Best Web Hosting Provider In India 2024

Vijayawada West Constituency MLA Vellampalli’s difficultiesVja Statue Politics: విజయవాడ పశ్చిమ నియోజక వర్గం నుంచి మరోసారి తానే పోటీ చేస్తానని భావించిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రకరకాల ప్రయత్నాలతో ఓటర్లకు చేరువయ్యే ప్రయత్నాలు చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వైసీపీ అధిష్టానం మాత్రం ఆయనకు ఝలక్ ఇచ్చింది. పశ్చిమలో కాదని విజయవాడ సెంట్రల్ టిక్కెట్ కేటాయించింది. కొత్త నియోజక వర్గంలో కుదురుకోడానికి వెల్లంపల్లి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు
పశ్చిమ టిక్కెట్ తనకే దక్కుతుందనే విశ్వాసంతో వెల్లంపల్లి కొద్ది నెలలుగా విగ్రహాల ఏర్పాటుతో ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేశారు. నియోజక వర్గం పరిధిలోని కీలకమైన కూడళ్లలో కార్పొరేషన్ అనుమతి లేకపోయినా విగ్రహాలన ఏర్పాటు చేయించారు.
భవానీపురం శివాలయం కూడలికి వైఎస్సార్ విగ్రహం పెట్టింది. ఆ కూడలికి వైఎస్సార్ జంక్షన్ అని ప్రకటించారు. విగ్రహావిష్కరణ సమయంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల వెల్లంపల్లిని మళ్లీ ప్రజలు గెలిపించాలని ప్రకటించడంతో సీటు తనదేనని భావించారు.
పశ్చిమ నియోజక వర్గంలో జనసేన-టీడీపీ కూటమి బీసీ అభ్యర్థిని బరిలోకి దింపుతుందనే ప్రచారంతో ఓ వర్గం ఓటర్లను ఆకట్టుకోడానికి విగ్రహ ఏర్పాటుకు పూనుకున్నారు. హైదరాబాద్ బైపాస్ మార్గంలో అత్యంత రద్దీగా ఉండే ప్రదేశంలో కార్పొరేషన్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా మాజీ ఎమ్మెల్యే మరుపిళ్ల చిట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు.
స్థానికుల నుంచి అభ్యంతరాలు రాకుండా ఉండేందుకు అక్కడ వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని ప్రచారం చేసి చివరి నిమిషంలో మరో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. స్థానికుల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు వెల్లంపల్లి అబద్దాలు చెప్పారని స్థానికులు అక్రోశం వ్యక్తం చేసిన సమయంలోనే ఆయన సీటు గల్లంతైంది.
పశ్చిమ నియోజక వర్గం నుంచి మార్చేసి విజయవాడ సెంట్రల్‌నియోజక వర్గానికి షిఫ్ట్ చేశారు. దీంతో వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేను వ్యతిరేకించే వారంతా సంబరాలు చేసుకున్నారు. ఓటర్లను ఆకర్షించడానికి మాజీ మంత్రి ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఉపయోగం లేకపోయిందని చెబుతున్నారు.
కార్పొరేటర్ల గొంతెమ్మ కోర్కెలు…
ఇక విజయవాడ సెంట్రల్‌లో పట్టు పెంచుకోడానికి అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసిన వెల్లంపల్లికి కార్పొరేటర్ల కోర్కెల చిట్టా విని షాక్ అయ్యారని ప్రచారం జరుగుతోంది.ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సెంట్రల్ నియోజక వర్గం పరిధిలోని ఒక్కో కార్పొరేటర్‌కు రూ.25లక్షల నగదు, ఎన్నికల కోసం కార్యాలయాల ఏర్పాటు చేయాలని, కార్పొరేషన్ అనుమతుల విషయంలో జోక్యం చేసుకోకూడదని కండిషన్లు పెట్టడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.