్నారు. అంటే మరింత ఇంట్రెస్టింగ్‌గా స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5ను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

 
WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024