Hi Nanna OTT: ఓటీటీలో హాయ్‍నాన్నకు సూపర్ రెస్పాన్స్.. ట్రెండింగ్‍లో టాప్.. వేరే భాషల్లోనూ..

Best Web Hosting Provider In India 2024

Hi Nanna OTT: నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘హాయ్ నాన్న’ చిత్రం మంచి వసూళ్లను రాబట్టడంతో పాటు చాలా ప్రశంసలను దక్కించుకుంది. మంచి ఫీల్ గుడ్ సినిమాగా పేరు తెచ్చుకుంది. డిసెంబర్ 7న థియేటర్లలో రిలీజ్ అయిన ‘హాయ్ నాన్న’ సుమారు రూ.75కోట్ల కలెక్షన్లతో కమర్షియల్‍గానూ సక్సెస్ అయింది. లవ్ ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించారు. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్, లవ్ స్టోరీతో చాలా మంది హృదయాలను హాయ్ నాన్న హత్తుకుంది. ఇటీవలే ఈ చిత్రంలో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అందుబాటులో వచ్చింది.

 

ట్రెండింగ్ వార్తలు

హాయ్ నాన్న సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో జనవరి 4వ తేదీన తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రానికి నెట్‍ఫ్లిక్స్‌లో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. తెలుగుతో పాటు మిగిలిన భాషల్లోనూ దూసుకెళుతోంది.

టాప్-10లో మూడు స్థానాల్లో..

నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ప్రస్తుతం (జనవరి 7) హాయ్ నాన్న తెలుగు వెర్షన్ ట్రెండింగ్‍లో టాప్‍లో ఉంది. నేషనల్ వైడ్‍లో టాప్ ప్లేస్‍కు చేరింది. టాప్-10లో హాయ్ నాన్న హిందీ వెర్షన్ 5వ ప్లేస్‍లో, తమిళ వెర్షన్ 10వ ప్లేస్‍లో ట్రెండ్ అవుతున్నాయి. మొత్తంగా ప్రస్తుతం నెట్‍ఫ్లిక్స్ ఇండియా టాప్-10లో మూడు ప్లేస్‍ల్లో హాయ్ నాన్న ఉంది. ఈ విషయాన్ని ఈ చిత్రాన్ని నిర్మించిన వైరా ఎంటర్‌టైన్‍మెంట్ నేడు ట్వీట్ చేసింది.

హాయ్ నాన్న సినిమాలో నాని, మృణాల్ ఠాకూర్ పర్ఫార్మెన్స్‌ అందరినీ ఆకట్టుకుంది. నాని కూతురిగా నటించిన బేబి కియారా ఖన్నా కూడా మెప్పించారు. జయరాం, ప్రియదర్శి, నాజర్, విరాజ్ అశ్విన్, అంగద్ బేడీ ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషించారు. స్టార్ హీరోయిన్ శృతి హాసన్.. ఓడియమ్మ సాంగ్‍లో క్యామియో చేశారు.

హాయ్ నాన్న సినిమాకు మ్యూజిక్ పెద్ద ప్లస్‍గా నిలిచింది. హేషమ్ అబ్దుల్ వాహబ్ అందించిన పాటలు, బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకున్నాయి. ఈ ఫీల్ గుడ్ మూవీకి మరింత బలాన్ని చేకూర్చాయి. వైరా ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై మోహన్ చెరుకూరి, విజేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. సాను వర్గీస్.. సినిమాటోగ్రఫీ కూడా ఈ మూవీకి మరింత వాల్యూ యాడ్ చేసింది.

 

హాయ్‍నాన్న చిత్రాన్ని నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో చూసిన చాలా మంది ప్రశంసిస్తున్నారు. సినిమా అద్భుతంగా ఉందని, ఎమోషనల్‍గా కనెక్ట్ అయ్యామంటూ సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లో చూసిన చాలా మంది కూడా ఓటీటీలో మళ్లీ ఈ చిత్రాన్ని చూస్తున్నామంటూ పోస్టులు చేస్తున్నారు.

మూడోసారి చూస్తున్నా: అడివి శేష్

హాయ్ నాన్న చిత్రాన్ని తాను మూడోసారి చూస్తున్నానని యంగ్ హీరో అడివి శేష్ ట్వీట్ చేశారు. ఫస్ట్ టైమ్ థియేటర్లో చూసి.. మళ్లీ ఓటీటీలో చూస్తున్నానని తెలిపారు. నాని, మృణాల్ ఠాకూర్, కియారా ఖన్నా అద్భుతంగా పర్ఫార్మ్ చేశారని ప్రశంసించారు. అందరూ కలిసి మ్యాజిక్ చేశారని, ఆ మెజిషియన్ డైరెక్టర్ శౌర్యువ్ అంటూ శేష్ పొగిడారు. హేషమ్ అబ్దుల్ వాహబ్, సాహు జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ గురించి కూడా ప్రస్తావించారు. కోట్లాది మంది హృదయాలను హాయ్ నాన్న తాకిందని, క్లాసిక్ అంటూ శేష్ రాసుకొచ్చారు.

చాలా మంది ప్రముఖులు, నెటిజన్లు కూడా హాయ్ నాన్న సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024