Best Web Hosting Provider In India 2024
SV Traditional Sculpture Institution Admissions Updates : శ్రీ వేంకటేశ్వర సాంప్రదాయ ఆలయ శిల్ప కళాశాలలో ప్రవేశాలకు సంబంధించి అప్డేట్ ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం. 2023-24 విద్యాసంవత్సరానికి గాను సాయంత్రం కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు జనవరి 20వ తేదీ వరకు పెంచినట్లు తెలిపింది.
ట్రెండింగ్ వార్తలు
ఏడాది కాలం శిక్షణ కలిగిన సర్టిఫికేట్ కోర్సులైన “సంప్రదాయ కళంకారి కళ” మరియు “శిల్పకళాలలో ప్రాథమిక అంశాలు (Basics in Sculpture)” అనే కోర్సులు నూతనంగా ప్రవేశ పెట్టారు. కళాశాలలో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. పూర్తి చేసిన దరఖాస్తులను జనవరి 20వ తేదీ సాయంత్రంలోపు కళాశాలలో సమర్పించాల్సి ఉంటుంది. కోర్సులో ప్రవేశం పొందేందుకు 10 వ తరగతి పాసై ఉండాలి. వీరికి గరిష్ట వయో పరిమితి లేదు. ఇతర వివరాల కోసం ప్రిన్సిపాల్, ఎస్వీ సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప శిక్షణ కళాశాల, అలిపిరి రోడ్, బాలాజీ లింక్ బస్టాండ్ పక్కన, తిరుపతిలో గానీ, 0877-2264637, మొబైల్ నెం.9866997290 నంబర్లను గానీ సంప్రదించాలని టీటీడీ పేర్కొంది.
తిరుమలలో ధార్మిక సదస్సు – టీటీడీ ఈవో ధర్మారెడ్డి
తిరుమల ఆస్థాన మండపంలో ఫిబ్రవరి 3 నుండి 5వ తేదీ వరకు టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ధార్మిక సదస్సను నిర్వహించనున్నారు. ఈ ధార్మిక సదస్సుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు.
ఈవో మాట్లాడుతూ… తిరుమల ఆస్థాన మండపంలో నిర్వహించనున్న ధార్మిక సదస్సుకు దేశంలోని ప్రముఖ మఠాధిపతులు, పీఠాధిపతులను ఆహ్వానించాలని అధికారులను ఆదేశించారు. సదస్సుకు విచ్చేసే స్వామీజీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం, వసతి, రవాణా ఏర్పాటు చేయాలన్నారు. సదస్సులో స్వామీజీల సూచనలు, సలహాల మేరకు సనాతన హైందవ ధర్మ ప్రచారంకు చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వివరించారు.
టీటీడీ ట్రస్టులకు రూ. 40 లక్షలు విరాళం
హైదరాబాదుకు చెందిన కె.వి రాజశేఖర్ కు చెందిన జెకెసి ప్రాజెక్ట్సు లిమిటెడ్ సంస్థ ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 లక్షలను అందించింది. శ్రీ కొల్లి గోపాలకృష్ణ అన్నదానం ట్రస్టుకు రూ.10 లక్షలు, శ్రీ కొల్లి మాధవ అన్నదానం ట్రస్టుకు రూ.10 లక్షలు, ఢిల్లీకి చెందిన శివంగ్ కౌర్ బర్డ్ ట్రస్టుకు మరో రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాతల ప్రతినిధులు మణిరెడ్డి, తిరుపతికి చెందిన వై.రాఘవేంద్ర కలిసి విరాళం డిడిలను తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అందజేశారు.