Vijay Rashmika Engagement: విజయ్, రష్మిక పెళ్లి చేసుకోబోతున్నారా.. వచ్చే నెలలోనే ఎంగేజ్‌మెంట్?

Best Web Hosting Provider In India 2024

Vijay Rashmika Engagement: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా మధ్య ప్రేమ పుకార్లు కాదు నిజమే అన్నట్లుగా తాజాగా వస్తున్న వార్తలు చెబుతున్నాయి. వీళ్లిద్దరూ ఇక ఈ పుకార్లకు చెక్ పెట్టి అఫీషియల్ గా తాము కపుల్ అని చెప్పడానికి రెడీ అయిపోతున్నట్లు తెలుస్తోంది. విజయ్, రష్మిక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని, ఫిబ్రవరి రెండో వారంలోనే వీళ్ల నిశ్చితార్థం అని ఓ రిపోర్ట్ వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

తాజాగా న్యూస్18 వెబ్‌సైట్‌లో వచ్చిన న్యూస్ ప్రకారం.. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా త్వరలోనే తమ ఎంగేజ్‌మెంట్ కు సంబంధించి ప్రకటన కూడా చేయనున్నారట. దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినా.. ఈ వార్త మాత్రం బాగా వైరల్ అవుతోంది. ఈ లవ్ బర్డ్స్ మధ్య ప్రేమ, వెకేషన్ వార్తలు చాన్నాళ్లుగా వస్తున్నా.. వీళ్లు ఎప్పుడూ బయటపడలేదు.

ఇప్పుడు పెళ్లి, నిశ్చితార్థం విషయంలోనూ వాళ్లు అదే సీక్రెసీని మెయింటేన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. గీత గోవిందం మూవీలో తమ ఆన్‌స్క్రీన్ కెమెస్ట్రీతో అదరగొట్టిన ఈ జంట.. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాలో కలిసి నటించింది. విజయ్ నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ మూవీలోనూ ఓ స్పెషల్ సాంగ్ లో రష్మిక నటించింది. ఇక ఈ కపుల్ గతేడాది మాల్దీవ్స్ వెకేషన్ కు కూడా కలిసి వెళ్లారని, తర్వాత దీపావళి పండుగను కూడా రష్మిక విజయ్ ఇంట్లోనే జరుపుకుందని ఫొటోలతో సహా ఫ్యాన్స్ నిరూపించే ప్రయత్నం చేశారు.

గతేడాది హాయ్ నాన్న ప్రీరిలీజ్ ఈవెంట్లోనూ వీళ్ల మాల్దీవ్స్ వెకేషన్ ఫొటోలు వైరల్ అయ్యాయి. అంత పెద్ద మూవీ ఈవెంట్లోనే వీళ్ల ఫొటో ప్రత్యక్షం కావడం పెద్ద దుమారం రేపినా.. వీళ్ల మధ్య రిలేషన్‌షిప్‌నైతే కన్ఫమ్ చేసిందని ఫ్యాన్స్ ఫిక్సయ్యారు. ఇక ఇప్పుడు ఏకంగా వీళ్ల నిశ్చితార్థం, పెళ్లి వార్తలే బయటకు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు కాకపోయినా త్వరలోనే వీళ్ల పెళ్లి మాత్రం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.

నిజానికి యానిమల్ ప్రమోషన్లలో భాగంగా అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షోలోనూ రష్మిక, విజయ్ దొరికిపోయారు. విజయ్ కి ఫోన్ చేసి స్పీకర్లో పెట్టి మరీ రష్మికతో మాట్లాడించి బాలయ్య బాబు వీళ్లను ఇరికించాడు. ఇవన్నీ ఈ కపుల్ తమ మధ్య రిలేషన్‌షిప్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేసేలా చేస్తాయనడంలో సందేహం లేదు.

ఇక వీళ్లిద్దరి సినిమాల విషయానికి వస్తే.. రష్మిక తన లేటెస్ట్ మూవీ యానిమల్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంటే.. విజయ్ మాత్రం మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. లైగర్, ఖుషీలు బాక్సాఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశపరిచాయి. సంక్రాంతికి వస్తుందనుకున్న ఫ్యామిలీ స్టార్ మూవీ వాయిదా పడింది.

ఇక అతని నెక్ట్స్ మూవీ జెర్సీ మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో చేయనున్నాడు. ప్రస్తుతం కెరీర్ పరంగా విజయ్ టైమ్ అంత బాగున్నట్లు కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తన వ్యక్తిగత జీవితం గురించి ఈ రౌడీ హీరో ఏదైనా ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ చేస్తాడేమో చూడాలి.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024